Shuru
Apke Nagar Ki App…
అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అందజేశారు తల్లాడ మండలం అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, వారి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, ఉపాధ్యాయులు ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ARUNKUMAR
అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అందజేశారు తల్లాడ మండలం అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని, వారి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, ఉపాధ్యాయులు ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.1
- ఖమ్మం జిల్లా: తిరుమలపురంలో గణపయ్య సన్నిధిలో భరతనాట్య ప్రదర్శన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలపురం గ్రామం లో గణేష్ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. 'టీమ్ ఇంట్రో విఘ్నేష్' కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామపెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయక మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆధ్యాత్మికతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.1
- ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.1
- హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.టైటిల్: 🚨 హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు హయత్‌నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- కుక్కల బెడద.. ప్రయాణికులకు ఇబ్బందులు.................... నడిగూడెం మండలంలోని గ్రామాల్లోనే కాకుండా గ్రామ శివారులోనూ వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ మాటు వేసి నడిగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవతో అందరి హృదయాలను గెలుచుకున్న డా. రవి బాదావత్ పదవి కోసం కాదు.. ప్రజల కోసం సేవే లక్ష్యం సేవా స్ఫూర్తిని చూసి అభినందించిన మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం: మారుమూల గిరిజన గూడెంలో పుట్టినప్పటికీ.. తన ఆలోచనలతో, సేవా కార్యక్రమాలతో వేలాది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా స్ఫూర్తి డా. రవి బాదావత్. పుట్టింది గిరిజన ప్రాంతంలో కావచ్చు.. కానీ సమాజం పట్ల ఆయనకున్న ఆలోచనలు, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ఎంతో విశాలమైనవి. పదవులు, హోదాల కోసం కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడమే నిజమైన నాయకత్వమనే నమ్మకంతో డా. రవి బాదావత్ ముందుకు సాగుతున్నారు. తనకు సాధ్యమైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి తోడుగా నిలుస్తూ.. సేవను ఒక బాధ్యతగా భావించి ముందుకు సాగుతున్న ఆయనను పలువురు అభినందిస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచి ఎదిగి సేవా మార్గంలో సాగుతూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. డా. రవి బాదావత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆయన సేవా స్ఫూర్తిని అభినందించడం విశేషంగా నిలిచింది. ఒక నాయకుడు స్వయంగా ఒక సేవా కార్యకర్తను అభినందించే స్థాయికి ఎదగడం.. ఆయన చేస్తున్న సేవకు లభించిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. సేవే ఆయనకు బలం.. ప్రజలే ఆయన కుటుంబం మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన ఈ ఆణిముత్యం.. తన సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన చేస్తున్న కృషి యువతకు సైతం ఆదర్శంగా నిలుస్తోంది. “పదవి కోసం చేసే పని తాత్కాలికం.. ప్రజల కోసం చేసే సేవ మాత్రం చిరస్థాయిగా నిలుస్తుంది” అనే ఆలోచనతో డా. రవి బాదావత్ సాగిస్తున్న సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. గిరిజన గూడెంలో పుట్టిన ఆణిముత్యం.. సేవా మార్గంలో సాగుతున్న సేవా సైనికుడు డా. రవి బాదావత్ అని పలువురు కొనియాడుతున్నారు.1
- పల్లెగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సీపీఐ.ఎం.ఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో త్రీఫేస్ కరెంట్ రైతులకు గంటలు ఇవ్వాలని ఆందోళన ఖమ్మం జిల్లా రూరల్ మండలం పల్లెగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సీపీఐ.ఎం.ఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో త్రీఫేస్ కరెంట్ రైతులకు గంటలు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మాస్ లైన్ పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య మాట్లాడుతూ అసలే వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు.బోర్లు, బావుల కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు కరెంటు కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు కరెంట్ మీటర్లు పెట్టే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వర్షాభావ ప్రవాహం వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు కోతలు లేని విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు1