logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వినాయకుని పూజలో పాల్గొన్న తులసిరెడ్డి.వినాయక చవితి సందర్భంగా సోమవారం వేంపల్లి శివాలయం వీధిలో వినాయక చవితి సందర్భంగా సోమవారం వేంపల్లి శివాలయం వీధిలో ఏర్పాటుచేసిన వినాయక స్వామి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ వినాయకుని పుట్టినరోజు అయిన భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు హిందువులు వినాయక చవితి పండుగ జరుపుకుంటారన్నారు. హిందూమతంలో ప్రప్రథమంగా పూజలందుకునే విశిష్టమైన దేవుడు వినాయకుడు. వినాయకుని గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు తదితర పేర్లతో కూడా పిలుస్తారు. వినాయకుని తండ్రి శివుడు. తల్లి పార్వతి దేవి. సోదరుడు కుమారస్వామి (కార్తికేయుడు). వినాయక చవితి పండుగ జాతీయ సమైక్యతకు చిహ్నమని, ఈ పండుగ ప్రజల్లో ఐకమత్యాన్ని, భక్తి భావనను పెంపొందింప చేస్తుందని తులసి రెడ్డి అన్నారు. భారతదేశంలోనే కాక నేపాల్,శ్రీలంక,థాయిలాండ్,ఇండోనేషియా, జపాన్ దేశాలలో కూడా వివిధ రూపాలలో వినాయకుని పూజిస్తారని తులసి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం వై.శివరాం, ఆయన శిష్య బృందం ఆధ్వర్యంలో, పూజారి ప్రసాద్ స్వామి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి, వేంపల్లి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ,వేముల మండల శాఖ అధ్యక్షుడు చాగలేటి వెంకటేశు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి,ఉత్తన్న,బద్రీనాథ్, రాఘవయ్య, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

22 hrs ago
user_Mallikarjun
Mallikarjun
ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
22 hrs ago
4d84246f-abec-477f-8652-69cbd2d16b78

వినాయకుని పూజలో పాల్గొన్న తులసిరెడ్డి.వినాయక చవితి సందర్భంగా సోమవారం వేంపల్లి శివాలయం వీధిలో వినాయక చవితి సందర్భంగా సోమవారం వేంపల్లి శివాలయం వీధిలో ఏర్పాటుచేసిన వినాయక స్వామి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ వినాయకుని పుట్టినరోజు అయిన భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు హిందువులు వినాయక చవితి పండుగ జరుపుకుంటారన్నారు. హిందూమతంలో ప్రప్రథమంగా పూజలందుకునే విశిష్టమైన దేవుడు వినాయకుడు. వినాయకుని గణపతి, గణేశుడు, విఘ్నేశ్వరుడు, గజాననుడు, లంబోదరుడు తదితర పేర్లతో కూడా పిలుస్తారు. వినాయకుని తండ్రి శివుడు. తల్లి

65bbdb8d-c6c6-4a25-9ce2-6b207201f678

పార్వతి దేవి. సోదరుడు కుమారస్వామి (కార్తికేయుడు). వినాయక చవితి పండుగ జాతీయ సమైక్యతకు చిహ్నమని, ఈ పండుగ ప్రజల్లో ఐకమత్యాన్ని, భక్తి భావనను పెంపొందింప చేస్తుందని తులసి రెడ్డి అన్నారు. భారతదేశంలోనే కాక నేపాల్,శ్రీలంక,థాయిలాండ్,ఇండోనేషియా, జపాన్ దేశాలలో కూడా వివిధ రూపాలలో వినాయకుని పూజిస్తారని తులసి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం వై.శివరాం, ఆయన శిష్య బృందం ఆధ్వర్యంలో, పూజారి ప్రసాద్ స్వామి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి, వేంపల్లి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ,వేముల మండల శాఖ అధ్యక్షుడు చాగలేటి వెంకటేశు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి,ఉత్తన్న,బద్రీనాథ్, రాఘవయ్య, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    1
    పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ

కడప జిల్లా.....
పులివెందుల.....
పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ.......
టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ.....
గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్....
టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... 
విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    user_K. Ravi Sekhar
    K. Ravi Sekhar
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    1
    కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
    1
    రామసముద్రం: హంద్రీనీవా కోసం వినతిపత్రం ఇచ్చేందుకు రైతాంగం కదలిక రావాలి
మండలానికి హంద్రీ–నీవా సుజల స్రవంతి నీటి కనెక్టివిటీ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతాంగం కదులుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామసముద్రం తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించనున్నట్లు హంద్రీ–నీవా ఉద్యమకారులు తెలిపారు. కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ముందస్తు సమాచారం అందిస్తూ రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. మండలంలోని రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని చెరువులకు హంద్రీ–నీవా జలాల కనెక్టివిటీ సాధిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు సాగునీరు, భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు.
    user_SR
    SR
    రామసముద్రం, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నందవరం లో సర్వ రక్షక సేవ సంఘం నాయకులు గణనాధునికి ఘనంగా పూజలు నందవరం లో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి ఘనంగా పూజలు చేశారు .స్తానిక బిసీ కాలని వద్ద సర్వ రక్షక సేవ సంఘం వినాయక యూత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, నైవేద్యం ,పుష్పాలు, పత్రాలతో పూజలు అందుకున్నారు.మండపం వద్ద ఆధ్యాత్మిక శోభఉట్టిపడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ,విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    1
    నందవరం లో సర్వ రక్షక సేవ సంఘం నాయకులు గణనాధునికి ఘనంగా పూజలు
నందవరం లో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి ఘనంగా పూజలు చేశారు .స్తానిక బిసీ కాలని వద్ద సర్వ రక్షక సేవ సంఘం వినాయక యూత్  ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, నైవేద్యం ,పుష్పాలు, పత్రాలతో పూజలు అందుకున్నారు.మండపం వద్ద ఆధ్యాత్మిక శోభఉట్టిపడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ,విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    user_Viswanath boya
    Viswanath boya
    నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రాయల చెరువు కబ్జాకు చెక్: అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న జనసేన, బీజేపీ శ్రేణులు ​భూగర్భ జలాల ఉనికికి ప్రాణవాయువుగా, వేలాది మంది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుస్తున్న అమూల్యమైన ప్రకృతి సంపద పురాతన రాయల చెరువు. భావి తరాలకు జీవనాధారమైన ఇంతటి మహత్తర జలవనరును స్వార్థపరులు కబ్జా చేసి బహిరంగంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే, కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. చెరువు అస్తిత్వాన్ని నాశనం చేస్తూ సాగుతున్న ఈ దుశ్చర్యపై సమాచారం అందుకున్న జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ రాయల్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తమ బృందంతో కలిసి తక్షణమే క్షేత్రస్థాయికి దూసుకెళ్లి నిర్మాణ పనులను అక్కడికక్కడే నిలిపివేయించారు. కబ్జాదారుల ఎత్తులను నిర్భయంగా తిప్పికొట్టిన నేతలు, ప్రజా సంపదను కాపాడాల్సిన సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూడటంపై నిప్పులు చెరిగారు. జలవనరులను కబళిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా,చెరువు పరిరక్షణకు ఎంతటి ప్రజా పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేస్తూ, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.
    3
    రాయల చెరువు కబ్జాకు చెక్: అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న జనసేన, బీజేపీ శ్రేణులు
​భూగర్భ జలాల ఉనికికి ప్రాణవాయువుగా, వేలాది మంది ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు తీరుస్తున్న అమూల్యమైన ప్రకృతి సంపద పురాతన రాయల చెరువు. భావి తరాలకు జీవనాధారమైన ఇంతటి మహత్తర జలవనరును స్వార్థపరులు కబ్జా చేసి బహిరంగంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే, కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర విస్మయాన్ని కలిగిస్తోంది. చెరువు అస్తిత్వాన్ని నాశనం చేస్తూ సాగుతున్న ఈ దుశ్చర్యపై సమాచారం అందుకున్న జనసేన టౌన్ ప్రెసిడెంట్ గాజుల నరేష్ రాయల్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జగదీష్ రాజు తమ బృందంతో కలిసి తక్షణమే క్షేత్రస్థాయికి దూసుకెళ్లి నిర్మాణ పనులను అక్కడికక్కడే నిలిపివేయించారు. కబ్జాదారుల ఎత్తులను నిర్భయంగా తిప్పికొట్టిన నేతలు, ప్రజా సంపదను కాపాడాల్సిన సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూడటంపై నిప్పులు చెరిగారు. జలవనరులను కబళిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా,చెరువు పరిరక్షణకు ఎంతటి ప్రజా పోరాటానికైనా సిద్ధమని నేతలు స్పష్టం చేస్తూ, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.
    user_JP Media
    JP Media
    Social worker పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
  • వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
    1
    వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం
పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా:
వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది.
వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం
పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా:
వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది.
వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    1
    పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు  సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం
తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.