తెలంగాణ ఉద్యమకారుల 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయండి... తెలంగాణ ఉద్యమకారుల జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్... నెల్లికుదురు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 15... ఈనెల 27వ తేదీన యాదగిరిగుట్ట లోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఫోరo 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం ఉద్యమకారుల సంక్షేమం కోసం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుండి నిర్వహించబోతున్నామని దీనికి తెలంగాణ ఉద్యమకారులు అందరు పాల్గొనాలని కోరుతున్నాం కెసిఆర్ 10 సంవత్సరాల ఉద్యమకారులకు చేసిన న్యాయం లేదని అన్నారు. ఇప్పుడు 1000 రోజుల పాలనలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు చేసింది శూన్యమేనని అన్నారు. ముఖ్యమంత్రికి ఉద్యమకారుల నివేదిక సేకరించి ఇచ్చిన తర్వాత ఉద్యమకారులకు ఎందుకు హామీలను ప్రారంభించడం లేదని అన్నారు. ఉద్యమకారుల డేటా సేకరించకుండా అనవసరపు మాటలు మాట్లాడి ఉద్యమకారుల మనోభావాలు దెబ్బతియ్యవద్దని చెప్పారు ఉద్యమకారుల భవిష్యత్తు కార్యాచరణ ఈనెల 27వ తేదీన యాదాద్రిలో 9వ ఆవిర్భావ దినోత్సవం ప్రకటిస్తారని అన్నారు. యాదాద్రిలో నిర్వహించే తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఉద్యమకారులు విజయవంతం చేయాలని కోరారు.

- ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- జిన్నెల వాగు ఉధృతంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి చిన్నగూడూర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్.. జీన్నెల వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజీ తండా గ్రామాలకు వెళ్లే మార్గంలోని జీన్నెల వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1