logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కరరావు ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం తుర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు.. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నమోదు, మందుల లభ్యత, వైద్య పరీక్షలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మెరుగ్గా అందేలా చూడాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఇంచార్జ్ కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుర్కపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇంచార్జ్ కలెక్టర్ ఈ సందర్భంగా ఇన్ ఛార్జ్ కలెక్టర్ ...కార్యాలయంలోని వివిధ రికార్డులు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ,రెసిడెన్స్ తదితర ధ్రువపత్రాలు పరిశీలించి సకాలంలో అందజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను, అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చేయూత పెన్షన్ , ఫామ్ పాండ్ కు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.చేయూత పథకం, సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను వేగవంతం చేసి, ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

1 hr ago
user_గడ్డమీది చంద్రయ్య
గడ్డమీది చంద్రయ్య
Bhongir, Yadadri Bhuvanagiri•
1 hr ago
2e468697-756d-4752-9828-5ca9bb82fba9

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కరరావు ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం తుర్కపల్లి పీహెచ్‌సీని పరిశీలించిన జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు.. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, రోగుల నమోదు, మందుల లభ్యత, వైద్య పరీక్షలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు మెరుగ్గా అందేలా చూడాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఇంచార్జ్ కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను

7a97f0e8-bbc3-4006-9f86-e7c51b42d134

అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుర్కపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఇంచార్జ్ కలెక్టర్ ఈ సందర్భంగా ఇన్ ఛార్జ్ కలెక్టర్ ...కార్యాలయంలోని వివిధ రికార్డులు, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ,రెసిడెన్స్ తదితర ధ్రువపత్రాలు పరిశీలించి సకాలంలో అందజేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అనంతరం తుర్కపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన రికార్డులను, అభివృద్ధి

da2ef2e4-c486-48d8-98ef-fecff4421f54

పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చేయూత పెన్షన్ , ఫామ్ పాండ్ కు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు.చేయూత పథకం, సామాజిక భద్రత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామాల్లో చేపడుతున్న ఫామ్ పాండ్ పనులను వేగవంతం చేసి, ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    1
    ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీరు : పొంగిపొర్లుతున్న చెక్ డ్యామ్
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజి గూడెం గ్రామ వాగులో ఉన్న చెక్‌ డ్యామ్ పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు మంగళవారం తెలిపారు.చెక్‌ డ్యామ్ నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    22 hrs ago
  • క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    1
    క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్
జనగామ:
క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
​ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.
    user_Parushuram goud
    Parushuram goud
    Singer జనగాం, జనగాం, తెలంగాణ•
    23 hrs ago
  • బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.
    1
    బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం
గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ /
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
    1
    బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం!
హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.
    1
    షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.
    user_Sai journalist
    Sai journalist
    బాలాపూర్, రంగారెడ్డి, తెలంగాణ•
    20 hrs ago
  • వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    1
    వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    2 hrs ago
  • BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ *బడే నాగజ్యోతి* గారు BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ *బడే నాగజ్యోతి* గారు
    1
    BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ *బడే నాగజ్యోతి* గారు 
BRS పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ *బడే నాగజ్యోతి* గారు
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    37 min ago
  • _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్. గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/ గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    4
    _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్.
గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/
గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.