ఏబ్బనూర్ లో గల్లీ గల్లీనా వెలసిన గణనాథులు భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు. వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలం, ఏబ్బనూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో గల్లీ గల్లీనా గణేష్ మండపాలు వెలసి భక్తి శోభ సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ శివాలయ దేవాలయంలో వెలసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్, ధరూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు అంటేనే ఐక్యతకు ప్రతీక. గ్రామంలోని అందరూ కులమతాలకు అతీతంగా, కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలి. యువత భక్తితో పాటు సేవా భావంతో ముందుకు సాగి, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. బొజ్జ గణపయ్య ఆశీస్సులతో మన ఏబ్బనూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఏబ్బనూర్ లో గల్లీ గల్లీనా వెలసిన గణనాథులు భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు. వికారాబాద్ జిల్లా, ధరూర్ మండలం, ఏబ్బనూర్ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామంలో గల్లీ గల్లీనా గణేష్ మండపాలు వెలసి భక్తి శోభ సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ శివాలయ దేవాలయంలో వెలసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్, ధరూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పట్లోళ్ళ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు అంటేనే ఐక్యతకు ప్రతీక. గ్రామంలోని అందరూ కులమతాలకు అతీతంగా, కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలి. యువత భక్తితో పాటు సేవా భావంతో ముందుకు సాగి, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. బొజ్జ గణపయ్య ఆశీస్సులతో మన ఏబ్బనూర్ గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు రైస్ మిల్లర్ల ధర్నా కొనసాగుతున్నా.. విజిలెన్స్ అధికారుల తనిఖీలు మాత్రం ఆగడం లేదు. మంగళవారం శివంపేట మండలం గూడూరు గ్రామంలోని ఓం సాయి వెంకటరమణ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం ఎంత మేరకు వచ్చింది.. అందులో ఎంత ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యం అందించారు.. ప్రస్తుతం మిల్లులో ఎంత ధాన్యం నిల్వ ఉంది అనే వివరాలను అధికారులు పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను తనిఖీ చేస్తూ క్షేత్రస్థాయి నిల్వలను లెక్కించారు. ధాన్యం కేటాయింపులు, బియ్యం సరఫరా, ప్రస్తుత నిల్వలకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.1
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. “మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.1
- బొమ్మాబొరుసుఆడుతున్న ఏడుగురు అరెస్టు24510నగదుఆరు సెల్ ఫోన్లుస్వాదీనంఎస్పీశ్రీనివాస్ రావు బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్దుర్తి మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి జూదం ఆడుతున్న . వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్‌రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్‌రెడ్డి, గాండ్ల రాజు లనుఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం4 చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జూదంఆడుతున్న సమాచారం 100కాల్ చేసి సమాచారం ఇవ్వాన్నారు. జూదంవల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ జూదం, బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీశ్రీనివాస్ రావు కోరారు.సమాచారం ఇచ్చిన వారిపేర్లను గుప్తంగా ఉంచుతామన్నారు.1
- బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో అరాచకత్వం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు... బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం.1
- హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు టిప్పర్ ఢీ.. హైదరాబాద్ లోని హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన 20 మంది ప్రయాణికులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.1
- గూడెంగడ్డ గ్రామంలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగుపాటుకు ఎద్దు మృతి నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో రాత్రి పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్న సమయంలో రైతు ఆవంచ భాస్కర్‌కు చెందిన జత ఎడ్లలో ఒకదానిపై ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఎద్దు మృతి చెందడంతో కుటుంబానికి ఆర్థిక నష్టం వాటిల్లిందని గ్రామస్థులు పేర్కొన్నారు. అధికారులు ఘటనను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని గ్రామస్థులు కోరారు.1
- హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య.. నగరంలో భయాందోళనలు లైవ్ మర్డర్ వీడియో..! ప్రాణ స్నేహితుడినే హతమార్చిన రౌడీషీటర్ సెటిల్మెంట్ డబ్బుల వివాదమే హత్యకు కారణమా..? నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో నాగోల్ పోలీసుల గాలింపు హైదరాబాద్, సెప్టెంబర్ 15 హైదరాబాద్ నగరంలో దారుణ హత్య కలకలం రేపింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లెందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మూడు నెలలుగా వివాదం.. సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా మహేష్, నహీమ్ మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలు, ముఠా విభేదాలే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇరువురిపైనా గతంలో పలు హత్య కేసులు ఉన్నట్లు, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు నమోదైనట్లు సమాచారం. చిన్ననాటి స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీయడం చర్చనీయాంశంగా మారింది. మహేష్ అండ్ టీం కోసం గాలింపు హత్య అనంతరం నిందితులు పరారైనట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. హత్యకు అసలు కారణం, ఘటనలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో హత్యకు చెందిన వీడియోలు వైరల్ గా మారాయి.1