పల్లెల అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం...బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపా టి ప్రకాష్ రెడ్డి,వడ్డీ మోహన్ రెడ్డిలు స్పష్టం బోధన్ ప్రతినిధి,ఆగస్టు 11: (లోకల్ టైమ్స్) గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని,నిజామాబాద్ ఎంపీ ఇప్పటికే గ్రామాల అభివృద్ధికి ఎన్నో నిధులు కేటాయించడం అభినందనీయమని,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ పాటి ప్రకాశ్ రెడ్డి,వడ్డీ మోహన్ రెడ్డిలు అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మంజూరు చేసిన ఎంపీ ల్యాడ్స్ నిధులతో బోధన్ మండలంలోని మినార్ పల్లిలోని సేవాలాల్ గుడి ప్రహరీ గోడకు 3 లక్షల రూపాయలు.అమ్లాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్ కొరకు నాలుగు లక్షల రూపాయలు,రాం పూర్ గ్రామంలో మహిళా భవనం కొరకు 3 లక్షల రూ పాయలు ఎంపి అరవింద్ మంజురు చేశారు.ఈ సంద ర్బంగా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు బీజేపీ సీనియర్ నాయకులు,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి(ఎంపిఆర్),వడ్డీ మోహన్ రెడ్డి లు భూమి పూజ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు.వారు మాట్లాడుతూ.. దేశానికి పల్లెలె పట్టుకొమ్మలు అని, అందుకే ఎంపీ అరవింద్ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని,కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మోసపూరిత హామీలు ఇచ్చి మోస పూరిత మాటలు చెప్పుతూ పబ్బం గడుపుతున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి తగిన బుద్ధి చెప్తారని,రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ జడ్పీ చైర్మన్ ను కైవసం చేసు కుంటామని,ఎంపీటీసీ,జడ్పీటీసీ లు,, ½²సర్పంచ్ లు గెలుచుకుంటామని అన్నారు.వారి వెంట బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్, బీజేపీ బోధన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్,బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్, సాలూర మండల అధ్యక్షులు గంగాధర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు జంగం వెంకటేష్, దొనకంటి లక్ష్మారెడ్డి, మండల కార్యదర్శి బోనేకర్ సాందర్యకిరణ్, మాజీ అధ్యక్షులు మనోహర్,మాజీ ప్రధాన కార్యదర్శి జిల్కరి ప్రవీణ్, మాజీ సర్పంచ్ సిర్ప మంజుల, మాజీ ఎంపీటీసీ లక్ష్మి రాజన్న, సీనియర్ నాయకులు చీలం భాస్కర్ రెడ్డి, న్యాలం శ్రీనివాస్, వివిధ గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు, శక్తి కేంద్రం ఇంచార్జి లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.