కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సిఐటియు (CITU), తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల మండల సంయుక్త సదస్సు కొప్పుల శంకర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశానికి హాజరైన ముఖ్య అతిథులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. రైతులకు తీరని నష్టం కలిగించే వ్యవసాయ విద్యుత్ మూడో డిస్కం (Third Discom) ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్‌ను కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి నెట్టే ఏ చర్యలనూ రైతాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. సదస్సులో పాల్గొన్న తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన హక్కులను రక్షించే 29 చట్టాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను బలహీనపరిచే చర్యలను నిలిపివేయాలని ఆయన కోరారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి సంపత్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వీబీజీ (VBG) - రాంజీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు జీవనాధారమని, దానికి నిధులు కోత విధించి, రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపుతూ, ప్రత్యామ్నాయ పథకాలతో నిర్వీర్యం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని హితవు పలికారు. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన నాయకులు, ప్రభుత్వాలు తమ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెలుపురి రాములు, సిఐటియు మండల కన్వీనర్ జక్కుల రమేష్, రైతు సంఘం మండల అధ్యక్షులు కాయిత లింగారెడ్డిలతో పాటు నాయకులు దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, జున్నుతుల జనార్దన్ రెడ్డి, రావుల ఓదెలు, కోత్తూరు మల్లయ్య, తిప్పరపోయిన శ్రీకాంత్, మహంకాళి కొమురయ్య, మిట్టపల్లి సదానందం తదితరులు పాల్గొన్నారు.

- కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.1
- ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.1
- పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.2
- కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట, నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసి అంజన్న ఆశీస్సులు పొందారు. తాము గత 116 వారాలుగా నిరంతరాయంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని, అది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగానే కొండగట్టు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు భక్తులు వెల్లడించారు. అంజన్న అనుగ్రహంతోనే తమ కుటుంబాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. అయితే, కొండగట్టు క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివస్తున్నప్పటికీ అక్కడ కనీస మౌలిక వసతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా వేధిస్తోందని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పరిసరాల్లో పూజా సామగ్రి, కొబ్బరికాయలు తదితర వస్తువులను ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ధరలను నియంత్రించడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.3
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొలీపాక రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో బండి సంజయ్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, బుర్ర మల్లేశం, బండిపల్లి సునీతతో పాటు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.4
- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ జోన్-2 చీఫ్ జోనల్ ఇంచార్జ్ దాగిల్ల దయానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో పార్టీ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, వర్కిల్ల మల్లేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దాగిళ్ల దయానందరావు మాట్లాడుతూ, భారతదేశ చరిత్రను తిరగరాసేది బహన్ మాయావతి గారేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ రక్షణ, అణగారిన వర్గాల అభివృద్ధి సాధించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. 2027లో ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని, అదే స్ఫూర్తితో 2028లో తెలంగాణలోనూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెట్టం చంద్రశేఖర్, మహనీయుల ఆలోచనలకు ఆకర్షితులై బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ముఖ్య అతిథి దయానందరావు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోయిన్పల్లి సంతోష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌లు గోమాస బ్రహ్మానందం, గోలేటి నారాయణ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు గాజుల శంకర్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎండి మాతిన్ ఖాన్, నస్పూర్ మండల అధ్యక్షుడు వేముల కిరణ్, నాయకుడు జాగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య భవన్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడ మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిన గోపి మాట్లాడుతూ, పేద మరియు బలహీనవర్గాల ప్రతినిధిగా రానున్న రోజుల్లో బండి సంజయ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షించారు. తమలాంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులకు ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలబడాలని కోరారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో కనిపిస్తోంది. ఆయన ప్రత్యేక చొరవతో వేములవాడ పట్టణ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన చివరి స్లాబ్ పనులు నేడు వేగంగా కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణంలోని ఈ తిప్పపూర్ మూడవ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఈ బ్రిడ్జి ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం చేకూర్చడమే కాకుండా, వేములవాడ ప్రాంత సమగ్ర అభివృద్ధికి మరో బలమైన వారధిగా నిలవనుంది.1