భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నాను జయప్రదం చేయండి. ఎఐబియస్పీ. పలమనేరు అక్టోబర్ 1( ప్రజా ప్రతిభ) అక్టోబర్ 9వ తేదీ మాన్యశ్రీ కాన్షిరాం వర్ధంతి సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏ ఐ బిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం కోరారు. అందులో భాగంగా జయరామ్ గౌడ్ , సోమరాజు, మహిళ నాయకురాలు సరస్వతి అధ్యక్షతన పలమనేర్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివి మునిరత్నం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బిజెపి, దాని అనుబంధ సంఘం ఆర్ఎస్ఎస్ రెండు కలిసి రాజ్యాంగంలోని లౌకిక---- సామ్యవాదం అనే రెండు పదాలను తొలగించాలని ముమ్మరంగా ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఆ రెండు పదాల తొలగింపు విషయములో సుప్రీం కోర్ట్ స్పందించి లౌకిక--- సామ్యవాదం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నందున తొలగించరాదని తీర్పు ఇచ్చినప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్నే మార్చే ప్రక్రియకు ఆర్ఎస్ఎస్ బిజెపి శ్రీకారం చుట్టాయి అన్నారు. ఆ రెండు పదాలు తొలగించడం వలన దేశంలోని 80% మంది ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలుకు దూరంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ప్రాథమిక హక్కులుగా లౌకికత్వం---- సామ్యవాదం పునాదులుగా ఉంటాయని గతంలోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయులలో మత సంబంధమైన వివక్ష ఉండరాదని , తమకు ఇష్టమైన మతాన్ని పాటించి ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్లో భాగమేనన్నారు. బిజెపి ,ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి దేశ ప్రజలకు నిత్యం సవాలుగా మారుతున్న మతతత్వం---- పెట్టుబడిదారీ విధానాలను తీసుకురావాలనే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు .ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బిజెపికి అనుకూలంగా ఉండే నాయకుల చేత సనాతన ధర్మం, మనువాద శాస్త్రాన్ని బలవంతంగా ప్రసంగాల్లో చెప్పిస్తున్న విషయం నగ్న మెరిగిన సత్యం అన్నారు. దేశ ప్రజలకు ఇష్టం లేని మతతత్వం--- పెట్టుబడి దారి విధానాలను కష్టంగా రుద్దాలని చూస్తున్న బిజెపి ,ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం, క్రైస్తవ మైనార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల 9వ తేదీ విజయవాడ నగరంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగు భారత రాజ్యాంగ పరిరక్షణ, లౌకిక--- సామ్యవాద పదాలను తొలగించరాదు అనే నిరసన ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, సాంబశివ, వాణి, శాంతమ్మ, చిన్న, మనోహర్, వెంకటపతి, షేట్, శ్రీనివాసులు, సురేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు

- మనసున్న వారు మూర్కులకు మృగం క్రూరమైన వారికి కూడా సహాయం చేయగలరు1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏1
- పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప1