యూపీఐ లావాదేవీలు రూ. 1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదే! మనదేశంలో ప్రస్తుతం యూపీఐ ద్వారా చెల్లింపుల సేవలు ఎక్కువగా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది లిక్విడ్ క్యాష్ బదులుగా ఈ సేవలనే ఎంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ సేవలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో సులభంగా ఈ డిజిటల్ చెల్లింపుల పెరిగిపోయాయి. అయితే మన దేశంలో యూపీఐ వినియోగం ఎక్కువగా పెరగడంతో రోజు కొన్ని లక్షల మంది లావాదేవీలు జరపడంతో ఇక వెయ్యి రూపాయలు దాటితే యూపీఐ ద్వారా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అయితే దీనిపై ఎన్‌పీసీఐ స్పందించింది. వ్యక్తుల మధ్య.. వ్యక్తులు, వ్యాపారం మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని సమాచారం. ఇలాంటి వార్తను నమ్మకూడదు అని చెబుతోంది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా యుగంలో చాలా మంది యూపీఐ చెల్లింపులపైనే ఆధారపడ్డారు. ఎక్కువగా గతంలో లిక్విడ్ క్యాష్ ఉపయోగించడం వల్ల సమస్య కూడా ఏర్పడేది. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎక్కడైనా వెళ్లి షాపింగ్ సులభంగా చేయవచ్చు. రవాణా, షాపింగ్ ఇది కేవలం ఈ యూపీఐ లావాదేవీలతో జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్త వైరల్ అవుతూ వస్తుంది. అయితే కేవలం సాధారణ కష్టమర్లకు బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించినంత మాత్రానా ఈ ఛార్జీలు వసూలు చేయావని ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే ఈ గందరగోళానికి ప్రధాన కారణం పేటీఎం అమెజాన్ లేదా ఫోన్ పే వాలెట్‌లో డబ్బును రీఛార్జ్ చేస్తే దుకాణా దారుడికి రెండు వేల కంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని కస్టమర్ భరించరని గుర్తుంచుకోవాలి . ఇది బ్యాంకు కంపెనీ మధ్య జరుగుతోంది. ఇంక చాలామందికి ప్రతిరోజు యూపీఐ ద్వారా గరిష్టంగా లక్ష వరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంది. కొన్ని ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు మాత్రం ఐదు లక్షల వరకు చెల్లించవచ్చు. అయితే ప్రధానంగా మీరు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసినప్పుడు పిన్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. మోసానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- Post by ఉంగరాల కార్తీక్1
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1