Shuru
Apke Nagar Ki App…
ఓటర్లందరూ తమ వివరాలను ఓటర్ల జాబితాలో పరిశీలించుకోవాలి: ఆర్డీవో ఓటర్లందరూ తమ పేరు, ఇతర వివరాలను ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆర్డీవో చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ జాబితాను ప్రజల పరిశీలన కోసం ఏఈఆర్వో కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్లో ఉంచడం జరిగిందన్నారు.
LAKKU SIVA SANKAR reddy
ఓటర్లందరూ తమ వివరాలను ఓటర్ల జాబితాలో పరిశీలించుకోవాలి: ఆర్డీవో ఓటర్లందరూ తమ పేరు, ఇతర వివరాలను ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆర్డీవో చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం పులివెందుల పట్టణంలోని స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ జాబితాను ప్రజల పరిశీలన కోసం ఏఈఆర్వో కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్లో ఉంచడం జరిగిందన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1