Shuru
Apke Nagar Ki App…
నకిరేకల్ ఏవీఎం విద్యాసంస్థల హెచ్‌ఎం కందాల లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య శ్రీనివాస్‌తో పాటు పలువురు రాజకీయ, విద్యా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యా రంగానికి ఇది తీరని లోటని పేర్కొంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Nagesh Kothapalli
నకిరేకల్ ఏవీఎం విద్యాసంస్థల హెచ్‌ఎం కందాల లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య శ్రీనివాస్‌తో పాటు పలువురు రాజకీయ, విద్యా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యా రంగానికి ఇది తీరని లోటని పేర్కొంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
More news from Telangana and nearby areas
- నల్గొండ: కనిపించని స్పీడ్ బ్రేకర్లు.. వాహనదారుల ప్రాణాలకే ముప్పు NLG: నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా ఏమి రెడ్డి గూడెం వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఇవి అసలు కనిపించక వాహనాలు అదుపుతప్పి పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే రహదారి భద్రత అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- తిప్పర్తి మండలంలో ఇండియన్ గ్యాస్ కస్టమర్ల సమస్యను పరిష్కరించాలి: సిపిఎం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని సిపిఎం మండల కార్యదర్శి ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి మణిదీప్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం, మండల నాయకులు భీమగాని గణేష్ లు మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వెంటనే సిలిండర్ అందజేయాలని డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆదివారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.16,83,760, VIP దర్శనాలతో రూ.9,29,700, కార్ పార్కింగ్తో రూ.7,27,500, బ్రేక్ దర్శనాలతో రూ.4,21,500, ప్రధాన బుకింగ్తో రూ.3,57,950, వ్రతాలతో రూ.2,79,000, యాదరుషి నిలయం రూ.2,71,150, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.51,80,379 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- రాష్ట్రంలో గన్, డ్రగ్స్, గంజాయి కల్చర్ పెరిగింది : మాజీమంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు కవిత క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో గన్ కల్చర్, డ్రగ్స్, గంజాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ హయాంలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో పోలీసులు ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో చూపుతున్న శ్రద్ధ శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.1
- NCHM JEE-2026 పరీక్షకు సంబంధించిన మొదటి ఆన్సర్ కీ విడుదలైంది. విద్యార్థులు తమ సమాధానాలను వెంటనే సరిచూసుకొని స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. తదుపరి ప్రక్రియకు ఇది అత్యంత కీలకమైన అడుగు.1
- తెలంగాణ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బూతు పురాణంతో వార్తల్లో నిలిచారు. అధికారం రాగానే ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.1
- నల్గొండలో చికెన్ ధరలు అమాంతం పెరిగి రూ.330 దాటాయి, మటన్ ధరలను చేరువవుతున్నాయి. వేసవిలో కోళ్ల దిగుమతి తగ్గడంతో ఈ ధరల పెరుగుదల సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూరగాయల వైపు మొగ్గు చూపుతున్నారు.1