Shuru
Apke Nagar Ki App…
బద్వేలు లో విస్తృతంగా వాహనాలు తనిఖీ. -అర్బన్ సీఐ రామకృష్ణ. బద్వేలు:బద్వేలు లో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటోను నిలిపి ఆటో డ్రైవర్కి అర్బన్ సీఐ రామకృష్ణ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆటో కాగితాలను లైసెన్స్ ,ఆర్ సి, కాకి చొక్కా తప్పనిసరిగా ఉండాలని ఓవర్ లోడ్ ,అధిక స్పీడు వెళ్తే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జీ.మౌలాలి.
బద్వేలు లో విస్తృతంగా వాహనాలు తనిఖీ. -అర్బన్ సీఐ రామకృష్ణ. బద్వేలు:బద్వేలు లో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఆటోను నిలిపి ఆటో డ్రైవర్కి అర్బన్ సీఐ రామకృష్ణ సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆటో కాగితాలను లైసెన్స్ ,ఆర్ సి, కాకి చొక్కా తప్పనిసరిగా ఉండాలని ఓవర్ లోడ్ ,అధిక స్పీడు వెళ్తే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తేదీ.14.04.2026.కడప *కడప టీడీపీ NRI కార్యాలయంలో డా" బీ.ఆర్.అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి నివాళులర్పించిన కడప తెలుగుదేశం పార్టీ నాయకులు* కడప నగర తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కువైట్ ఎన్నారై ఉపాధ్యక్షులు రహమతుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135,వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయనను స్మరించుకుంటూ జై భీమ్ అనే నినాదలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, పేద బడుగు బలహీన వర్గాల శ్రేయస్ కొరకు దేశఅభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారన్నారు. సమాజంలో అంటరానితనం నిర్ములన,వివక్షపైన అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుంటు వారి ఆశయ సాధనాలను కొనసాగించే విధంగా పాటుపడదామన్నారు. ఈ కార్యక్రమంలో, కడప 26వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ చవలముడి శంకర్ గారు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు ఇల్లూరి ఓబులేసు, టిఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు అనిల్, టిడిపి జిల్లా సీనియర్ నాయకులు మలిశెట్టి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ నగర ఉపాధ్యక్షురాలు వంకేల ఆనందరావు, ఎస్సీ సెల్ నాయకులు ఊటుకూరు వీరయ్య, తిత్తల విశ్వనాధ్, స్వర్ణ లక్ష్మీనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ నగర నాయకులు షేక్ ఇర్ఫాన్,షేక్ సాద్,తదితరులు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు...1
- కడప జిల్లా కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లుతూ సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన అపార సేవలను స్మరించుకొని, ఆయన చూపిన మార్గంలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.1
- Post by Bondhu Suresh1
- అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు పట్టాలు అందిస్తాం.. * ముదివర్తిలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పట్టాలు పంపిణీ చేసిన కాలనీకి జై భీమ్ నగర్ గా నామకరణం చేసామన్నారు. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చి దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని గత 25 ఏళ్లు గా ప్రజలు ఎదురుచూస్తున్న పట్టాల పంపిణీ కార్యక్రమం తో ప్రజల కల నెరవేరిందన్నారు.జరిగిన 22 నెలల్లో ముదివర్తి గ్రామాని అభివృద్ధి కి 2 కోట్ల 29 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.4
- నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు పీఎం రాహత్ పథకం ను ప్రారంభించిన డాక్టర్ అజిత వేజెండ్ల IPS SP నెల్లూరు రోడ్ ప్రమాద బాధితులకు వరం పీఎం రాహాత్ పథకం మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి.నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ రోడ్డు ప్రమాద బాధితులకు మేలు చేసేలా పీఎం రాహత్ పథకం ఉంది అని వారికి వెంటనే చికిత్స అందించి మరణాల రేటు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహాత్ పథకం తీసుకొచ్చింది అని సోమవారం నుంచి పైలట్ విధానంలో భాగంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో కలదు అని జిల్లా అడిషనల్ SP శ్రీమతి సౌజన్య గారు తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన పథకం ద్వారా 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుంది. ప్రమాదం జరిగిన మెడికవర్ హాస్పిటల్ లో చేరిన తరువాత 7 రోజుల వరకు వర్తిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112కు కాల్ చేస్తే బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఆసుపత్రి యాజమాన్యం బాధితుడి వివరాలు ఈ డ్యాష్ పోర్టల్‌లో నమోదు చేస్తుంది. చికిత్స ఖర్చును ప్రభుత్వం ఆసుపత్రికి చెల్లిస్తుంది. బాధితుడు ఏ రాష్ట్రమైతే చెందిన వారైనా ఏ దేశానికి చెందినవారైనా పథకం వర్తిస్తుంది. ఈ కార్యక్రమం లో Dsp గట్టమనేని శ్రీనివాసు గారు, రూరల్ CI వేణు గారు,మెడికవర్ హాస్పిటల్ డాక్టర్స్ డా"శశిదర్ రెడ్డి డాక్టర్ ఉదయ్,మరియు డాక్టర్ దినేష్ పాల్గొన్నారు1
- బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.1
- బద్వేలు, ఏప్రిల్ 14: బద్వేలు టౌన్ నెల్లూరు రోడ్ లోని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త, సంఘ సంస్కర్త, అపర మేధావి అయిన భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దేశానికి దిక్సూచిని అందించిన మహానుభావుడని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి పరిచయం చేసి మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,అరవ శ్రీనివాసుల రెడ్డి,పాలకొండ రాజశేఖర్ రెడ్డి,ఆర్య వైశ్య కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకట సుబ్బయ్య, కడప జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు జహంగీర్ భాష,ఓబుల రెడ్డి రమణ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి, బీజేముల చంద్ర శేఖర్ రెడ్డి,పఠాన్ మౌలాలి,గోపి రెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి,బోవిళ్ళ నరసింహారెడ్డి,సిమెంట్ సుబ్బారెడ్డి,పసుపులేటి ప్రసాద్,గురు ప్రసాద్ రెడ్డి, గంగాధర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి ,సాంబశివ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి, బ్రహ్మదండ శ్రీనివాసులు,గంగిపోగు నరసింహులు,ఎద్దుల ప్రసాద్ మాజీ జడ్పీటీసీ,అంబేద్కర్ విగ్రహా కమిటీ సభ్యులు చెంద్రాయుడు తదితరులు పాల్గొన్నారు.1
- *బద్వేల్లో మొదటిసారిగా డ్రోన్ కెమెరాని ఎగరవేషణ అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై కొండారెడ్డి గారు* *నేరాల నియంత్రణ కోసం డ్రగ్స్ అండ్ ఓపెన్ డ్రింక్ ను అరికట్టేందుకు డ్రోన్ కెమెరా విజువల్స్ పరిశీలిస్తున్న సిఐ, ఎస్ఐ గారు*2
- కడప జిల్లా కడప నగరంలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు 8 నెలలు ట్రైనింగు ట్రైనింగ్ సమయంలో నెలకు 10,000 నుంచి 15000 వరకు తరువాత జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత నెలకు 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు వస్తుంది ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది రూము ఫుడ్ అకామిషను మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్ వర్క్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వరకు ఉంటుంది సంప్రదించాల్సిన వ్యక్తి :-93461102391