logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమ్రాబాద్ అడవుల్లో చెంచు పెంటల్లోని చెంచుల ఆర్థిక పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆరా *రాష్ట్ర గవర్నర్‌కు నల్లమల్ల టైగర్ పెద్దపులి ఛాయాచిత్రం జ్ఞాపికను గుర్తుగా అందజేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్* అచ్చంపేట, మార్చ్ 14,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని నల్లమల అడవుల్లో జీవిస్తున్న చెంచు గిరిజనుల జీవన విధానం, ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అధికారులతో సమగ్రంగా చర్చించారు. శనివారం కుటుంబ సమేతంగా శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన నాగర్‌కర్నూల్ జిల్లాఅచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండలం మున్ననూరులోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్‌లో కాసేపు విరామం తీసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమల్ల అడవుల్లోని వివిధ చెంచు పెంటల్లో జీవిస్తున్న గిరిజనుల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, వారి సంస్కృతి గురించి స్థానిక అధికారులను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ దత్తత తీసుకున్న చెంచు పెంటల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా సోలార్ విద్యుత్, త్రాగునీటి సదుపాయాలు, నిధుల వినియోగం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల వివరాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,రాష్ట్ర గవర్నర్‌కు వివరించారు. అదేవిధంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న అపారమైన సహజ వనరులు, జలపాతాలు, వన్యమృగ సంపద, శైవ క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, ఎకో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై కూడా అధికారులు గవర్నర్‌కు సమగ్ర సమాచారం అందించారు. నల్లమల్ల అడవుల్లోని వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలు, అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలపై కూడా జిల్లా అటవీ శాఖ అధికారులు గవర్నర్‌కు వివరించారు. అదే విధంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక వివరాలను జిల్లా కలెక్టర్ గవర్నర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లమల్ల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో సంచరిస్తున్న పెద్దపులి ఛాయాచిత్రాం రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు అందజేశారు. నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని సహజ సౌందర్యం, వన్యప్రాణి సంపదను ప్రతిబింబించేలా ఈ ఛాయాచిత్రం ఉండటంతో గవర్నర్ ప్రత్యేకంగా కలెక్టర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

on 14 March
user_Taluka press club president:Sambu.chandra sekhar
Taluka press club president:Sambu.chandra sekhar
అచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
on 14 March
67164a2f-db4e-4ff6-a4f4-ba7502e76814

More news from తెలంగాణ and nearby areas
  • భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు
    1
    భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘన నివాళి అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషివల్లే నిమ్నజాతి వర్గాలు స్వేచ్ఛగా ఉంటూ తమ హక్కులను రాజ్యాంగంతో సాధించుకుంటున్నారని పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అన్ని దేశ భక్తులను నేతలను ఆకట్టుకుందని గుర్తు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
  • బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. బీసీ ఎస్సీ ఎస్టీ జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l
    1
    బిజినేపల్లి మండలం మంగనూరులో నిర్వహించిన పూలే-అంబేద్కర్ స్మారక క్రీడా టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్వరం నాగయ్య, ఉపసర్పంచ్ బోట్క చంద్రశేఖర్ , జిల్లా, మండల నేతలు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.
బీసీ ఎస్సీ ఎస్టీ  జాకు గ్రామ అధ్యక్షులు అల్వాల శ్రీకాంత్ గౌడ్,ఉపాధ్యక్షులు బందెల కృష్ణ,తిమ్మగల్లు ఆంజనేయులు జాలం శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆవుల కృష్ణ,కోశాధికారి అప్పల తిరుపతయ్య,మరియు తిమ్మగల గోపీనాథ్,అప్పల పులేందర్ మంగనూరు విజ్ఞాన వేదిక ఫౌండర్ బోట్క కొండయ్య,బోట్క రాజు, మండల బీసీ సంఘం అధ్యక్షులు సత్యశీల సాగర్, గ్రామ బీసీ సంఘం అధ్యక్షులు మేకల యాదయ్య, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిన్నగాల పరశురాములు మరియు గౌడ సంఘం నాయకులు కురుమూర్తి గౌడ్, జాలం,తిరుపతయ్య, వెంకటయ్య మహనీయుల స్మారక టోర్నమెంట్ ఫిజికల్ డైరెక్టర్లు  వ్యవహరించిన మేకల మాసయ్య, తిమ్మగళ్ల  మల్లికార్జున్,రవి పులిందర్ మరియు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.l
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    4 hrs ago
  • బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    1
    బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    1
    నల్లగొండ బ్రేకింగ్: 
నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు..
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ...
అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి...
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు...
అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    22 hrs ago
  • నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    22 hrs ago
  • నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    1
    నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.
    user_Reporter
    Reporter
    జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    1
    కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు
    1
    పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు భారత రాజ్యాంగం నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాయుడని పేర్కొన్నారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాల సైతం గుర్తించాయన్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.