మనం ఫౌండేషన్ వారిచే శోభన్ బాబు గౌడ్ కు అంబేద్కర్ సేవ శ్రేష్ట అవార్డు... బీదవారికి ఉచిత కమిటీ ఆపరేషన్ లు చేయించిన సందర్భంగా.... నర్సంపేట, ఏప్రిల్ 15, నర్సంపేట డివిజన్లో లక్ష్మీ గణపతి ఆప్టికల్స్, పుష్పగిరి ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చాలా మంది బీదవారికి ఉచిత కమిటీ ఆపరేషన్ లు చేయించిన సందర్భంగా హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో మనం ఫౌండేషన్ వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగ గోపగాని శోభన్ బాబు గౌడ్ ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి డాక్టర్ మధుసూదన్, కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ వేణుగోపాల చారి, డా, దైవజ్ఞ శర్మ, రిటైర్డ్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రత్నం ల చేతుల మీదుగా (అంబేద్కర్ సేవ శ్రేష్ట అవార్డు) ప్రదానం చేయడం జరిగింది అని అవార్డు గ్రహీత గోపగాని శోభన్ బాబు గౌడ్ తెలిపారు. ఈ అవార్డు నాకు రావటానికి సహకరించిన ప్రతి ఒకరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
మనం ఫౌండేషన్ వారిచే శోభన్ బాబు గౌడ్ కు అంబేద్కర్ సేవ శ్రేష్ట అవార్డు... బీదవారికి ఉచిత కమిటీ ఆపరేషన్ లు చేయించిన సందర్భంగా.... నర్సంపేట, ఏప్రిల్ 15, నర్సంపేట డివిజన్లో లక్ష్మీ గణపతి ఆప్టికల్స్, పుష్పగిరి ఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చాలా మంది బీదవారికి ఉచిత కమిటీ ఆపరేషన్ లు చేయించిన సందర్భంగా హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో మనం ఫౌండేషన్ వారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగ గోపగాని శోభన్ బాబు గౌడ్ ను రిటైర్డ్ హైకోర్టు జడ్జి డాక్టర్ మధుసూదన్, కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ వేణుగోపాల చారి, డా, దైవజ్ఞ శర్మ, రిటైర్డ్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రత్నం ల చేతుల మీదుగా (అంబేద్కర్ సేవ శ్రేష్ట అవార్డు) ప్రదానం చేయడం జరిగింది అని అవార్డు గ్రహీత గోపగాని శోభన్ బాబు గౌడ్ తెలిపారు. ఈ అవార్డు నాకు రావటానికి సహకరించిన ప్రతి ఒకరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో మక్కల రాక భారీగా పెరగడంతో యార్డ్ పూర్తిగా నిండిపోయింది. కల్లెడ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో కాంటాలు నెమ్మదిగా జరగడం, లారీల రాక ఆలస్యం కావడం వల్ల కొత్తగా వచ్చే ధాన్యానికి స్థలం లేకపోయింది. దీంతో వారం రోజుల పాటు రైతులు మొక్కజొన్నలను తీసుకురాకూడదని అధికారులు సూచించారు.1
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్సు ఓనర్లను అడిగితే తమ పై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపి వేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచుమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్ళతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రావాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.1
- Post by నీరటి మహేందర్1
- దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.4
- హనంకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సీఐ నవీన్ సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎంజేపీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ప్రాధాన్యత, ట్రాఫిక్ నియమాలపై వివరించి, విద్యార్థులతో మానవహారం ఏర్పాటుచేసి ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై తల్లిదండ్రులకు లేఖలు రాయించడంతో కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది.1