అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావాలి: జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గ్రామస్థాయిలో అభివృద్ధి పనులపై ఎంపీడీవోలతో సమగ్ర సమీక్ష ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడకల గదుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం ఉపాధి హామీ, ఉద్యానవన పంటలపై ప్రత్యేక దృష్టి మహబూబాబాద్, ఆగస్టు 27: గ్రామస్థాయిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు) నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అర్హులైన పేదలకు అందించే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మరియు రెండు పడకల గదుల (2 BHK) ఇండ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక, నిధుల సమస్యలు రాకుండా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు. రెండు పడకల గదుల నిర్మాణం కోసం ఇప్పటికే వివరాలను సమర్పించడం జరిగిందని అట్టి వాటి విచారణ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. వీబీజీ రామ్‌జీ పథకం అమలుతీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.ఫామ్ పాండ్ / పొలం కుంట, నీటి కుంటల నిర్మాణం వల్ల రైతులకు అనేక ఆర్థిక మరియు పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా సహాయపడతాయి. ఈ కుంటల వల్ల చుట్టుపక్కల బావులు, బోరు బావులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. పొలం కుంటలలో చేపలు లేదా రొయ్యల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చు.గట్లపై పంటలు: కుంట గట్ల మీద కూరగాయలు, పండ్ల చెట్లు లేదా పశువుల మేత పెంచవచ్చు.వర్షపు నీరు వేగంగా కొట్టుకుపోకుండా ఆపడం వల్ల విలువైన ఉపరితల సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా ఉంటుంది. ఉద్యానవన శాఖల ద్వారా పొలం కుంటల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సబ్సిడీలను అందిస్తోంది. మీ సమీప మండల వ్యవసాయ అధికారి (AO) లేదా వ్యవసాయ విస్కరణ అధికారి (AEO)ని సంప్రదించి సబ్సిడీ వివరాలు తెలుసుకోవచ్చన్నారు, గ్రామస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛభారత్ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ, వ్యక్తిగత మరియు సమాజిక మరుగుదొడ్ల (టాయిలెట్స్) నిర్మాణం, వినియోగంపై దృష్టి సారించాలన్నారు. ఉద్యానవన పంటల సాగు: వ్యవసాయంతో పాటు పామ్ ఆయిల్, ఇతర కూరగాయలు, ఉద్యానవన (హార్టికల్చర్) పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా పంట మార్పిడి విధానం వైపు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో కొనసాగుతున్న ఇతర పనులను వేగవంతం చేసి, పనుల నాణ్యతలో రాజీ పడకుండా చూడాలని, మండల స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గ్రామ స్థాయి వరకు సభలు నిర్వహించి ఈ పథకం ద్వారా గ్రామ పంచాయతీ భవనాలు, పశు వైద్యశాలలు, తదితర అన్ని ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ త్వరగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్, జెడ్పి సీఈవో క్షేత్రస్థాయిలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో నిత్యం సమీక్షలు సమావేశాలు నిర్వహించి గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టి కొనసాగిస్తున్న అన్ని పథకాలను అర్హులైన ప్రజలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎంపీడీవోలు పంచాయితీ కార్యదర్శుల ద్వారా నిత్యం గ్రామాలలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షలు సమావేశాలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో (ఇన్చార్జి) అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పిడి, జెడ్పి సీఈవో పురుషోత్తం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మధుసూదన రాజు, పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, డిపిఓ రేవంత్, వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యానవన శాఖ అధికారి జి.మరియన్న, వివిధ మండలాల ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..2
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.2
- *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ *వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు* తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు, వారి తరపు బంధువులు ఓ చిన్నారి నడుస్తుండగా సెలైన్ బాటిల్ పట్టుకొని నడుస్తున్న ఆమె తరపు మహిళ స్టాండ్లు లేక సెలైన్ బాటిల్ గోడకు వేలాడదీసిన పరిస్థితి ఫ్యాన్లు లేక ఇంటి దగ్గర నుంచి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్న రోగుల బంధువులు1
- ఎమ్మెల్యే రామచందర్ నాయక్‌పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.1