చట్టబద్ద ఉపాధి హమి పని హక్కును హరించే రోజ్ గార్ బిల్లు ను ఉపసంహరించుకోవాలి. డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 ను రద్దు చేసే ఉద్దేశంతో ప్రతిపాదించిన వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025' (విజి బి రామ్ జి) ను నరెగా సంఘర్ష్ మోర్చా,డిబిఎఫ్ లు తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ చెప్పారు.శుక్ర వారం నాడు సంగారెడ్డి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కార్మికులతో గానీ, కార్మిక సంఘాలతో గానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లు, చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చేస్తుందన్నారు.ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసహంహరించుకొవాలని డిమాండ్ చేశారు.. *కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారం.నరేగ అనేది డిమాండ్ ఆధారితమైనది మరియు సార్వత్రికమైనదని అంటే, గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా పని కల్పించాల్సిన బాధ్యత చట్టం కల్పిస్తుందన్నారు.. కానీ, కొత్త విబి జి రామ్ జీ బిల్లులోని సెక్షన్ 5(1) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారెంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని దీనర్థం ఒకవేళ కేంద్రం ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదన్నారు. ఇది సార్వత్రిక ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై నడిచే ఒక సాధారణ పథకంగా దిగజార్చుతుందన్నారు. డిమాండ్ ఆధారితం నుండి సరఫరా ఆధారితానికి మార్పు నరేగ బలం దాని డిమాండ్ ఆధారిత స్వభావంలో ఉంద న్నారు.అంటే ప్రజలు పని అడిగిన(డిమాండ్ చేసిన) 15 రోజుల్లోగా పని కల్పించాలి, లేకపోతే నిరుద్యోగ భృతి పొందే హక్కు ఉంటుందని. ఇందులో కూలీల వేతనాలు 100% కేంద్రమే భరిస్తుందని అయితే కొత్త బిల్లులోని సెక్షన్ 4(5) ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణికాల ఆధారంగా, ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపును కేంద్రమే నిర్ణయిస్తుందన్నారు. అంతేకాకుండా సెక్షన్ 4(6) ప్రకారం కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు అయితే దానిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని దీనివల్ల నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉందన్నారు. ఇది నరేగ యొక్క మూల సూత్రమైన డిమాండ్‌ను బట్టి నిధులు అనే విధానాన్ని తలక్రిందులు చేసి, బడ్జెట్‌ను బట్టి డిమాండ్అనే స్థాయికి మారుస్తుందన్నారునరేగ కింద 100% కూలీల వేతనాలు మరియు 75% మెటీరియల్ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఆచరణలో ఇది కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య 90:10 నిష్పత్తిలో ఉంటుందని. కానీ కొత్త బిల్లులోని సెక్షన్ 22(2) ప్రకారం ఈ నిష్పత్తిని ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలకు 90:10గా మిగిలిన ఇతర రాష్ట్రాలకు 60:40గా మార్చారన్నారు. ఈ నిబంధన రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా, పేద మరియు వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ఆర్థిక భారం పెరగడం వల్ల, రాష్ట్రాలు కార్మికుల పని డిమాండ్‌ను నమోదు చేయడానికి వెనుకడుగు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.*ప్రణాళికా తయారీ క్రింది స్థాయి నుండి పై స్థాయికి బదులు, పై నుండి క్రిందికి , 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా, నరేగ లో పనుల ప్రణాళికను స్థానిక అవసరాల ఆధారంగా గ్రామ సభలు నిర్ణయిస్తాయన్నారు. కానీ కొత్త బిల్లులోని షెడ్యూల్ 1, క్లాజ్ 6(4) ప్రకారం వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే వ్యవస్థ రాష్ట్రాలకు, పంచాయతీలకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు. స్థానికంగా జరగాల్సిన ప్రణాళికా రచనను, కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చడం ద్వారా ఇది 73వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తోందన్నారు. సాంకేతిక పర్యవేక్షణ మరియు నిఘా ఇప్పటికే డిజిటల్ హాజరు (ఎన్ యంయంఎస్ ) , ఆధార్ ఆధారిత చెల్లింపుల (ఎబిపి ఎస్) వంటి సాంకేతికతల వల్ల అనేక మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, కొత్త బిల్లు బయోమెట్రిక్ ధృవీకరణను, జియో-స్పేషియల్ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ, కార్మికులపై నిఘా పెంచేలా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధానం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. ఏడాది పొడవునా పని హక్కుపై ఎప్పుడైనా పని అడిగే హక్కు ఉందని, కానీ కొత్త బిల్లులోని సెక్షన్ 6(2) ప్రకారం వ్యవసాయ సీజన్లలో (విత్తనాలు వేసేటప్పుడు, కోతల సమయంలో) పనులు చేపట్టకుండా, ఆర్థిక