80% రాయితీతో విత్తన పంపిణీ.. వరికు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.. ఏఓ పవన్ కుమార్ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం బండి ఆత్మకూరు గ్రామంలో సాగుచేసిన పత్తి పంటను మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ..రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి సారించాలని వారు సూచించారు. ముఖ్యంగా మినుము, పెసర వంటి పప్పుధాన్య పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ కాలంలో పంటను పూర్తి చేసుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. *80% రాయితీతో విత్తనాలు* బండి ఆత్మకూరు మండలానికి ప్రత్యామ్నాయ పంటలైన మినుము విత్తనాలు మండలానికి విబిఎన్8 రకం 50 క్వింటాలు, విబిఎన్ 10 రకం 20 కింటాలు కేటాయించారాని కావున రైతులు 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయ విత్తనాలు సద్వినియోగం చేసుకోవడానికి స్థానిక రైతు సేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఓ తెలిపారు. ప్రస్తుతం PMDS (Post Monsoon Dry Sowing) కింద అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్, రైతు ఈ-కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని తెలిపారు. అలాగే ఫార్మర్ ఐడి పొందని రైతులు త్వరితగతిన విశిష్ట సంఖ్య కొరకు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని ఏఓ సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తత ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నేలలో తేమ పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు పంట రక్షణ చర్యలు చేపట్టాలని, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటల ఎంపిక, నేలలో తేమ సంరక్షణ, అవసరమైనప్పుడు పంట రక్షణ చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో పత్తి పంట పరిశీలన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల ఎంపిక, పంట రక్షణ చర్యలు, బీమా, ఈ-క్రాప్ బుకింగ్ తదితర కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఏఓ కోరారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వెటర్నరీ డాక్టర్ అనూష, వ్యవసాయ విస్తరణ సిబ్బంది అస్త్రఫ్ పలువురు రైతులు పాల్గొన్నారు.
80% రాయితీతో విత్తన పంపిణీ.. వరికు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.. ఏఓ పవన్ కుమార్ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం బండి ఆత్మకూరు గ్రామంలో సాగుచేసిన పత్తి పంటను మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ..రైతులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ, స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి సారించాలని వారు సూచించారు. ముఖ్యంగా మినుము, పెసర వంటి పప్పుధాన్య పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ కాలంలో పంటను పూర్తి చేసుకోవడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. *80% రాయితీతో విత్తనాలు* బండి ఆత్మకూరు మండలానికి ప్రత్యామ్నాయ పంటలైన మినుము విత్తనాలు మండలానికి విబిఎన్8 రకం 50 క్వింటాలు, విబిఎన్ 10 రకం 20 కింటాలు కేటాయించారాని కావున రైతులు 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయ విత్తనాలు సద్వినియోగం చేసుకోవడానికి స్థానిక రైతు సేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఓ తెలిపారు. ప్రస్తుతం PMDS (Post Monsoon Dry Sowing) కింద అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్, రైతు ఈ-కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని తెలిపారు. అలాగే ఫార్మర్ ఐడి పొందని రైతులు త్వరితగతిన విశిష్ట సంఖ్య కొరకు రిజిస్ట్రేషన్ తీసుకోవాలని ఏఓ సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తత ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నేలలో తేమ పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు పంట రక్షణ చర్యలు చేపట్టాలని, వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటల ఎంపిక, నేలలో తేమ సంరక్షణ, అవసరమైనప్పుడు పంట రక్షణ చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. క్షేత్రస్థాయిలో పత్తి పంట పరిశీలన ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటల ఎంపిక, పంట రక్షణ చర్యలు, బీమా, ఈ-క్రాప్ బుకింగ్ తదితర కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఏఓ కోరారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు వెటర్నరీ డాక్టర్ అనూష, వ్యవసాయ విస్తరణ సిబ్బంది అస్త్రఫ్ పలువురు రైతులు పాల్గొన్నారు.
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి. గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్‌మాల ప్రాజెక్టుకు సంబంధించిన క్రషర్ మిషన్, బ్లాస్టింగ్ కారణంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపన ల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతులు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నాన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.2