ఆగస్టు 1 నుండి 'నవోత్సవాలు' జయప్రదం చేయండి: ASP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపు. ప్రతి గూడెంలో ఎగరాలి ఆదివాసీ జెండా-మార్మోగాలీ హక్కులకై నినాదం ఆగస్టు 1 నుండి 9 వరకు గ్రామీణ స్థాయిలో ఆదివాసీ హక్కులపై అవగాహన సదస్సులు. రాజకీయాలకు అతీతంగా 'ప్రపంచ ఆదివాసీ దినోత్సవం' నిర్వహించాలి. ఏటపాక, జూలై 31: ఆగస్టు 9న జరుపుకునే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతి ఆదివాసి గూడెంలో 'నవోత్సవాలు' ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ASP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసులను చైతన్యపరచడానికి, ఆదివాసీ రాజ్యాంగ చట్టాలు మరియు హక్కుల సాధన కోసం ఆదివాసీ సంక్షేమ పరిషత్ గడచిన 11 సంవత్సరాలుగా ఆగస్టు 1 నుండి 9 వరకు ఈ 'నవోత్సవాలు' నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి (UN) ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుర్తించడానికి గల కారణాలను, ఆదివాసుల అస్తిత్వం మరియు ఉనికి ఎలా ప్రమాదంలో పడుతోందో గ్రామాల్లోని ప్రతి ఒక్కరికీ వివరించడం ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి థీమ్."ఆదివాసీ మంత్రసానులకు గౌరవం" ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి (UN) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కోసం "ఆదివాసీ మంత్రసానులను/సాంప్రదాయ వైద్యులను గౌరవించడం: జీవనం మరియు శ్రేయస్సుకు రక్షణ" అనే ప్రత్యేక అంశాన్ని ఎంచుకుందని తెలిపారు. తరతరాలుగా మన గూడెంలలో సాంప్రదాయ వైద్యం అందిస్తూ, గర్భవతులకు, బాలింతలకు సేవలందిస్తూ ఆదివాసీ తరాల మనుగడను కాపాడుతున్న మన మంత్రసానుల సేవలను మరియు ఆదివాసీ సాంప్రదాయ జ్ఞానాన్ని ఈ నవోత్సవాల సందర్భంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. **హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు:* రాజకీయాలకు అతీతంగా ప్రతి ఆదివాసీ గూడెంలో ఆదివాసీ జెండా ఎగురవేసి, ఈ కార్యక్రమాలను పండుగలా నిర్వహించాలని కుంజా శ్రీను కోరారు. చట్టాల పరిరక్షణ, హక్కుల సాధనకై ఆదివాసీ ఉద్యమాలను బలోపేతం చేయడంతో పాటు ఆదివాసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఉన్నతంగా ఎదగాలనే చైతన్యాన్ని ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి గూడెంలో కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పోడియం అశోక్ కుమార్, సొందే ఎడమయ్య, రాజు, పోడియం వెంకటేశ్వర్లు, తెల్లం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

- భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...1
- కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢 కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢1
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- 54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్ వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది1
- భద్రాచలం రామాలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడి స్థానాలవాటిక వద్దకు చేరుకున్న గోదావరి వరద నీరు భద్రాచలం లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు1