Shuru
Apke Nagar Ki App…
అభివృద్ధికి ఆమడదూరంలో గుంటూరు VIP రహదారి గుంటూరు/చుట్టుగుంట గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు
SIVA
అభివృద్ధికి ఆమడదూరంలో గుంటూరు VIP రహదారి గుంటూరు/చుట్టుగుంట గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు
- SIVAగుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్🙏23 hrs ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.1
- విశాఖపట్నం గాజువాకలోని ఓం జ్యువలరీ షాపులో జరిగిన ఈ దొంగతనం ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో (కొప్పులో) దాచుకోవడానికి ప్రయత్నించారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని, సిబ్బంది వారిని నిశితంగా గమనించారు. వారు బంగారాన్ని జడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నిందితులను సోదా చేయగా దొంగిలించిన బంగారం బయటపడింది. పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను ఈ క్రింది విధంగా గుర్తించారు: 1.-భోజ నాగమణి 2.-బోజగాని జ్ఞానమ్మ 3.-పొన్నా పద్మ సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు వీరు పాత నేరస్తులా? లేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం, యజమాని అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ భారీ దొంగతనం విఫలమైంది. గాజువాక పరిసరాల్లోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.1
- రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు1
- తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అగ్రగామిగా ఉంచుతానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలో పాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టినా అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్గొండలో సెంట్రల్ లైటింగ్ సిస్టం తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.1
- #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios1
- *ఎన్నికలలో హామీలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన అక్రమ కేసుల?* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థి విజన సంఘాల నాయకుల పైన రౌడీషీట!?* *రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న నారా లోకేష్* *విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ ను ఎత్తివేయాలి* *రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం* *ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైయస్సార్ విద్యార్థి విభాగం* *రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ ప్రెస్ క్లబ్ నందు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్ర, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు బాబు, వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తూ జైలుకు పంపడాన్ని ఖండించారు.. ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అడగడం లేదు ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు యువజనలకు వాటిని అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి దొంగ కేసులను బయటికి తోడి విద్యార్థి యువజన సంఘాల నాయకులను జైలుకు పంపుతూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులను కేసుల ద్వారానో జైల్లోకు పంపడం ద్వారానో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారానో విద్యార్థి యువజన ఉద్యమాలను అనిచివేయాలని చూస్తూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పులు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెడతారా అని మన ప్రభుత్వం వస్తే మీకు విద్యార్థులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి నేరుగా తీసుకురండి మేము కేసులు పెట్టడం అరెస్టు చేయడం గృహనిర్బంధాలు చేయడం ఇలాంటివి మా ప్రభుత్వంలో ఉండదని చెప్పిన నారా లోకేష్ ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఎలా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వేయాలని విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు తేజ అరుణ్ నాగరాజు మహేష్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.1
- గుంటూరు/ గుంటూరు కలెక్టరేట్ గుంటూరు కలెక్టరేట్ బంగ్లా ప్రధాన రహదారికి ఎట్టకేలకు మహర్దశ పట్టింది. ఐటీసీ మెడికల్ క్లబ్ సమీపంలో గురువారం తారు రోడ్డు మరమ్మతు పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. గతంలో గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ సౌకర్యం కూడా సరిగ్గా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.1