logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కల్లూరు వద్ద వాగులో తృటలో తప్పిన ప్రమాదం... వరదలో బైకులతో సహా పడిపోయిన ఇద్దరిని కాపాడిన స్థానికులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ శివారులోని వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైకులతో పాటు వాగులో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, స్థానిక రైతులు, గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఇద్దరినీ, వారి బైకులను సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్లూరు గ్రామ శివారులోని వాగుకు ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో కల్లూరు నుంచి రాయికల్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు బైకులపై లో-లెవల్ బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి బైకులతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కల్లూరు వద్ద వాగులో తృటలో తప్పిన ప్రమాదం... వరదలో బైకులతో సహా పడిపోయిన ఇద్దరిని కాపాడిన స్థానికులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామ శివారులోని వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. వాగుపై ఉన్న లో-లెవల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిని దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు రెండు బైకులతో పాటు వాగులో పడిపోయారు. అయితే అక్కడే ఉన్న మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య, స్థానిక రైతులు, గ్రామస్తులు సాహసోపేతంగా స్పందించి ఇద్దరినీ, వారి బైకులను సురక్షితంగా బయటకు తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కల్లూరు గ్రామ శివారులోని వాగుకు ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో కల్లూరు నుంచి రాయికల్ వైపు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు రెండు బైకులపై లో-లెవల్ బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి బైకులతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు సమయస్ఫూర్తితో స్పందించడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది.

More news from తెలంగాణ and nearby areas
  • వర్ష ప్రభావంతో జగిత్యాల జిల్లాలో హై అలర్ట్...ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, ఎస్పీ. భారీ వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పర్యటించారు. వర్షం వరదల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్–ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు వరద ఉధృతిని పరిశీలించి ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా వాగుల ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, అదేవిధంగా నది ప్రవాహ ప్రాంతాలను చూడడానికి ప్రజలు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
    3
    వర్ష ప్రభావంతో జగిత్యాల జిల్లాలో హై అలర్ట్...ప్రజల్ని అప్రమత్తం చేసిన కలెక్టర్, ఎస్పీ.
భారీ వర్షాల కారణంగా క్షేత్రస్థాయిలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పర్యటించారు. వర్షం వరదల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్–ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వాగు వరద ఉధృతిని పరిశీలించి ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా వాగుల ప్రవాహం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, అదేవిధంగా నది ప్రవాహ ప్రాంతాలను చూడడానికి ప్రజలు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు  వెంటనే సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    31 min ago
  • గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.
    2
    గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ..... కాంగ్రెస్ పార్టీ నేతల సంబరాలు
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా వివిధ న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది.
గతంలో పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని కొందరు భూ నిర్వాసితులు సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), వనశక్తి సంస్థల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతతో ప్రస్తుతం సుమారు 95 శాతం పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది.
8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షా 20 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశముంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతంలోని రైతులకు శాశ్వత సాగునీటి వసతి కలిగి వ్యవసాయాభివృద్ధికి ఊతమివ్వనుంది.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలితంగానే ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమైందని వారు పేర్కొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్ ఆర్టీసీ.. కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం.. సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 
పేద ప్రజల గుండె చప్పుడు.. 
లైఫ్‌లైన్ ఆర్టీసీ..
కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు 
త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ
పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం..
సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి..
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు.
మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.
ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న,
కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి 
బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. 
పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 
ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , 
ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    వేములవాడలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బండ్ పార్క్ ప్రారంభం – బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన – బాసరకు నూతన బస్సు ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన బండ్ పార్క్‌ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డా. సంజయ్, మేడిపల్లి సత్యం సంయుక్తంగా ప్రారంభించారు.
అనంతరం వేములవాడ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేములవాడ–బాసర మధ్య నూతన ఆర్టీసీ బస్సును మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    11 hrs ago
  • మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? - సీఎం రేవంత్ రెడ్డి
    2
    మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి 
మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా?
అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు
నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా?
టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా?
- సీఎం రేవంత్ రెడ్డి
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    3 hrs ago
  • వర్షం దాటికి నారాయణపూర్ లో కూలిన ఆరు ఇళ్ళు... 2000 చొప్పున తక్షణ సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌ లో ఆరు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. పురాతన మట్టి గోడలు, ఇళ్ళ పైకప్పులు కూలిపోయాయి. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామంగా ప్రకటిస్తారని మరమ్మతులు చేయకపోవడంతో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో పురాతన ఇల్లు కూలిపోవడం బాధితులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించి బాధితులను ఓదార్చారు. గ్రామంలోని దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలించి ప్రతి ఇంటి బాధిత కుటుంబానికి తక్షణ అవసరాల కోసం 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. తహశీల్దార్ ఎంపీడీఓ లతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాల వివరాలను సేకరించి నష్టాన్ని అంచనా వేశారు. ఇళ్లు కూలిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరారు.
    4
    వర్షం దాటికి నారాయణపూర్ లో కూలిన ఆరు ఇళ్ళు... 2000 చొప్పున తక్షణ సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్.
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌ లో ఆరు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. పురాతన మట్టి గోడలు, ఇళ్ళ పైకప్పులు కూలిపోయాయి. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపు గ్రామంగా ప్రకటిస్తారని మరమ్మతులు చేయకపోవడంతో ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో పురాతన ఇల్లు కూలిపోవడం బాధితులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కూలిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సందర్శించి బాధితులను ఓదార్చారు. గ్రామంలోని దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలించి ప్రతి ఇంటి బాధిత కుటుంబానికి తక్షణ అవసరాల కోసం 2,000 చొప్పున ఆర్థిక సహాయం  అందజేశారు. తహశీల్దార్ ఎంపీడీఓ లతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధిత కుటుంబాల వివరాలను సేకరించి నష్టాన్ని అంచనా వేశారు. ఇళ్లు కూలిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. నారాయణపూర్ ను  ముంపు గ్రామంగా ప్రకటించి పునరావాసం కల్పించాలని గ్రామస్తులు కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    47 min ago
  • సిరిసిల్ల పెద్దబజారులో కూలిన భారీ వేపచెట్టు రెండు వాహనాలు ధ్వంసం, వ్యక్తికి గాయాలు గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పెద్దబజారులో భారీ వేపచెట్టు ఒక్కసారిగా నేలకొరిగింది. అదే సమయంలో అక్కడ నిలిపి ఉంచిన టాటా ఏసి వాహనం, ఓ మినీ వ్యాన్‌పై చెట్టు పడింది. ఈ ఘటనలో మినీ వ్యాన్‌లో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని వాహనం నుంచి బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెట్టు కూలిపోవడంతో విద్యుత్ తీగలు కూడా తెగిపడటంతో కొంతసేపు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఘటన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, చెట్టును తొలగించే పనులు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    4
    సిరిసిల్ల పెద్దబజారులో కూలిన భారీ వేపచెట్టు
రెండు వాహనాలు ధ్వంసం, వ్యక్తికి గాయాలు
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గురువారం సిరిసిల్ల పట్టణంలోని పెద్దబజారులో భారీ వేపచెట్టు ఒక్కసారిగా నేలకొరిగింది. అదే సమయంలో అక్కడ నిలిపి ఉంచిన టాటా ఏసి వాహనం, ఓ మినీ వ్యాన్‌పై చెట్టు పడింది. ఈ ఘటనలో మినీ వ్యాన్‌లో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని వాహనం నుంచి బయటకు తీసి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెట్టు కూలిపోవడంతో విద్యుత్ తీగలు కూడా తెగిపడటంతో కొంతసేపు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఘటన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, చెట్టును తొలగించే పనులు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.