Shuru
Apke Nagar Ki App…
తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? సిగ్గు సిగ్గు..🤬 సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది గుండాలు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం
SIRIPATI ARUNKUMAR
తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? తెలంగాణలో హద్దు మీరుతున్న అరాచకత్వం ఏకంగా రక్షక నిలయం ఐనా పోలీస్ స్టేషన్ లోనే రక్షణగా నిలవాల్సిన పోలీస్ ల ముందే దాడులా??? సిగ్గు సిగ్గు..🤬 సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ ఉండగా మాస్కులు ధరించి దాడికి యత్నించిన 15 మంది గుండాలు బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్లు ఎదురు తిరగడంతో పారిపోయిన వైనం
More news from తెలంగాణ and nearby areas
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. సోమవారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 1140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే VIP దర్శనాలు రూ.2.68 లక్షలు, ప్రసాదలతో రూ.9.11 లక్షలు, కార్ పార్కింగ్ రూ.3.50 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1.13 లక్షలు, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ.21,30,621 ఆదాయం వచ్చింది.1
- ఎగువ ప్రాంతాల నుండి వాగులోకి నీళ్లు రావడంతో పొంగిపొర్లుతున్న చెక్డ్యామ్ జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రాంబోజిగూడెం గ్రామంలోని వాగులో ఉన్న చెక్‌డ్యాం పొంగి పొర్లుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పెద్దగా లేకపోయినా ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రావడంతో చెక్‌డ్యాం నిండిపోయి మత్తడి పోస్తుండటం ఆనందంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. చెక్‌డ్యాం నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని,రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని,వాగులో నీటి ప్రవాహం కొనసాగడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు.1
- వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్‌నాయక్ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్ రమేష్, స్వామి, మల్లేష్, నర్సింలు, బాలచందర్, యాదగిరి, భాస్కర్, ఎల్లయ్య, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.2
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.2
- మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవాలకు భారీ బందోబస్తు గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది “గణేష్ సురక్ష సంకల్ప్–2026” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. “మన గణేష్ – మన భద్రత” అనే నినాదంతో భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు బాధ్యతగా, క్రమశిక్షణతో ఉత్సవాలను నిర్వహించాలని సిపి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 వేలకుపైగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయాలని సూచించగా, ఇప్పటివరకు సుమారు 6,500 ఆన్‌లైన్ దరఖాస్తులు అందినట్లు వెల్లడించారు. ఉత్సవాల బందోబస్తు కోసం అన్ని స్థాయిలకు చెందిన 5,749 మందికిపైగా పోలీస్ సిబ్బందిని విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. అదనంగా ఇతర జిల్లాలు, ప్రత్యేక విభాగాల నుంచి కూడా సిబ్బందిని రప్పిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు సుమారు 1,200 మంది ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉంటారని, కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1