logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు :ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో వివరాలు సమర్పించని ప్రతి ఓటరు తమ బాధ్యతగా వెంటనే వివరాలు అందించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 64.65 శాతం మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో దేవాలయాలకు వచ్చే భక్తులతో పాటు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కల్పించడంతోపాటు.. ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి ఓటు అత్యంత కీలకమని అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముగియడానికి మరో మూడు రోజుల సమయం ఉన్నందున అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణుల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణుల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించి అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ అంతిరెడ్డి, బండి శంకర్, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

6 hrs ago
user_KUMAR
KUMAR
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
6 hrs ago
148aef79-9ab3-4999-bd19-53de219a27a5

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు :ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో వివరాలు సమర్పించని ప్రతి ఓటరు తమ బాధ్యతగా వెంటనే వివరాలు అందించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 64.65 శాతం మాత్రమే నమోదు కావడం జరిగిందని తెలిపారు. బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో దేవాలయాలకు వచ్చే భక్తులతో పాటు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కల్పించడంతోపాటు.. ప్రక్రియలో పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి ఓటు అత్యంత కీలకమని అన్నారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ముగియడానికి మరో మూడు రోజుల సమయం ఉన్నందున అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణుల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణుల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించి అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ అంతిరెడ్డి, బండి శంకర్, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.
    1
    గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    3
    ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి.
ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది.
ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు.
వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్
    1
    ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి
కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం 
ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు 
- పవన్ కళ్యాణ్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    6 hrs ago
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*

*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
#Thankyou teenmarmallanna 🙏
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
    1
    మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి.
వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    23 hrs ago
  • బూరుగుపల్లిలో గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాలకు సర్వం సిద్ధం పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.
    1
    బూరుగుపల్లిలో గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాలకు సర్వం సిద్ధం
పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    4
    విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన..
విద్యార్థులను ఉద్దేశించి 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన..
హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. 
విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Praveen
    Praveen
    రిపోర్టర్ బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.