అంబం(వై)లోని ప్రైమరి పాఠశాలను ఆకస్మిక సందర్శిం చిన సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్...విద్యార్థుల బోధ న,వాతావరణ పరిస్థితులను పరిశీలించిన....ప్రైవేట్ కు దీటుగా,ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన,సౌకర్యా లు కల్పిస్తోంది...పాఠశాల అభివృద్ధికీ తన వంతు సహకారం అందిస్తా.. సర్పంచ్ స్రవంతి సుమన్ వెల్లడి. ఎడపల్లి,ఆగస్టు 1: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై)గ్రా మంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను శనివారం ఆ గ్రామ సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు,విద్యా బోధన వంటి పలు అంశాల గురించి పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యాకార్యక్రమాలు,విద్యార్థులకు బోదిస్తున్న విద్యాభ్యాసం,విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్నం భోజనం,నాణ్యత పై సర్పంచ్ స్రవంతి అరా తీశారు.విద్యార్థుల బోధనతో పాటు వాతావరణ పరిస్థితులను ఆమె పరిశీలించారు.ఈ సందర్బంగా సర్పంచ్ స్రవంతి సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న ఉచిత పాఠ్యపుస్తకా లతో పాటు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల ఉపాధ్యాయులతో పాటు నాణ్య మైన విద్యాను,ఉచిత మధ్యాహ్నం భోజనం,వంటి సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు పాఠశాలలో సౌక ర్యాకల్పనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె కోరారు.పాఠశాల అభివృద్ధికీ తమ వంతుగా సహకా రం అందిస్తానని సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్ హామీ ఇచ్చారు.ఈ సందర్బంగా సర్పంచ్ పాఠశాలను సంద ర్శించడంతో ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్థుల్లో ఉత్సాహన్ని నింపింది.ఆర్.బిఎస్.కె. వైద్యాధికారి డాక్టర్.విజయ్ భాస్కర్ పాఠశాలను సందర్శించి విద్యార్థు లకు ఆరోగ్య జాగ్రత్తల పై వివరించారు.వర్షాకాలం సీజ న్ లో విద్యార్థులు చేతులు కాళ్ళు శుభ్రంగా ఉంచుకో వాలని,పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని, సూచించారు.జ్వరాలు,జలుబు,దగ్గు వంటి వస్తే డాక్టర్ వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకోవాలని అన్నా రు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

- బోధన్ ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హజ్రత్ షా జలాల్ బుఖారీ (రహ్.) 675వ ఉర్సు మహోత్సవాల్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్. పాల్గొన్నారు. దర్గా వద్ద చాదర్ సమర్పించి, గులాబీ పూలతో నివాళులర్పించిన కమిషనర్... రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నిర్వాహకులు పోలీస్ కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, ఎస్‌హెచ్‌వో వెంకట్ నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, దర్గా కార్యదర్శి ముక్తాదారు, మత పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- భారీ వర్షంతో తడిసిముద్దైన బాన్సువాడ లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన బాన్సువాడ పట్టణంలో శనివారం కురిసిన భారీ వర్షంతో జనజీవనం కొంతసేపు అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. కొంతకాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. వ్యవసాయ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మున్సిపల్ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు.2
- నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ నీ తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబూ తో కలిసి పరిశీలించరు మంత్రి వివేక్ వెంకట స్వామి మంత్రి కామెంట్స్ ప్రాణహిత ఎల్లంపల్లి లింక్ లో ఉండేది కోదిరోజులుగా బిఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతు బ్యారేజ్ లు లేకుండా పంపు లు నడిపియండి అంటూ ప్రచారం చేశారు బ్యారేజ్ లు లేకుండా పంపులు నడిపితే బ్యారేజ్ లు ఎందుకు కట్టినట్టు మరి గతంలో 60 టీఎంసీలు ఎల్లంపల్లి కి పంపు చేశారు తిరిగి వరద రావడం తో దాన్ని గోదావరి లోకి వదిలేసారు దానికి 30వేల కోట్ల కరంట్ బిల్లులు వచ్చాయి.. అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచిస్తుంది కేంద్రం డ్యామ్ సేఫ్టీ కమిటీ అందులో మళ్ళీ నీళ్లు నింపారాదు అని మరోసారి చెప్పింది కాబట్టి దానికి అనుగుణంగా నే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఉత్తమ్ కుమార్ కామెంట్స్ శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ 112టీఎంసీలు కానీ పూడిక తీత వాళ్ళ 80కి పడిపోయింది మళ్ళీ 112టీఎంసీలకు తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాబోయే రోజుల్లో వరద ఎంత వస్తుంది ఎంత సాగు నీరు ఇవ్వగలం అనేది స్పష్టమైన ప్రకటన రెండు మూడు రోజుల్లో ఇస్తాం మెడిగడ్డ సుందిల్ల అన్నారం పంపు హౌస్ లు అవసరం లేకుండా నే కాంగ్రెస్ కట్టిన ఎల్లంపల్లి లో 20 టీఎంసీల నీరు వచ్చింది దీనిపై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది రైతులు గమనించాలి నిన్న కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆ బ్యారేజ్ ల్లో నీరు నింపదు అని తెలిపారు ఆ బ్యారేజ్ లకి ప్రభుత్వం వ్యతిరేకం కాదు దాన్ని పూర్తిగా పరిశీలించి మర్మతులు చేస్తాం దీనిలో రాజకీయ దురుద్దెశం లేదు కానీ ఎల్లంపల్లి కట్టింది కాంగ్రెస్ స్వర్గీయ శ్రీపాద రావ్ గారి పేరుపై అప్పట్లో కట్టిన శ్రీరాంసాగర్, శ్రీశైలం, నిజం సాగర్ నాగార్జునా సాగర్ 60 ఏళ్ళు అయినా ఎలా ఉన్నాయి బిఆర్ఎస్ కట్టిన అన్నారం మెడిగడ్డ, సుందిల్లా ఎలా ఉంది ప్రజలు గమనించాలి జాతీయ అంతర్జాతీయ నిపుణులు సూచనల మేరకు ముందుకు వెళ్తాము4
