Shuru
Apke Nagar Ki App…
నారాయణఖేడ్ పట్టణంలో గజేంద్ర భారతి మహారాజ్ ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తాం మీడియాతో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
Sangareddy News
నారాయణఖేడ్ పట్టణంలో గజేంద్ర భారతి మహారాజ్ ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తాం మీడియాతో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.1
- బీసీలకు 42% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: జాజుల లింగం గౌడ్ బీసీలకు 42 శాతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బిసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతం ఇస్తామంటూనే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో 14న గంగాజల సేకరణ, ధ్వజ శోభాయాత్ర, ధ్వజారోహణ, మండప ప్రవేశం, గణపతి పూజ నిర్వహించనున్నారు. 15న వేదపఠనం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, పల్లకీ సేవ, 16న రుద్రహోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, విశేష కుంకుమ పూజ, రథోత్సవం, బలిహరణ, 17న భద్రకాళి పూజ, శివ కల్యాణం, ప్రభల ఊరేగింపు, 18న ఉదయం అగ్ని గుండాలతో ఉత్సవం ముగియనుంది.1
- booking available any update dm 91374319461
- భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు | #krnews369 #newstoday #festival #nirmaldistrict1
- నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.1
- భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి: నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ పట్టణం నుండి మహారాష్ట్రలోని సుప్రసిద్ధ దేవాలయం పండరీపూర్ కు కరణ్ గజేంద్ర భారతి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర కార్యక్రమాన్ని పట్టణంలోని పురాతన రామ మందిరం నుండి ఎంపీ సురేష్ కుమార్ షేట్కర్, మాజీ సర్పంచ్ అప్పారావు షెట్కర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హుక్రాన శివారులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దైవచింతనతోనే ముక్తి దొరుకుతుందని సద్గురువుల సేవలో ఉంటేనే పరమార్ధం లభిస్తుందని తెలిపారు.1
- నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం..... హాలియా మున్సిపాలిటీ.... పరిధిలో........ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్ గారు మరియు పార్టీ ఆదేశానుసారం..... సంక్రాంతి పండగ సందర్భంగా సికే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..... ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన..... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* మకర సంక్రాంతి పండగ సందర్భంగా..... మహిళా మణులకు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో సుమారు 75 మంది మహిళలు పాల్గొని, వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి మరియు ద్వితీయ మరియు తృతీయ స్థానాలకు గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... సంక్రాంతి పండగ అంటే మహిళల పండగానే భావిస్తారని,మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగనే నని గుర్తు చేశారు.హాలియా పట్టణ ప్రజలకు మరియు మహిళా మణులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో....... రాష్ట్ర నాయకులు వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్, కేవీ రామారావు, మాజీ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు వర్ర వెంకట్ రెడ్డి,హాలియా పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ అన్నేపాక శ్రీనివాస్, చవ్వకుల రాజు, వార్డ్ నాయకులు బొంగరాల యేసు రాజు,విద్యా వేత్త...డాక్టర్ బద్దేపాక ప్రసాద్,నల్ల బాలు,సి.కె యూత్ కమిటీ సభ్యులు,యువకులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.1
- ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వసుమతి నరసింహ, మే రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున గౌడ్ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి రంగురంగుల ముగ్గుల ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ గ్రామంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని గ్రామంలోని పెద్దలు పేర్కొన్నారు.1