టెక్కలి లో 30న జిల్లా అట్యా-పట్యా జట్ల ఎంపిక కార్యదర్శి కె. చిరంజీవి టెక్కలి : శ్రీకాకుళం జిల్లా సబ్‌జూనియర్ అట్యా-పట్యా బాలబాలికల జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి కె. చిరంజీవి తెలిపారు. అండర్-14 బాలబాలికల ఎంపిక ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎంపికైన జిల్లా జట్లు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లా క్రీడా ప్రాంగణంలో జరగనున్న 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అట్యా-పట్యా ఛాంపియన్‌షిప్-2026లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలని కార్యనిర్వాహక కార్యదర్శి బి. నారాయణరావు సూచించారు. వయస్సుకు కట్‌ఆఫ్ తేదీ 01-01-2012గా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9440941974, 8500007272 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
టెక్కలి లో 30న జిల్లా అట్యా-పట్యా జట్ల ఎంపిక కార్యదర్శి కె. చిరంజీవి టెక్కలి : శ్రీకాకుళం జిల్లా సబ్‌జూనియర్ అట్యా-పట్యా బాలబాలికల జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి కె. చిరంజీవి తెలిపారు. అండర్-14 బాలబాలికల ఎంపిక ప్రక్రియ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎంపికైన జిల్లా జట్లు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లా క్రీడా ప్రాంగణంలో జరగనున్న 11వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అట్యా-పట్యా ఛాంపియన్‌షిప్-2026లో పాల్గొంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలని కార్యనిర్వాహక కార్యదర్శి బి. నారాయణరావు సూచించారు. వయస్సుకు కట్‌ఆఫ్ తేదీ 01-01-2012గా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9440941974, 8500007272 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
- వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.1
- బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- సంస్కృత భాషా వికాసానికి బాలలే వారధులు - మాకవరపాలెంలో ఘనంగా సంస్కృత వారోత్సవాలు - శోభాయాత్ర, వివిధ పోటీలతో విద్యార్థుల్లో భాషపై ఆసక్తి మాకవరపాలెం: సంస్కృత భాషా వ్యాప్తికి సంస్కృత భారతి చేస్తున్న కృషి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్కృత భాషపై చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు, సంస్కృతంలో మాట్లాడేలా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. సంస్కృత భాషను దేశ విదేశాల్లో విస్తృతంగా పరిచయం చేసేందుకు సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ గత 45 సంవత్సరాలుగా నిరంతరంగా కృషి చేస్తోంది. సంస్థ కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలందిస్తూ భాషా వికాసానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృత భారతి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్కృత బాల కేంద్రాలు నిర్వహిస్తూ చిన్నారులకు సంస్కృత భాషపై ప్రాథమిక అవగాహనతోపాటు మాట్లాడే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే సంస్కృత వారోత్సవాల్లో భాగంగా మాకవరపాలెం మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు సంస్కృత బాల కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా మాకవరపాలెం హైస్కూల్లో విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించడంతోపాటు వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో గాయత్రి సంస్కృత శిక్షణా కేంద్రం నిర్వాహకురాలు గాయత్రి దేవి, సుధీర్ కుమార్, మాకవరపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీను మాస్టారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు1
- కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.1