logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS)కు తక్షణమే ప్రీ-ప్రైమరీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ విద్యా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పోసాన్ పల్లి రాజు, విద్యా కమిటీ అధ్యక్షులు కోతం కృష్ణంరాజు ప్రధానంగా మాట్లాడారు. పాఠశాలకు ప్రీ-ప్రైమరీ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యా కమిటీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. విద్యాభివృద్ధి పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత విద్యాసంవత్సరంలో గ్రామస్తుల చొరవతో పాఠశాలలో సొంతంగా ఒక విద్యా వాలంటీర్‌ను నియమించుకుని UKG తరగతులను విజయవంతంగా నిర్వహించామని, ఈ తరగతులు, విద్యార్థుల వివరాలను విద్యాశాఖకు చెందిన అధికారిక 'యూ-డైస్ ప్లస్' (UDise+) పోర్టల్‌లో కూడా నమోదు చేశామని వారు గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించి తమ పాఠశాలకు ప్రీ-ప్రైమరీని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించని పక్షంలో, రాబోయే రోజుల్లో బడి పిల్లలతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు నిర్వహిస్తామని వారు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VDC కమిటీ అధ్యక్షులు కొంతం లక్ష్మయ్య, విద్యా కమిటీ అధ్యక్షులు కొంతం కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి దండు ప్రవీణ్, వార్డు మెంబర్ కిష్టయ్య, బాలరాజు, స్వామి, సత్యనారాయణ, మహేందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
1 hr ago
553a1674-ebf6-4443-bd92-469d85985702

తిమ్మాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS)కు తక్షణమే ప్రీ-ప్రైమరీ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ విద్యా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పోసాన్ పల్లి రాజు, విద్యా కమిటీ అధ్యక్షులు కోతం కృష్ణంరాజు ప్రధానంగా మాట్లాడారు. పాఠశాలకు ప్రీ-ప్రైమరీ ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యా కమిటీ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. విద్యాభివృద్ధి పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గత విద్యాసంవత్సరంలో గ్రామస్తుల చొరవతో పాఠశాలలో సొంతంగా ఒక విద్యా వాలంటీర్‌ను నియమించుకుని UKG తరగతులను విజయవంతంగా నిర్వహించామని, ఈ తరగతులు, విద్యార్థుల వివరాలను విద్యాశాఖకు చెందిన అధికారిక 'యూ-డైస్ ప్లస్' (UDise+) పోర్టల్‌లో కూడా నమోదు చేశామని వారు గుర్తుచేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించి తమ పాఠశాలకు ప్రీ-ప్రైమరీని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించని పక్షంలో, రాబోయే రోజుల్లో బడి పిల్లలతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరవధిక దీక్షలు నిర్వహిస్తామని వారు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VDC కమిటీ అధ్యక్షులు కొంతం లక్ష్మయ్య, విద్యా కమిటీ అధ్యక్షులు కొంతం కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి దండు ప్రవీణ్, వార్డు మెంబర్ కిష్టయ్య, బాలరాజు, స్వామి, సత్యనారాయణ, మహేందర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by KHADEER REPORTER
    1
    Post by KHADEER REPORTER
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • హరీష్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన పగబడుతారని ఆరోపించారు. ప్రభుత్వం ఎస్బీఐకి కేటాయించిన భూమిని విక్రయించిన తర్వాత, ఇప్పుడు ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వరల్డ్ బ్యాంక్ కూడా రేవంత్ రెడ్డి మాట వినకపోతే వాటిని కూడా నిషేధిస్తాడంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. చివరగా, రేవంత్ రెడ్డి వీటన్నింటినీ నిషేధించి కొత్తగా 'కొండల్ రెడ్డి బ్యాంక్' పెడతారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
    1
    హరీష్ రావు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన పగబడుతారని ఆరోపించారు. ప్రభుత్వం ఎస్బీఐకి కేటాయించిన భూమిని విక్రయించిన తర్వాత, ఇప్పుడు ప్రశ్నించినందుకు ఎస్బీఐని నిషేధిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వరల్డ్ బ్యాంక్ కూడా రేవంత్ రెడ్డి మాట వినకపోతే వాటిని కూడా నిషేధిస్తాడంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. చివరగా, రేవంత్ రెడ్డి వీటన్నింటినీ నిషేధించి కొత్తగా 'కొండల్ రెడ్డి బ్యాంక్' పెడతారేమో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
    user_ARUTLA KISHORE KUMAR
    ARUTLA KISHORE KUMAR
    Teacher Yadagirigutta, Yadadri Bhuvanagiri•
    1 hr ago
  • కేటీఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి 'సినిమా చూపెట్టే' బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరినీ, వారు రిటైర్ అయినా, పారిపోయినా లేదా సప్త సముద్రాలు దాటినా, లాక్కొచ్చి నిలబెడతానని కేటీఆర్ దృఢంగా ప్రకటించారు.
    1
    కేటీఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి 'సినిమా చూపెట్టే' బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. తమ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరినీ, వారు రిటైర్ అయినా, పారిపోయినా లేదా సప్త సముద్రాలు దాటినా, లాక్కొచ్చి నిలబెడతానని కేటీఆర్ దృఢంగా ప్రకటించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు. ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.
    1
    రైతులు యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ ద్వారా రైతులు తమ ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌లో సమీపంలోని ఎరువుల దుకాణాల్లో ఎంత యూరియా నిల్వ ఉందో తెలుసుకునే సౌకర్యం ఉందని, దీనివల్ల రైతులు తమకు అవసరమైన దుకాణాన్ని ఎంపిక చేసుకుని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చని దేవ్‌కుమార్ వివరించారు.

ఈ కొత్త విధానం వల్ల క్యూలైన్లు, రద్దీ, అనవసర ఇబ్బందులు తగ్గడంతో పాటు ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూరియా కొరతపై రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని దేవ్‌కుమార్ హామీ ఇచ్చారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకొని రైతులు సులభంగా ఎరువులు పొందాలని ఆయన సూచించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    17 min ago
  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    4
    మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    2 hrs ago
  • గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
    1
    బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    21 hrs ago
  • Post by KHADEER REPORTER
    1
    Post by KHADEER REPORTER
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.