🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 కోకాపేటలో హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 కోకాపేటలో హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు, వారిని పరామర్శించేందుకు వరంగల్ బయలుదేరుతున్న సమయంలో ఆయనను ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నం.97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై హరీశ్‌రావు ఇప్పటికే వారికి మద్దతు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు వరంగల్ వెళ్లాలని హరీశ్‌రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “విద్యార్థుల సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్న ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సమంజసం కాదు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి” అని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, జీవో నం.97పై ప్రభుత్వం పునరాలోచించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ కొనసాగుతోంది. — బ్రేకింగ్ న్యూస్ | హైదరాబాద్
🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 కోకాపేటలో హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 కోకాపేటలో హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం హైదరాబాద్, ఆగస్టు 27: హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు, వారిని పరామర్శించేందుకు వరంగల్ బయలుదేరుతున్న సమయంలో ఆయనను ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నం.97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై హరీశ్‌రావు ఇప్పటికే వారికి మద్దతు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు వరంగల్ వెళ్లాలని హరీశ్‌రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “విద్యార్థుల సమస్యను తెలుసుకోవడానికి వెళ్తున్న ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సమంజసం కాదు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి” అని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, జీవో నం.97పై ప్రభుత్వం పునరాలోచించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ కొనసాగుతోంది. — బ్రేకింగ్ న్యూస్ | హైదరాబాద్
- రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు1
- వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.1
- మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.1
- *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.1
- వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ తోపాటు స్థానికులు తాగుబోతును చితక్కొట్టారు వరంగల్ లో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మందు బాబును పోలీస్ తోపాటు స్థానికులు చితక్కొట్టారు. ఒళ్ళు హూనం అయ్యేలా లాఠీలతో చితకబాదారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళింగ బార్ ఆవరణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. చొక్కా వేసుకొమ్మని పలుమార్లు అతనితో వచ్చిన వ్యక్తి చెప్పినప్పటికి మైకంలో ఉన్న వ్యక్తి వినిపించుకోలేదు. దీంతో స్థానికులు డయల్ 100 కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చొక్కొ వేసుకుని వెళ్ళిపోవాలని సూచించాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోలేని మైకంలో ఉన్న వ్యక్తిపై కోపంతో కానిస్టేబుల్ చెంప పై కొట్టాడు. దీంతో మద్యం మత్తులో కన్న వ్యక్తి ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించాడు. ఇక పోలీస్ తాగుబోతుపై తన ప్రతాపం చూపాడు. కానిస్టేబుల్ తోపాటు స్థానికులు లాఠీలతో తాగుబోతును చితక్కొట్టారు. తాగుబోతు పడిలేచి పరిగెత్తించేలా కొట్టారు. అడ్డుకోబోయిన తాగుబోతుతో వచ్చిన వ్యక్తి పై దాడికి యత్నించారు. అంతా అయిపోయాక పోలీసులు తాగుబోతు గురించి ఆరా తీస్తే అతను మామునూరు ఫోర్త్ బెటాలియన్ లో 2018 బ్యాచ్ కి చెందిన మనోజ్ గా గుర్తించారు. డయల్ 100 కాల్ తో వచ్చిన మిల్స్ కాలనీ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి పిర్యాదు తో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.1
- మర్రి చెట్టుకు ‘మర్రి కల్లు’.. వేరు నుంచి జాలువారుతున్న కల్లు! మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని చిన్నాలకుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుంచి కల్లు జాలువారడం వింతగా మారింది. నాలుగైదు రోజులుగా దీనిని గమనించిన గీత కార్మికుడు ఆకుల శ్రీను, వేరుకు గీతలు పెట్టి లొట్టి కట్టారు. లొట్టిలో కల్లు పడటంతో పలువురు ఆసక్తిగా అక్కడికి చేరుకుంటున్నారు. మర్రి చెట్టు పక్కనే ఉన్న వ్యవసాయ బావి పూడికతీత పనుల్లో చెట్టు ప్రధాన వేరు తెగిపోవడంతో మూడు, నాలుగు రోజులుగా కల్లు జాలువారుతున్నట్లు శ్రీను తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చెట్టును చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. గీత కార్మికుడు కల్లును సేకరించి విక్రయిస్తున్నట్లు తెలిపారు.1
- ఖమ్మం జిల్లాలో ఉదయం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో ఉదయం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఖమ్మం రూరల్, ఖమ్మం నగరం, కల్లూరు, రఘునాథపాలెం, కొణిజర్ల, కూసుమంచి, బోనకల్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు జలమయమైయ్యాయి.ఈ వర్షం కారణంగా ఉదయాన్నే పనికి వెళ్లే రోజువారి కూలీలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు ఈ వర్షం రాకతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయిన ముందుండే నాయకుడు.. ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్... డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... నా ప్రాంతం అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయినా ఆలోచించే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్... పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు రామచంద్రునాయక్.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ఒక్కటే ప్రశ్న.. అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం కాదు… మీ హయాంలో ప్రజలకు ఏం చేశారు? నేడు జరుగుతున్న అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పండి. అసత్య ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకోలేరు. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ప్రజలే అండగా ఉంటారు. డోర్నకల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ నాయకత్వానికి మా పూర్తి మద్దతు. ✊🏽 అభివృద్ధి మాట్లాడుతుంది… అసత్య ప్రచారాలు మౌనమవుతాయి!1
- నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 160 మంది మృతి.. వందలాది మంది గల్లంతు* కాఠ్మాండు, నేపాల్‌లో బుధవారం, ఆగస్టు 26న ఉదయం సంభవించిన ఆకస్మిక ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర బీభత్సం సృష్టించాయి. నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా వచ్చిన వరద ప్రవాహం రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. నేపాల్‌లో 157 మంది మృతి చెందగా, టిబెట్‌లో మరో ముగ్గురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 160కి చేరింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్య భోటే కోసి నదిలో ఒక్కసారిగా భారీ వరద ప్రవాహం మొదలైంది. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన రాక్‌స్లైడ్, మంచు–రాళ్ల భారీ ప్రవాహం కారణంగా ల్హెండే నది ఉద్ధృతమై, ఆ నీరు భోటే కోసి నదిలోకి చేరినట్లు నేపాల్ అధికారులు తెలిపారు. ఈ వరదలు భారీ వర్షాల కారణంగా సంభవించలేదని ప్రాథమికంగా అధికారులు పేర్కొన్నారు. వంతెనలు, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసం వరద ప్రవాహం తీవ్రతకు అనేక ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రసువా జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. అనంతరం వరద ప్రవాహం నువాకోట్, ధాదింగ్, చిత్వాన్ తదితర జిల్లాల వైపు విస్తరించింది. *గల్లంతైన వారిలో భారతీయులు* నేపాల్ టూరిజం బోర్డు విడుదల చేసిన ప్రాథమిక సమాచారంలో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. గల్లంతైన విదేశీయుల్లో 105 మంది భారతీయులు, 37 మంది NRIలు ఉన్నట్లు తొలుత వెల్లడైంది. అనంతరం మరింత సమాచారం వెలువడటంతో గల్లంతైన భారతీయుల సంఖ్య 133కి చేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. వీరిలో పలువురు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నారు. *కొనసాగుతున్న సహాయక చర్యలు* గల్లంతైన వారి కోసం నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఇతర భద్రతా బలగాలు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు ధ్వంసం కావడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు భోటే కోసి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో ఇంకా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారత ప్రభుత్వం కూడా నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణ, సహాయక చర్యలపై నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేస్తోంది. మృతుల సంఖ్య, గల్లంతైన వారి సంఖ్యపై రెస్క్యూ బృందాల గాలింపు పూర్తయ్యే కొద్దీ మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.1