దోమల నివారణతో జ్వరాల నియంత్రణ వైద్యాధికారిణి డాక్టర్ రంగ లక్ష్మి దోమల నివారణతో మలేరియా, డెంగ్యూ, వైరల్ వంటి జ్వరాలను నియంత్రించవచ్చునని పి. కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ రంగ లక్ష్మి తెలిపారు. సిద్ధవటం మండలంలోని పి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గృహాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. నీటి నిల్వలున్న చోట దోమలు ఉత్పత్తి చెంది అవి కుట్టినప్పుడు మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు సోకుతాయన్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సాయంత్రం వేళల్లో పొగ వేసుకుంటే దోమలు ఇళ్లలోకి రాకుండా నియంత్రించవచ్చునన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకులను తప్పనిసరిగా వారానికొకసారి శుభ్రపరచాలని సూచించారు. రెండు వారాలు పాటు దగ్గు, అలసట ఉన్న రోగులు ప్రతి ఒక్కరూ సమీప ప్రభుత్వ వైద్యశాలలో గల్ల పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్సలు చేసుకోవాలని ఆమె తెలిపారు.
దోమల నివారణతో జ్వరాల నియంత్రణ వైద్యాధికారిణి డాక్టర్ రంగ లక్ష్మి దోమల నివారణతో మలేరియా, డెంగ్యూ, వైరల్ వంటి జ్వరాలను నియంత్రించవచ్చునని పి. కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ రంగ లక్ష్మి తెలిపారు. సిద్ధవటం మండలంలోని పి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గృహాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. నీటి నిల్వలున్న చోట దోమలు ఉత్పత్తి చెంది అవి కుట్టినప్పుడు మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరాలు సోకుతాయన్నారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సాయంత్రం వేళల్లో పొగ వేసుకుంటే దోమలు ఇళ్లలోకి రాకుండా నియంత్రించవచ్చునన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకులను తప్పనిసరిగా వారానికొకసారి శుభ్రపరచాలని సూచించారు. రెండు వారాలు పాటు దగ్గు, అలసట ఉన్న రోగులు ప్రతి ఒక్కరూ సమీప ప్రభుత్వ వైద్యశాలలో గల్ల పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్సలు చేసుకోవాలని ఆమె తెలిపారు.
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు కదిలారు.1
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి:సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో పంటలు సాగు కావడంలేదని, కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పులివెందుల మండలంలోని బీడు భూములు, కాలువలను ఆయన సీపీఐ నాయకులతో కలిసి పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులలో రైతుల బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గమనించాలన్నారు.1
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట డాక్యుమెంట్ రైటర్లు నిరసన అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.1
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1