logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అన్నా చెల్లెల అనుబంధంః చేతులు లేకపోతే నేం అన్నపై ఉన్న చెల్లి ప్రేమ అన్నాచెల్లెల ప్రేమకు అవదులు ఉండవు. తోబుట్టువుల. మధ్య ఉండే. పవిత్రమైన బంధం. అమూల్యమైనది.ఆప్యాయతను గుర్తు చేస్తూ ఓ చిట్టి చెల్లి అన్న పై చూపిన ప్రేమకు.నేటిజెన్లు ఫిదా అవుతున్నారు.అన్నకు రాఖీ కట్టాలి అనే తపన. ముందు ఆ చిట్టితల్లి అంగ వైకల్యం ముందు ఓడిపోయింది చేతులు లేకపోయినా.తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితో అన్న కి బొట్టు పెట్టి స్వీట్ తినిపించింది అన్న ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది

8 hrs ago
user_ఆకుల  శ్రీనివాస్  జర్నలిస్ట్
ఆకుల శ్రీనివాస్ జర్నలిస్ట్
Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
8 hrs ago
9ef73220-89e3-4ea5-9619-4960fccf0ba2

అన్నా చెల్లెల అనుబంధంః చేతులు లేకపోతే నేం అన్నపై ఉన్న చెల్లి ప్రేమ అన్నాచెల్లెల ప్రేమకు అవదులు ఉండవు. తోబుట్టువుల. మధ్య ఉండే. పవిత్రమైన బంధం. అమూల్యమైనది.ఆప్యాయతను గుర్తు చేస్తూ ఓ చిట్టి చెల్లి అన్న పై చూపిన ప్రేమకు.నేటిజెన్లు ఫిదా అవుతున్నారు.అన్నకు రాఖీ కట్టాలి అనే తపన. ముందు ఆ చిట్టితల్లి అంగ వైకల్యం ముందు ఓడిపోయింది చేతులు లేకపోయినా.తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితో అన్న కి బొట్టు పెట్టి స్వీట్ తినిపించింది అన్న ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది

More news from తెలంగాణ and nearby areas
  • బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు... బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    బాసర రైల్వేస్టేషన్ లో రెచ్చి పోతున్న వానరాలు. చిన్నారిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించిన జనసేన నాయకులు అంబకంటి రాజు...
బాసర లోని రైల్వేస్టేషన్ లో వానరాలు రెచ్చిపోతున్నాయి. గత వారం ఓ ప్రయాణికురాలి చేతిలో నుండి సంచి ఎత్తుకెళ్లి గాయపరచిన ఘటన మరవకముందే  బుధవారం ఉదయం హైదరాబాద్ కు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి చేయిని తీవ్రంగా గాయపరచాయి. జనసేన నాయకుడు అంబకంటి రాజు గమనించి ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయించారు. ప్రాణాలు పోయేవరకు పట్టించుకోరా..? అని ఇప్పటికైనా వానరాల బెడద నుండి కాపాడాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు......
.........

చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
    user_RC REDDY
    RC REDDY
    Local News Reporter Nizamabad Rural, Telangana•
    7 hrs ago
  • *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి *రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది* *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి – పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా - 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ నిజామాబాద్‌, ఆగస్టు 25,2026: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్‌ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్‌ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు. అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్‌ అన్నారు. మార్కెట్‌ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్‌, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్‌ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్‌ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్‌ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ శ్రీ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్‌ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్‌ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ భవేష్‌ మిశ్రా, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా
    3
    *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి 

*రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది*
*-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి 
– పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర 
గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా
- 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ 
నిజామాబాద్‌, ఆగస్టు 25,2026: 
రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర 
గవర్నర్‌ శ్రీ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు.
పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని  గవర్నర్‌  పిలుపునిచ్చారు. 
నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు.
అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్‌ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. 
ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.
పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్‌ పేర్కొన్నారు. భారతదేశ  వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు.
భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్‌ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు.
సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు.
అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్‌ అన్నారు. మార్కెట్‌ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్‌, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్‌ అన్నారు.
రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్‌ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
“అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్‌ ఆకాంక్షించారు. 
ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్‌ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు
రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు
క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, 
జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌ శ్రీ పల్లె గంగారెడ్డి, 
నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా,
ఆర్మూర్‌ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్‌ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ,
నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్రీ భవేష్‌ మిశ్రా, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    1
    ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 
అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం  సంతరించుకుంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • *రేపటి గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి* *ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీఎల్‌ఏ–2లు, కార్యకర్తలదే – డీసీసీ అధ్యక్షులు* *డా. నరేష్ జాదవ్ గారు * రేపు జరగబోయే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, వారు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, రేపు జరగబోయే గ్రామ సభలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. SIR ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని అన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు. అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని డా. నరేష్ జాదవ్ గారు హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. పార్టీ అగ్రనేత, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే కాలంలో గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఖిజార్ పాషా గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతీరామ్ గారు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మంగేష్ దేవతడే గారు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    3
    *రేపటి గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి* 
 *ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ బీఎల్‌ఏ–2లు, కార్యకర్తలదే – డీసీసీ అధ్యక్షులు* *డా. నరేష్ జాదవ్ గారు
* 
రేపు జరగబోయే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, వారు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ–2లు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడంతో పాటు, SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు మాట్లాడుతూ, రేపు జరగబోయే గ్రామ సభలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాలని, ఓటరు జాబితాలో తమ పేరు ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించుకునేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
SIR ప్రక్రియలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తన బాధ్యతను గుర్తించి పనిచేయాలని డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది వంటిదని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా చూడటం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకమైన అంశమని అన్నారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, పేదలు, అణగారిన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
అర్హత కలిగిన ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించుకోవడం, ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలించుకోవడం వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. ఏదైనా కారణంతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడినట్లయితే, సంబంధిత నిబంధనల ప్రకారం వారు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు సమర్పించుకునేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహకరించాలని అన్నారు.
అర్హులైన ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ సహించబోదని డా. నరేష్ జాదవ్ గారు హెచ్చరించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం, సంస్థాగత బలోపేతంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు డా. నరేష్ జాదవ్ గారు తెలిపారు. పార్టీ అగ్రనేత, గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం, ఆయన ఆశయాలను ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సూచించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని డా. నరేష్ జాదవ్ గారు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.
రాబోయే కాలంలో గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు  ఖిజార్ పాషా గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షులు  సయ్యద్ షాహిద్ గారు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు  పరమేశ్వర్ గారు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోతీరామ్ గారు, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగల నర్సింగ్ గారు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు  మంగేష్ దేవతడే గారు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అన్నపూర్ణ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • కొమ్మావార్‌ ట్రేడర్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్‌రెడ్డి బేల ప్రధాన రహదారిపై కొమ్మావార్‌ సంకేత్‌ నూతనంగా ఏర్పాటు చేసిన కొమ్మావార్‌ ట్రేడర్స్‌ను ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ గుండావార్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వామన్‌రావు వాంఖడే, కిసాన్‌ కాంగ్రెస్‌ బేల అధ్యక్షుడు గునశ్యామ్‌, బిక్కి గంగన్న, అలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
    1
    కొమ్మావార్‌ ట్రేడర్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్‌రెడ్డి
బేల ప్రధాన రహదారిపై కొమ్మావార్‌ సంకేత్‌ నూతనంగా ఏర్పాటు చేసిన కొమ్మావార్‌ ట్రేడర్స్‌ను ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభోత్సవానికి హాజరై అభినందించారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ గుండావార్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వామన్‌రావు వాంఖడే, కిసాన్‌ కాంగ్రెస్‌ బేల అధ్యక్షుడు గునశ్యామ్‌, బిక్కి గంగన్న, అలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • Kamaraddy distik banswada me miladun nabi juloos police bhari bandubast,
    1
    Kamaraddy distik banswada me miladun nabi juloos police bhari bandubast,
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • సిరికొండ:చినుకు పడితే చిత్తడే.. కోడూరు హై లెవెల్ బ్రిడ్జి సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    సిరికొండ:చినుకు పడితే చిత్తడే.. కోడూరు హై లెవెల్ బ్రిడ్జి 
సిరికొండ మండలంలోని కోడూరు హై లెవెల్ బ్రిడ్జి వద్ద వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_RC REDDY
    RC REDDY
    Local News Reporter Nizamabad Rural, Telangana•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.