logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సౌజన్య ఉన్నత చదువుల కోసం పాండురంగారెడ్డి ఆర్థిక సాయం అందజేత నల్గొండ: త్రిపురారం మండలం కంపాలపల్లి గ్రామానికి చెందిన నామ వెంకన్న సోమవారం హైదరాబాద్ లో ప్రజా నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డిని కలిశారు. తన కూతురు నామ సౌజన్య ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. పాండురంగారెడ్డి వెంటనే స్పందించి సౌజన్య ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం సాగర్ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తానని, సాగర్ నియోజకవర్గాన్ని మెరుగుపరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

3 hrs ago
user_జిల్లపల్లి ఇంద్ర
జిల్లపల్లి ఇంద్ర
జర్నలిస్ట్ Nalgonda, Telangana•
3 hrs ago
93066dfa-3813-4a7f-8e8b-782e10e18b5d

సౌజన్య ఉన్నత చదువుల కోసం పాండురంగారెడ్డి ఆర్థిక సాయం అందజేత నల్గొండ: త్రిపురారం మండలం కంపాలపల్లి గ్రామానికి చెందిన నామ వెంకన్న సోమవారం హైదరాబాద్ లో ప్రజా నాయకుడు బుసిరెడ్డి పాండురంగారెడ్డిని కలిశారు. తన కూతురు నామ సౌజన్య ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు. పాండురంగారెడ్డి వెంటనే స్పందించి సౌజన్య ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం సాగర్ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తానని, సాగర్ నియోజకవర్గాన్ని మెరుగుపరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.

More news from Telangana and nearby areas
  • నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    9 hrs ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు.
ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    16 hrs ago
  • హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! ​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    1
    హనుమకొండలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన!
​హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్  బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో  బస్టాండ్ వద్ద టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు   అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.​ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.​ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ జిల్లా:సోషల్ మీడియా వచ్చిన తరువాత మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఆయన, ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొన్న తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో డీసీపీ, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టానని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
    1
    వరంగల్ జిల్లా:సోషల్ మీడియా వచ్చిన తరువాత మేలు కంటే కీడు ఎక్కువగా జరుగుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అసెంబ్లీలో సోమవారం మాట్లాడిన ఆయన, ఇటీవల రవీంద్రభారతిలో గద్దర్ వేషధారణలో పాల్గొన్న తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెరుగుతున్నాయని, ఇటువంటి చర్యలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో డీసీపీ, సీపీగా పనిచేసిన అనుభవంతో చట్టం ప్రకారం వ్యవహరించాలని పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టానని, ప్రజా సమస్యల పరిష్కారం మరియు వర్ధన్నపేట సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    2
    తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు  మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • "Auto drivers struggling due to gas shortage." ​"No gas, no work: Auto drivers in distress." ​"Fuel crisis hitting auto drivers hard."
    1
    "Auto drivers struggling due to gas shortage."
​"No gas, no work: Auto drivers in distress."
​"Fuel crisis hitting auto drivers hard."
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    1
    తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్!
చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
​తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
​సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్:
మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
​రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.