Shuru
Apke Nagar Ki App…
Gunasekhar Kolavi
More news from Chittoor and nearby areas
- శరణార్థులకు సీనియర్ సిటిజన్ షిప్ ఉందో లేదో తేల్చండి. పలమనేరు డిసెంబర్ 21( ప్రజా ప్రతిభ) చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఉన్న శ్రీలంక శరణార్థులకు భారత్ సీనియర్ సిటిజన్ షిప్ ఉందో లేదో ప్రభుత్వ అధికారులు స్పందించి నిగ్గు తేల్చాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు , హైకోర్టు న్యాయవాది, చింతమాకుల, పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. గత పది రోజుల నుండి గంగవరం మండలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలం వివాద విషయంపై సోషల్ మీడియాలో తెలుసుకున్న వెంటనే ఆయన ఆదివారం మండలంలో ఉన్న అంబేద్కర్ భవనం వద్దకు స్థానిక నాయకులతో చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983---84 సంవత్సరంలో శ్రీలంకలో సివిల్ వార్ జరిగినప్పుడు అక్కడి నుండి కొంత మంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారని అప్పట్లో భారత ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ శరణార్థులను కాపాడాలనే ఉద్దేశంతో ఇంటి స్థలాలు ఉపాధి కల్పన మౌలిక వసతులను కల్పించారని అందులో భాగమే గంగవరం మండల పరిధిలో కొంతమందికి రక్షణ కల్పించారని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్న శరణార్థులు ప్రస్తుతం శ్రీలంకలో వివాహం చేసుకొని ఇక్కడ నివాసముంటున్నారని కొత్తగా చొరబడుతున్న వారు వీసాలు తీసుకున్నారో లేదో ఇంటలిజెన్సీ వారికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి శ్రీలంకు పారిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని నిలదీశారు. శరణార్థులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలాన్ని బహిరంగంగా ఆక్రమిస్తుంటే ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఘాటుగా విమర్శించారు. ఏ కులము తెలియని శరణార్థులు స్థానికంగా ఉన్న దళితులపై దాడి చేస్తూ అవమానిస్తుంటే అలంటివారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయొచ్చని అధికారులకు సూచించారు. అంబేద్కర్ భవనానికి సంబంధించిన రికార్డులు తమ వద్ద లేవని రెవిన్యూ, డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అధికారులు చేతులు దులుపుకోవడం చూస్తుంటే దళితుల విషయంలో అధికారులకు ఎటువంటి అభిప్రాయం ఉందో దీన్నిబట్టి తెలుస్తుందన్నారు. ఈ విషయం పైన సంబంధిత అధికారులు స్పందించి అంబేద్కర్ భావన స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని, దౌర్జన్యానికి వస్తున్న శరణార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ప్రహల్లాద, డి.వి. మునిరత్నం, ఆర్.రెడ్డప్ప, ఎం. శ్రీనివాసులు, టి. రవి. ఓబుల రాజు, రెడ్డి ప్రసాద్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- ANM నర్స్ పై కానిస్టేబుల్ అత్యాయత్నం అన్నమయ్య జిల్లా తంబాలపల్లి లో పనిచేస్తున్న ANM నర్స్ పై పోలీస్ కానిస్టేబుల్ అత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ చేసిన దాడికి ఓ మహిళ చెవిని కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ముక్కోళ్ల రెడ్డప్ప మరియు అతని భార్య సుజాత మధ్య మనస్పర్ధలు రావడంతో PTM పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. న్యాయం చేస్తామని పిలిచిన పోలీస్ స్టేషన్ ముందే కానిస్టేబుల్ సురేంద్ర మర్డర్ అటెమ్ట్ చేయబోయాడు. ఈ నేపథ్యంలో ANM గా పనిచేస్తున్న రెడ్డమ్మకు PTM పోలీస్ స్టేషన్ నుండి పిలుపు రావడంతో తన తల్లిదండ్రులతో పాటు అన్న రెడ్డప్పతో కలిసి పోలీస్ స్టేషన్ కు ఈనెల 18వ తేదీన చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత కుటుంబం మొత్తం బయట మాట్లాడుకొని తర్వాత రండి అని స్థానిక ఎస్ఐ సూచించడంతో, స్టేషన్ ముందుకు రావడంతో కానిస్టేబుల్ సురేంద్ర, ANM రెడ్డమ్మ మీద అత్యాయత్నానికి పాల్పడ్డాడ్డు. రెడ్డమ్మ తప్పించుకొనే ప్రయత్నంలో కానిస్టేబుల్ ఆమె చెవిని రెండుగా కోసేసాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ తన అధికార బలంతో స్థానిక పోలీసులను సైతం లెక్కచేయకుండా మాట్లాడారు. ఈ విషయంపై స్థానిక PTM పోలీసులు సురేంద్ర మీద సంబంధం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి కాపాడే ప్రయత్నం చేశారు. బాధిత మహిళను భయభ్రాంతులతో గురి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ మీడియా ముందు వాపోతున్నది.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- #trending #viral#christmas #santa clause,#night vibes #hello world # buntyyyyy #motivation1
- నేత్రపర్వంగా పల్లకి సేవ దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవను అయ్యప్ప భక్తులు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామంలోని అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తి పాటలతో పరిసరాలు మారుమోగాయి.1
