logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బస్సు ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తాం* *-బస్సు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించిన సూర్యాపేట జిల్లా జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ , జిల్లా ఎస్పీ నరసింహ. సూర్యాపేట సిటీ, ఆగస్టు 26: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానికులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సంఘటన ప్రాంతంలో స్థానిక పోలీస్ అధికారులు, రెవెన్యూ , వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

13 hrs ago
user_YADLA VENUDHAR
YADLA VENUDHAR
Suryapet, Telangana•
13 hrs ago
8e04119c-a7b6-4437-98a0-948e14871c80

బస్సు ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తాం* *-బస్సు ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించిన సూర్యాపేట జిల్లా జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ , జిల్లా ఎస్పీ నరసింహ. సూర్యాపేట సిటీ, ఆగస్టు 26: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. హైదరాబాద్‌

c761146b-1c84-4ae8-bf35-ce4505ee4ddf

నుంచి ఏలూరు వెళ్తున్న ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే. నరసింహ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను స్థానికులను, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని

a67fbf59-c486-4b07-a040-15cd63ae72a0

తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సంఘటన ప్రాంతంలో స్థానిక పోలీస్ అధికారులు, రెవెన్యూ , వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

More news from Telangana and nearby areas
  • *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    1
    *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!*

*- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. 

*సూర్యాపేట సిటీ ఆగస్టు 26:
అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    9 hrs ago
  • పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.
    4
    పలు వివాహ  వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
  • చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..
    1
    చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్..  కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
  • రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    1
    రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    1
    ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు
ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు.
ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    16 hrs ago
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    1
    వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు

రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల*

*-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు.

సూర్యాపేట సిటీ::
*నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల*
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.