మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగ మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగ శంఖవరం: మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా శంఖవరం మండలం శంఖవరం గ్రామానికి చెందిన బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగ ఎన్నికయ్యారు. ఎమ్మార్పీఎస్ మహిళా సమైక్యకు సంబంధించిన బాధ్యతలను ఆమెకు అప్పగించడంపై పలువురు నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, మహిళల హక్కులు, మాదిగ మహిళల సమస్యల పరిష్కారం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బుల్లెమ్మ మాదిగ మరింత చురుకుగా పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలో మహిళలకు సముచిత గౌరవం, హక్కులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగను హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నాయకత్వంలో మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లాలో మరింత బలోపేతం కావాలని, మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షురాలిగా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని బుల్లెమ్మ మాదిగ తెలిపారు.
మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగ మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగ శంఖవరం: మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా శంఖవరం మండలం శంఖవరం గ్రామానికి చెందిన బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగ ఎన్నికయ్యారు. ఎమ్మార్పీఎస్ మహిళా సమైక్యకు సంబంధించిన బాధ్యతలను ఆమెకు అప్పగించడంపై పలువురు నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, మహిళల హక్కులు, మాదిగ మహిళల సమస్యల పరిష్కారం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బుల్లెమ్మ మాదిగ మరింత చురుకుగా పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. మహిళలను సంఘటితం చేసి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సమాజంలో మహిళలకు సముచిత గౌరవం, హక్కులు కల్పించే దిశగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బొడ్డపాటి బుల్లెమ్మ మాదిగను హృదయపూర్వకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నాయకత్వంలో మాదిగ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లాలో మరింత బలోపేతం కావాలని, మహిళల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. జిల్లా అధ్యక్షురాలిగా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని బుల్లెమ్మ మాదిగ తెలిపారు.
- ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ సేవలు ప్రారంభం-తుమ్మపాలలో కొత్త వెలుగులు అనకాపల్లి:సామాజిక సేవే పరమావధిగా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూతనందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం వి ఆర్) చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు ( ఎం వి ఆర్) మాట్లాడుతూ... సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదల్లో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం, లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిరభ్యంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికీ కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా నిచ్చారు.సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సీఈవో బలరామ్, సి పీఆర్‌ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్ ల సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్‌చార్జ్ గైపూరి రాజుతో పాటు ఎం వి ఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రాతిపదికగా సేవారంగంలోకి అడుగుపెట్టిన ‘ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతి నిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 08924. 2378964
- శ్రీ శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 II గాజువాక II విశాఖపట్నం శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి పండగ పాట 2026 గాజువాక II విశాఖపట్నం1
- డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.1
- రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలేంటి? మంత్రుల ఫొటోలపై ఖమ్మం మహిళ ఫైర్ ఖమ్మం: రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఓ మహిళ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు వేయడం ఎప్పుడైనా చూశామా? ఇదేం పద్ధతంటూ ప్రశ్నించారు. రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటోలు వేస్తారా? అని నిలదీశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులందరి ఫొటోలు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- మా కూతురు మాటలతో మాకు సంబంధం లేదు..భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఏం మాట్లాడను – భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.3
- నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.1
- మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1