కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు: పుట్ట మధూకర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు మూడేళ్లుగా చేస్తున్న ఆరోపణలు, విమర్శల వెనుక కుట్రలు ఉన్నాయని తేలిపోయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సెంట్రల్ రీసెర్చ్ సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందాల నివేదికలు కాంగ్రెస్ ఆరోపణలను పటాపంచలు చేశాయని ఆయన పేర్కొన్నారు. మంథని మండలం సిరిపురం గ్రామంలోని సుందిళ్ల బ్యారేజీ వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బుధవారం పుట్ట మధూకర్, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. ప్రాజెక్టును నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత దానిని నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని పుట్ట మధూకర్ ఆరోపించారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దీనిపై ప్రశ్నించకుండా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ఉండిపోయారని విమర్శించారు. చెక్‌డ్యాంలు, బ్రిడ్జిలపై విమర్శలు తండ్రి, కొడుకులు మంథని నియోజకవర్గాన్ని ఎన్నో ఏళ్లుగా పాలించినప్పటికీ ఒక్క చెక్‌డ్యాం, ఒక్క బ్రిడ్జి కూడా నిర్మించలేదని పుట్ట మధూకర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బొక్కలవాగుపై చెక్‌డ్యాంలు, గోదావరిపై బ్రిడ్జిలు నిర్మించామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన సమయంలో మత్స్య సంపద పెరిగిందని, భూగర్భ జలాలు పెరగడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. సుందిళ్ల బ్యారేజీలో నీటిని నిల్వ చేయకపోవడం వల్ల మత్స్యకారులు, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మత్స్య సంపద పెరగడంతో గతంలో దుబాయ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన బెస్తపల్లి గ్రామస్తులు తిరిగి స్వగ్రామాలకు వచ్చారని పుట్ట మధూకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకపోవడంతో ఉపాధి లేక ప్రజలు మళ్లీ వలసబాట పడుతున్నారని ఆరోపించారు. సుందిళ్ల బ్యారేజీ విషయంలో నిపుణుల సంస్థలు, ఎన్‌డీఎస్‌ఏ బృందం సూచనలు చేసినప్పటికీ నీటిని నిల్వ చేయకుండా ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలపై మమకారం పెరగలేదని పుట్ట మధూకర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఢిల్లీకి మూటలు మోసుకెళ్లడంపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్యారేజీల గేట్లు మూసి నీటిని నిల్వ చేయాలని, లేదంటే ప్రజలే నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి వస్తుందని పుట్ట మధూకర్ హెచ్చరించారు.

- సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు1
- గోవిందరావుపేటలో వాన దేవుని కరుణ కోసం కప్పతల్లి ఆట..... MLG:అడపా దడపా కురుస్తున్న వర్షాలు వ్యవసాయానికి భరోసా ఇవ్వట్లేదు. లక్నవరం చెరువులో ఉన్న నీరు ఈ సీజను సరిపోయేలా లేదు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో 80%వరి సాగుపై ఆధారపడ్డ గోవిందరావుపేట మండల రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసుకున్న అన్నదాతలు పైరుకు తడికోసం తండ్లాడుతున్నారు. ఈ క్రమంలో మండలకేంద్రంలో రైతులు కప్పతల్లి ఆట ఆడారు. వానలు కురిపించాలని దైవాలను వేడుకున్నారు.1
- పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం - 4 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు - వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి 3 కోట్ల 11 లక్షల రూపాయలు - పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం తాడ్వాయి,ఏటూరునాగారం మండలాల్లో 4 కోట్ల 46 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.తాడ్వాయి వ్యవసాయ మార్కెట్ యార్డులో 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం సీఆర్‌ఆర్–ప్లెయిన్ 2025–26 నిధులతో ఏటూరునాగారం మండలం శివాపూర్ గ్రామంలో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. శివాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోగుపల్లిలో 55 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ నిధులు 2 కోట్ల 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ..మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. రహదారులు, మురుగునీటి కాలువల నిర్మాణంతోపాటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ రఘు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఓనం వేడుకల్లో ఘనంగా అయ్యప్ప స్వామికి మహా పడిపూజ కార్యక్రమం MLG: గోవిందరావుపేటలోని శ్రీ హరిహర అయ్యప్ప స్వామి క్షేత్రంలో బుధవారం ఓనం పండుగ సందర్భంగా స్వామివారికి శుభయాత్ర, కోనేరులో చక్రస్నానం, అభిషేకం, మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యుల ఆధ్వర్యంలో ధూపాటి సమ్మక్క–అంతయ్య కుటుంబ సభ్యులు కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ పీఎంకే గాంధీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటన. ములుగు జిల్లా లోని పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. మల్లంపల్లి మండల కేంద్రంలో శివం గార్డెన్ లో నత్తి మొగిలి కూతురు వివాహానికి మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని పలు శుభకార్యాలకు పెళ్లిళ్లు కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ఏటూరునాగారం చేరుకొని ఏటూరునాగారం మండల కేంద్రంలో Y జంక్షన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిచారు ఏటూరునాగారం మండలంలో శివపురం గ్రామంలో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభోత్సవం అదేవిధంగా గోగుపల్లి గ్రామంలో కూడా నూతన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేసారు.. ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్...రైతులు ఆరు కాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని నిలువ చేసుకోవడం కోసం ఏర్పాటుచేసిన మార్కెట్ కమిటీ గోడౌన్స్ కు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది...కావున ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంగపేట మండలం కమలాపూర్ గ్రామంలో ప్రైవేటు కార్యక్రమం లో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆసరా పింఛన్లు స్వయంగా మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా వారికి అందజేయనున్నారు. మల్లూరు- మామిడిగూడెం లో నూతనంగా నిర్మాణం చేసిన పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.4
- సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట కోదాడ రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దొరకుంట వద్ద బుధవారం ఉదయం కంటైనర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. అయితే మృతులంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా తెలుస్తోంది. మృతులు యాసారపు చిన్ని(32), బొల్లిపొంగు మేరీ జోష్న(29), చెన్నకేశవుల నాగేంద్రబాబు(21)గా గుర్తించారు. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.1
- హైదరాబాద్- విజయవాడ హైవేపై బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి తెలంగాణ : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1