- అక్రమ (పిస్టల్) ఆయుధంతో పట్టుబడిన ఐదుగురు నిందితులు అరెస్టు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి నేరాలను అరికట్టే ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం.. జిల్లా ఎస్పీ శ్రీకాకుళం డిసెంబర్ 21. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్మ్స్ యాక్ట్ కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు చేసి,వారి వద్ద నుండి ఒక పిస్టల్ మరియు ఒక మ్యాగజిన్ శ్రీకాకుళం రూరల్ పోలీసు వారు స్వాధీనం చేసుకున్నట్లు, ఆదివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్., వెల్లడించారు. కేసు వివరాలు:క్రైమ్ నెంబర్: Cr.No. 289/2025 U/Sec. 25, 27 Arms Act – 1959, R/w 109 IPC శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్. కేసు సంక్షిప్త వివరాలు: తేదీ 21.12.2025 న ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో, శ్రీకాకుళం మండలం, తండ్యాంవలస గ్రామం, ఆర్.టి.ఓ కార్యాలయం సమీపంలోని జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటి వద్ద, శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. గారు తమ సిబ్బంది సహాయంతో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా, వారి వద్ద నుండి ఒక పిస్టల్,ఒక మ్యాగజిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు విచారణలో, నిందితులు పంచిరెడ్డి కైలాష్ మరియు గతంలో మరణించిన ఎచ్చెర్ల మండలం సత్తరు గోపి అను వారు నేరాలు చేయాలనే ఉద్దేశంతో, సదరు పిస్టల్‌ను ఒడిశా రాష్ట్రం, బరంపూర్ లో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తి వద్ద నుండి 3 రౌండ్లతో సహా కొనుగోలు చేసినట్లు తెలిపారు.అనంతరం, పంచిరెడ్డి కైలాష్, అలబన మణి, కలగ ఉమా మహేశ్వరరావు మరియు వుర్జాన ప్రశాంత్ కుమార్ లు, సదరు పిస్టల్‌ను తమకు అప్పగించాలని థండాసి కార్తిక్ను కోరగా, కార్తిక్ పిస్టల్ ఇవ్వడం కోసం ఆర్ టి ఓ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి పిస్టల్ అందజేస్తుండగా, పోలీసుల చేతికి పట్టుబడ్డారు.సదరు పిస్టల్‌ను ఎందుకు కొనుగోలు చేశారు, ఏ నేరం చేయడానికి ఉద్దేశించారు, ఇందుకు ఆర్థిక సహాయం ఎవరు అందించారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది అని జిల్లా ఎస్పీ తెలిపారు. అరెస్టు అయిన నిందితుల వివరాలు: 1)పంచిరెడ్డి కైలాష్, S/o సుబ్బారావు, వయస్సు 25 సంవత్సరాలు, వెలమ కులం, బొంతలకొడూరు గ్రామం, ఎచ్చెర్ల మండలం. 2)అలబన మణి, S/o రమణ, వయస్సు 32 సంవత్సరాలు, యాదవ కులం, గుజరాతిపేట, శ్రీకాకుళం పట్టణం. 3)కలగ ఉమా మహేశ్వరరావు, S/o అప్పన్న, వయస్సు 30 సంవత్సరాలు, యాదవ కులం, పెద్దపాడు గ్రామం, శ్రీకాకుళం గ్రామీణ మండలం. 4)వుర్జాన ప్రశాంత్ కుమార్, S/o లేట్ జగ్గునాయుడు, వయస్సు 31 సంవత్సరాలు, పి.కాపు కులం, నారాయణవలస గ్రామం, కోటబొమ్మాళి మండలం. 5) థండాసి కార్తిక్, S/o జగదీశ్వరరావు, వయస్సు 33 సంవత్సరాలు, క్షత్రియ కులం, ఎల్‌బిఎస్ కాలనీ, శ్రీకాకుళం పట్టణం. నిందితులపై ఉన్న పాత కేసుల వివరాలు: పంచిరెడ్డి కైలాష్,(శ్రీకాకుళం 1 టౌన్,ఎచ్చెర్ల పి.ఎస్.) 2) అలబన మణి:(– శ్రీకాకుళం 1 టౌన్ – ఎచ్చెర్ల పి.ఎస్.) 3) కలగ ఉమా మహేశ్వరరావు:(ఎచ్చెర్ల పి.ఎస్.) 4) వుర్జాన ప్రశాంత్ కుమార్: – జె.ఆర్.పురం పి.ఎస్. పరిధిలో పలు కేసులు ఉన్నాయి. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడం ఒక ఎత్తు అయితే,నేరాలను అరికట్టే తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా నిందితులను పట్టుకోవడం జిల్లా పోలీస్ యంత్రాంగం పనితీరు అభినందనీయం అని జిల్లా ఎస్పీ కొనియాడారు. పై ఐదుగురు నిందితులు కూడా ఎచ్చెర్ల మహిళా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీరు పట్టుబడినట్లు, ఇంకాను ఈ కేసును క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి మరి కొంతమందిని అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రతిభకు ప్రశంసలు: పై కేసులో నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకొని,అక్రమంగా కలిగి ఉన్న పిస్టల్ మరియు మ్యాగజిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచినందుకు, శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సి.హెచ్. వివేకానంద సూచనల మేరకు,శ్రీకాకుళం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. పైడుపు నాయుడు గారి పర్యవేక్షణలో పని చేసిన శ్రీకాకుళం రూరల్ ఎస్.ఐ. శ్రీ కె. రాము మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.3
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో భారత దేశం ఇస్లామిక్ దేశం కాకముందే జాగృతం కండి లేదంటే నీ దేశంలో నీకు స్వతంత్రం ఉండదు ఆలోచించండి హిందువులారా1
- భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు1