*లంబోదరుని కరుణాకటాక్షములతో... ప్రతి అడుగు శుభప్రదం అవ్వాలి* *ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి* *పలు గణనాథుని మండపాలలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, క్రిస్టియన్ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథుని పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి(NNR )పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లంబోదరుని కృపాకటాక్షాలతో ప్రజలందరి జీవితాల్లో ప్రతి అడుగు శుభప్రదంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి కాలనీవాసులు,ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్,బీఎస్ సుధీర్,మాజీ కౌన్సిలర్లు చింటు ప్రతాప్ రెడ్డి,నందాకిషోర్,చిన్న యాదగిరి,పాలమూకుల చెన్నయ్య,కాంటెస్టెడ్ కౌన్సిలర్ రాజేందర్ సింగ్, లింగం దాన సర్పంచ్ నాగిళ్ల వెంకట్,మాజీ జడ్పిటిసి సాయి క్రిష్ణ, మాజీ సర్పంచ్ చక్కటి వెంకటేష్,నాయకులు సేరి శ్రీనివాసరెడ్డి,అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి,ఆంజనేయులు గౌడ్,మురళి రెడ్డి,నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
*లంబోదరుని కరుణాకటాక్షములతో... ప్రతి అడుగు శుభప్రదం అవ్వాలి* *ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి* *పలు గణనాథుని మండపాలలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి* గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, క్రిస్టియన్ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణనాథుని పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి(NNR )పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ లంబోదరుని కృపాకటాక్షాలతో ప్రజలందరి జీవితాల్లో ప్రతి అడుగు శుభప్రదంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి కాలనీవాసులు,ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి,తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్,బీఎస్ సుధీర్,మాజీ కౌన్సిలర్లు చింటు ప్రతాప్ రెడ్డి,నందాకిషోర్,చిన్న యాదగిరి,పాలమూకుల చెన్నయ్య,కాంటెస్టెడ్ కౌన్సిలర్ రాజేందర్ సింగ్, లింగం దాన సర్పంచ్ నాగిళ్ల వెంకట్,మాజీ జడ్పిటిసి సాయి క్రిష్ణ, మాజీ సర్పంచ్ చక్కటి వెంకటేష్,నాయకులు సేరి శ్రీనివాసరెడ్డి,అడ్వకేట్ శ్రీనివాసరెడ్డి,ఆంజనేయులు గౌడ్,మురళి రెడ్డి,నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
- _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్. గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/ గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.4
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.1
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- కాగజ్‌నగర్‌లో చిన్నారిపై అఘాయిత్యం.. మేనమామ అరెస్ట్! దారుణ ఘటన కలకలం రేపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు, మహిళలు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులు, చీపుర్లతో దాడి చేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1