*ఇంత విషమిచ్చి చంపేయండి..!!* *మహిళా ఐఏఎస్ పట్ల దుష్ప్రచారంపై మంత్రి కోమటిరెడ్డి* మంత్రులు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి తట్టుకుంటా..కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. *ప్రతీ ఒక్కరికీ కుటుంబం ఉంటుంది. అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు.* ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే. నా గురించి మీ అందరికీ తెలుసు. అయినా నన్ను ఇలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు *. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయాను. అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది. కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం* చేస్తున్నాను. *ఇంత విషమివ్వండి..!!* అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. *మీ రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయండి. ఇంకా సరిపోదు అనుకుంటే నాకింత విషమిచ్చి చంపేయండి* అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నా ఫోన్ నంబర్ మార్చానని ఓ చానల్ లో ప్రసారం చేశారు. ఆ నంబర్ చాలా పాతది. దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నంబర్ ఉండటంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో పీఏ వద్ద ఉంచాను. తనకు గొంతులో అనారోగ్య సమస్య ఉందని దాని కోసం అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకున్నా తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడటమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతానని చెప్పాను. ఆ నంబర్ తోనే నేను ఆరుసార్లు గెలిచాను. దాన్ని ఎలా పక్కన పెడతానన్నారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్‍లు అవుతారు. అలాంటి వారిపై ఆఫీసర్ల మీద అభియోగాలు కరెక్ట కాదన్నారు. *సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్నా...* కలెక్టర్ల బదిలీలు సీఎం, సిఎస్ ల స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు చాలా జిల్లాల్లో కలెక్టర్ ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాల్లో నలుగురు కలెక్టర్లు మారారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అభాండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానన్నారు.

- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- సంస్కృతికి ప్రతీక సంక్రాంతి పండగ: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఆచంపల్లి గ్రామంలో ఉన్న కెనాల్ లో అదుపుతప్పి బోల్తాపడ్డ ఇసుక లారీ త్రుటిలో తప్పించుకున్న లారీ డ్రైవర్ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1