సంవత్సరంలో మొత్తం 60 రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే నోటిఫై చేయాలని, దీనివల్ల పని అవసరం ఉన్న కార్మికులు, ముఖ్యంగా మహిళలు, కనీసం రెండు నెలల పాటు చట్టబద్ధంగా పనికి దూరమవుతారన్నారు. విబి జి రామ్ జి బిల్లు అనేది సంస్కరణ కాదు, దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగ హక్కుల తిరోగమన్నారు. చట్టబద్ధమైన హక్కును తొలగించి కేంద్రం నియంత్రణలో బడ్జెట్ పరిమితులతో నిఘా నీడలో నడిచే ఒక పథకంగా మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మరియు 73వ రాజ్యాంగ సవరణను అవమానించడమేనని, ఇది అధికారాన్ని కార్మికులు, గ్రామ సభలు మరియు రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కుని కేంద్రం చేతుల్లో పెడుతుందన్నారు. నరేగ సంఘర్ష్ మోర్చా ,డిబిఎఫ్ విబిజి రామ్ జి బిల్లు, 2025ను ఏకగ్రీవంగా తిరస్కరిస్తోందన్నారు. దీనిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు మరియు వారి సంఘాల అనుమతి లేకుండా యంజిఎన్అర్ జిఎ ను రద్దు చేసే లేదా మార్చే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి మూలస్తంభమైన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి, ఈ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించాలని మేము అన్ని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.లక్ష్మీ, సామాజిక కార్యకర్తలు బంగారయ కృష్ణ,గీత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1
- Post by Omnamashivaya S1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- జిల్లా అధ్యక్షుడి ముందు మదనపల్లిలో కష్టపడ్డ కార్యకర్తను పక్కకు తోసి అవమానం1
- నాలుగు నెలలుగా టీచర్ సెలవు మరొక టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఉపాధ్యాయుడు బాధ్యత చేపట్టిన వాలంటీర్ అక్షర సాక్షి /అనంతగిరి,పాడేరు అల్లూరి జిల్లా న్యూస్ డిసెంబర్17 :- అల్లూరి జిల్లా పరిధిలో కొన్ని ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం అనంతగిరి మండలం పెద్దకోట పంచాయితీ వేలమామిడి గ్రామంలో గల పాఠశాలకు గత కొద్ధి రోజులుగా ఉపాధ్యాయులు లేక ఒక వాలంటీర్ ఒక్కడే విద్యార్థులకు విద్య భోదన చేస్తున్నాడు. టీచర్ లేకపోవడం వలన పిల్లలు ఎంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆ వాలంటీర్ మాట్లాడుతూ ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కు గత కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ అవ్వగా సెలవు పెట్టారని శెలవు పై వెళ్లిపోవడం వలన గత నాలుగు నెలలుగా నేనే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానని అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం వలన విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు చెప్పలేకపోతున్నానని, కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంత మంది అర్థం చేసుకోలేకపోతున్నారని దీని వలన విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఇప్పటికైనా గిరిజన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ వర్యులు పాఠశాలకు ఉపాధ్యాయులును నియమించాల్సిందిగా ఆయన కోరారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉంటే ఒక టీచర్ సెలవు పెట్టినా మరొక టీచర్ వుంటారు కానీ ఈ పాఠశాలకు సంబంధించి ఒకరే టీచర్ వుంటారు. ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడి విధులకు సెలవు పెట్టిన తరుణంలో అక్కడ మరొక టీచర్ ను నియమించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులకు ఉందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. అనివార్య కారణాల వలన ఆ వాలంటరీ పాఠశాలకు రాకపోతే పిల్లలు పాఠశాలకు వెళ్లే పనే ఉండదు చదువుకు దూరం కాకపోతే ఇంకేం అవుతుంది ఇంకో విషయం ఏమిటంటే 52 మంది విద్యార్థులు స్థానికంగా ఉన్న వ్యక్తి (వాలంటీర్ ) మాట వింటారా..? అనే కోణంలో ఆలోచించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతారు అనేది మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ కు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు నాలుగు నెలలు సెలవు పెట్టడం ఒకవైపు అయితే నేటి వరకు ఇంకో టీచర్ ను నియమించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అనే విషయం సరికొత్త కోణంగానే భావించాలి.మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ పాఠశాలకు నూతన టీచర్ ను నియమించి గిరిజన విద్యార్థులకు విద్య పూర్తి స్థాయిలో అందేలా చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే...?? టీచర్ నియమించకుండా ఉంటే వారు భవిష్యత్తు నాశనం అవ్వడానికి గల కారణం ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్నార్థకం.?4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి🙏1