logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదివరాహ స్వామిని దర్శించుకున్న మంథని కోర్టు ఏపీపీ కుమార్ కమాన్‌పూర్, ఆగస్టు 26: మంథని కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్థ కుమార్–హాసిని దంపతులు బుధవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఏపీపీ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

8 hrs ago
user_Subhan. Manthani
Subhan. Manthani
Local News Reporter మంథని, పెద్దపల్లి, తెలంగాణ•
8 hrs ago
3d77fa56-e2ab-4b0a-b21f-51f287218638

ఆదివరాహ స్వామిని దర్శించుకున్న మంథని కోర్టు ఏపీపీ కుమార్ కమాన్‌పూర్, ఆగస్టు 26: మంథని కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్థ కుమార్–హాసిని దంపతులు బుధవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఏపీపీ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
    1
    *ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత*

తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల
*ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత*
తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు  ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో పసుపు కొమ్ముదారంతో మూడుముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రదానపు ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. ఈ వేడుకలో బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప - బాలకృష్ణ, సోదరుడు నాగరాజు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ప్రాధాన్యత - రూ: 4 కోట్ల 46 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు : మంత్రి సీతక్క. ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (భారత శక్తి): గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్‌ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    1
    ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే  ప్రాధాన్యత
- రూ: 4 కోట్ల 46 లక్షల అభివృద్ధి పనులకు  శంకుస్థాపనలు
:  మంత్రి సీతక్క.

ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26 (భారత శక్తి):  గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

బుధవారం తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి  సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్‌ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
    user_KOMURAIAH ANAGANDULA
    KOMURAIAH ANAGANDULA
    ములుగు, ములుగు, తెలంగాణ•
    13 hrs ago
  • ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభోత్సవం అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు. మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
    4
    ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన.

ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు మంత్రి సీతక్క.
ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన.
ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో  పాల్గొన్నారు మంత్రి సీతక్క.
మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి  కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు 
ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క  ప్రారంభోత్సవం 
అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు..
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన  మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు.
మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    14 hrs ago
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు. స్వీట్ హౌస్ నిర్వాహకుడు డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు. మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.
    2
    జమ్మికుంటలో మందుబాబు వీరంగం...ఈడ్చుకెళ్ళి తగిన శాస్త్రి చేసిన పోలీసులు
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో  మద్యం మత్తులో వీణవంక మండలం హిమ్మత్ నగర్ కు చెందిన రాజు వీరంగం సృష్టించారు. తాగిన మైకంలో స్వీట్ హౌస్ నిర్వాహకులతో ధర విషయంలో గొడవ పడ్డారు.
స్వీట్ హౌస్ నిర్వాహకుడు  డయల్ 111 కాల్ చేయడంతో మత్తులో ఉన్న వ్యక్తిని స్టేషన్ కు తరలించి సముదాయించి పంపించేశారు పోలీసులు.
మద్యం మత్తులో ఉన్న రాజు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఆందోళన దిగారు. పోలీసులు తీరు స్వీట్ హౌస్ నిర్వాహకులపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యూసెన్స్ సృష్టించడంతో  మందుబాబుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందు బాబుపై చేయ్ వేసుకుని స్టేషన్ గొరగొర కొంతదూరం ఈడ్చుకెళ్ళారు. అనంతరం నలుగురు అతన్ని అమాంతం లేపి స్టేషన్ కు లాక్కెళ్లారు. మందు బాబు వీరంగం, పోలీసుల అసహనం స్థానికంగాళకలకలం సృష్టించింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • బొగ్గు గని కార్మికులకు 35% లాభాల వాటా, 25% ఇంటిరియం రిలీఫ్ చెల్లించాలి : HMS నేత రియాజ్ అహ్మద్ కోల్ ఇండియా యాజమాన్యం 12వ వేతన ఒప్పందం జరిగేంతవరకు ముందుగా దేశంలోని బొగ్గు గని కార్మికులకు 25% (ఐ. ఆర్) ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బొగ్గు రంగ సంస్థల యాజమాన్యాల కు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేతన ఒప్పందం జరగకుండా నిర్లక్ష్యం వహిస్తుంది అందుకే వేతన ఒప్పందం విషయంలో లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని దేశంలోని బొగ్గు రంగ సంస్థలలో ఎన్నికలు నిర్వహించి 51% మెజారిటీ ఓట్లు వచ్చిన సంఘంతోనే వేతన ఒప్పందాలు చేస్తామని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతుంది. దీనికి కోల్ ఇండియా యాజమాన్యం JBCCI సంఘాలను పిలవకుండా 12 వ వేతన కమిటీ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని 12వ వేతన కమిటీ ఒప్పందం జరిగే వరకు బొగ్గు రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25% ఇంటీరియర్ రిలీఫ్ చెల్లించాలని మరియు వేతన కమిటీని నియమించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ పా స్పందించి గతంలో ఇచ్చిన మాదిరిగా వేతన ఒప్పందాలు జరిగేంతవరకు సింగరేణి కార్మికులకు 25% శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ఒప్పందాలు జరిగిన తర్వాత పెరిగిన పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం: అంతేకాకుండా గత 2024 సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గతంగా ఉన్న భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయలేదు. కాబట్టి సెక్యూరిటీ ఖాళీలతో పాటు అంతర్గత ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన సంబంధిత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2025 -26 ఆర్థిక సంవత్సరములో సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల నుండి కార్మికులకు 35% లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
    1
    బొగ్గు గని కార్మికులకు 35% లాభాల వాటా,  25% ఇంటిరియం రిలీఫ్ చెల్లించాలి : HMS నేత రియాజ్ అహ్మద్ 
కోల్ ఇండియా యాజమాన్యం 12వ వేతన ఒప్పందం జరిగేంతవరకు ముందుగా దేశంలోని బొగ్గు గని కార్మికులకు 25% (ఐ. ఆర్) ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటు బొగ్గు రంగ సంస్థల యాజమాన్యాల కు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేతన ఒప్పందం జరగకుండా నిర్లక్ష్యం వహిస్తుంది అందుకే వేతన ఒప్పందం విషయంలో లేబర్ కోడ్లను అడ్డుపెట్టుకొని దేశంలోని బొగ్గు రంగ సంస్థలలో ఎన్నికలు నిర్వహించి 51% మెజారిటీ ఓట్లు వచ్చిన సంఘంతోనే వేతన ఒప్పందాలు చేస్తామని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతుంది. దీనికి కోల్ ఇండియా యాజమాన్యం JBCCI సంఘాలను పిలవకుండా 12 వ వేతన కమిటీ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇలాంటి కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని 12వ వేతన కమిటీ ఒప్పందం జరిగే వరకు బొగ్గు రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులందరికీ 25% ఇంటీరియర్ రిలీఫ్ చెల్లించాలని మరియు వేతన కమిటీని నియమించాలని HMS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డైరెక్టర్ పా స్పందించి గతంలో ఇచ్చిన మాదిరిగా వేతన ఒప్పందాలు జరిగేంతవరకు సింగరేణి కార్మికులకు 25% శాతం ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని ఒప్పందాలు జరిగిన తర్వాత పెరిగిన పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం: అంతేకాకుండా గత 2024 సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గతంగా ఉన్న భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఖాళీలను భర్తీ చేయలేదు. కాబట్టి సెక్యూరిటీ ఖాళీలతో పాటు అంతర్గత ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన సంబంధిత పరీక్షలు నిర్వహించి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 2025 -26 ఆర్థిక సంవత్సరములో సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాల నుండి కార్మికులకు 35% లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో తీవ్ర పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు. ములుగు జిల్లా : ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు. ములుగు జిల్లా కృష్ణ కాలనీ శ్రీ మంజునాథపురం 15వార్డులో లో వోల్టేజ్ తో ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు, లో వోల్టేజ్ కరెంటు రావడంతో ఫ్యాన్లు,ఫ్రిజ్జులు, టీవీలు, షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోతున్నాయి, కాలనీవాసులందరూ కలిసి స్థానిక విద్యుత్ శాఖ అధికారి ఏఈకి కాలనీవాసులందరూ మరియు ఆవార్డ్ కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మాట్ల సంపత్. గండ్రకోట కుమార్. చుంచు రమేష్. నాగేశ్వరరావు. సుధాకర్. శంకర్. కుమార్. సంపత్. ఇక్బాల్. కాలినివాసులు అందరూ పాల్గొన్నారు.
    2
    ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు.
ములుగు జిల్లా :
ములుగు కృష్ణ కాలనీలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,AE కి వినతిపత్రం అందించిన కాలనీవాసులు.
ములుగు జిల్లా కృష్ణ కాలనీ శ్రీ మంజునాథపురం  15వార్డులో  లో వోల్టేజ్ తో  ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు, లో వోల్టేజ్  కరెంటు రావడంతో  ఫ్యాన్లు,ఫ్రిజ్జులు, టీవీలు, షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోతున్నాయి, కాలనీవాసులందరూ కలిసి  స్థానిక విద్యుత్ శాఖ అధికారి ఏఈకి కాలనీవాసులందరూ  మరియు ఆవార్డ్ కౌన్సిలర్ గండ్రకోట వాణి కుమార్ కలిసి వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు  మాట్ల సంపత్. గండ్రకోట కుమార్. చుంచు రమేష్. నాగేశ్వరరావు. సుధాకర్. శంకర్. కుమార్. సంపత్. ఇక్బాల్. కాలినివాసులు  అందరూ పాల్గొన్నారు.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    15 hrs ago
  • హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి తెలంగాణ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    1
    హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి
తెలంగాణ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    19 hrs ago
  • సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట బస్సు ప్రమాద ఘటన.. షాకింగ్ విజువల్స్ సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించాయి. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
    1
    సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట బస్సు ప్రమాద ఘటన.. షాకింగ్ విజువల్స్
సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపించాయి. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
    user_Bellamplly Ashok kumar
    Bellamplly Ashok kumar
    Local News Reporter Kotapally, Mancherial•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.