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- జపాన్‌కు డ్రైవర్ల శిక్షణపై భాగస్వామ్యం దిశగా అడుగులు బద్దెనపల్లి ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన జపాన్ ప్రతినిధులు జపాన్‌కు నైపుణ్యమైన భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లను తీర్చిదిద్దే లక్ష్యంతో హనా విస్టా కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ఐటీడీఆర్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు సంస్థ ప్రతినిధులు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో ఐటిడీఆర్ సైట్ విజిట్ నిర్వహించారు.ఇట్టి పర్యవేక్షణ సంస్థ సీఈఓ సయూరి మత్సునో తెలంగాణ ఐఏఎస్ అధికారి హరి ప్రసాద్‌కు ఆదేశానుసారం , పర్య వేక్షించారు. డ్రైవింగ్ శిక్షణ విధానం, మౌలిక సదుపాయాలు, శిక్షణ పరికరాలు, నిర్వహణ ప్రమాణాలు, మొత్తం శిక్షణ వాతావరణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే, భారతీయ ప్రొఫెషనల్ డ్రైవర్లకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పరస్పర సహకారంపై చర్చించి, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పరచు కోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యం అమల్లోకి వస్తే తెలంగాణ యువతకు జపాన్‌లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇట్టి పర్యవేక్షణ లో జిల్లా రవాణాశాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్ మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్ ఐటీడీఆర్ ప్రిన్సిపాల్ దొరయ్ మురుగన్ పాల్గొన్నారు.1
- నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన బిల్లుల చెల్లింపులలో దాదాపు కోటి 70 లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్ కి బీజేపీ కౌన్సిలర్ ల పిర్యాదు కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం అనంతరం జరిగిన బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగాయని, ఈ విషయంలో అధికారులతో పాటు పాలకవర్గంలోని కొంత మంది చేతి వాటం చూయించారని వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కలిసి పిర్యాదు చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ లు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో నూతన పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కామారెడ్డి మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 5,92,91,364 ఖర్చు కాగా అందులో 75 బిల్లులు 1,13,14566 రూపాయల చెల్లింపు విషయంలో, అంతే కాకుండా SDRF సంబంధించిన 71,28,937 రూపాయలు ఖర్చు కా అందులో 5 బిల్లులకు గాను 59,86,353 రూపాయలు చెల్లింపుల విషయంలో అవకతవకలు జరిగినట్టుగా అనుమానం అందని వీటి విషయంలో సరియైన విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై, వాటి వెనక ఉన్న ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరడం జరిగిందని, ఈ విషయంలో సరియైన స్పందన రాకపోతే విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి పిర్యాదు చేస్తామని అన్నారు.1
- ఇంజనీరింగ్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి..* ఓట్ల కోసం విద్యార్థులకు మాయమాటలు చెప్పి ,గెలిచి గద్దనెక్కిన తర్వాత విద్యార్థుల ఆత్మగౌరాన్ని దెబ్బతీస్తున్నాడు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విద్యార్థులను అవమానించడం బాధాకరం.. *తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని బస్టాండ్ దగ్గర బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు నంది వేణు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేయడం జరిగింది..* *ఈ సందర్భంగా జిల్లా యువమోర్చ అధ్యక్షుడు నంది వేణు మాట్లాడుతూ..* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను "క్రిమినల్స్", "వేస్ట్" అని సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి వారిని ఈ విధంగా సంబోధించడం విద్యార్థులను, వారి కష్టాన్ని తీవ్రంగా అవమానించడమే అవుతుందని అన్నారు.. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. వేల కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులకు కనీసం ఉద్యోగ దరఖాస్తులు నింపడం కూడా రాదని హేళన చేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏకంగా వారిని "క్రిమినల్స్", "వేస్ట్" అంటూ నోరుపారేసుకోవడం వారి అహంకార పూరిత వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం చూస్తుంటే—రాష్ట్రంలో విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులు చదవకూడదని, ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులుగానే ఉండిపోవాలని వారు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. నిరుద్యోగ భృతి 4,000 వేలు, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సంపూర్ణంగా విఫలమైన ఈ ప్రభుత్వం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులపైనే ఇటువంటి నిందలు వేయడం దురదృష్టకరం అని కాంగ్రెస్ ప్రభుత్వ ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భారతీయ జనతా యువ మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమించి ఎండగడుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సంతోష్ రెడ్డి ,బిజెపి నాయకులు, రజినీకాంత్,భూమేష్ యాదవ్,సందీప్, చిరంజీవి, అశోక్ ,బిజెవైఎం నాయకులు అరుణ్,రాజు, సందీప్, సాయి, ప్రణయ్ తదితరులు ఉన్నారు..1