Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం పట్టణంలో క్రీడా మైదానంలో ఎండిపోతున్న వృక్షాలు కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం చుట్టూ ఉన్న వృక్ష సంపద భూగర్భజలాలు, వర్షాలు లేక ఎండిపోతున్నాయి. మైదానంలో నిత్యం వాకింగ్ చేసే సీనియర్ సిటిజెన్లు, క్రీడాకారులు, విద్యార్థులు చెట్లు ఇచ్చే చల్లటి గాలిలో సేదతీరేవారు. ఎండిపోతున్న వృక్ష సంపదను సంబంధిత శాఖాధికారులు ట్యాంకర్లతో నీరు పోసి వృక్ష సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Merzaa Tv
కళ్యాణదుర్గం పట్టణంలో క్రీడా మైదానంలో ఎండిపోతున్న వృక్షాలు కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం చుట్టూ ఉన్న వృక్ష సంపద భూగర్భజలాలు, వర్షాలు లేక ఎండిపోతున్నాయి. మైదానంలో నిత్యం వాకింగ్ చేసే సీనియర్ సిటిజెన్లు, క్రీడాకారులు, విద్యార్థులు చెట్లు ఇచ్చే చల్లటి గాలిలో సేదతీరేవారు. ఎండిపోతున్న వృక్ష సంపదను సంబంధిత శాఖాధికారులు ట్యాంకర్లతో నీరు పోసి వృక్ష సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామంలో చిరుత సంచారం కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముదిగల్లు శివారులోని కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గ్రామ శివారులోని కొండ గుట్టలో చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్పారు. చిరుతల సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతల నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు.1
- రాయదుర్గంలో అందర్నీ ఆకట్టుకున్న స్కూలుకు వెళ్తున్న గణనాథుడి ప్రతిమ రాయదుర్గం పట్టణంలో నిన్నటి దినం వివిధ ఆకృతులలో గణనాథులు కొలువు తీరాయి. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ సమీపాన వరసిద్ధి వినాయక గ్రూప్ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాథుడు అందరినీ ఆకట్టుకున్నాడు. వీపుకి బ్యాగు తగిలించుకొని, యూనిఫామ్ దుస్తులు ధరించి చేతిలో వాటర్ బాటిల్ ధరించిన గణనాథుడు అందరిని ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా ఏదో ఒక ప్రత్యేక విధానంలో గణనాథులను వరసిద్ధి వినాయక సంఘం సభ్యులు గణనాధులను కొలువు తీరుస్తున్నారు.1
- గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గణేశులను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్న గుమ్మనూరు నారాయణ, కమలమ్మ గుంతకల్లు, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహాలను ఆలూరు నియోజకవర్గ బీజేపీ బీఎల్‌ఓ-1 గుమ్మనూరు నారాయణ, గుమ్మనూరు కమలమ్మ మంగళవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రదీప్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఏర్పాటు చేసిన గణేశ మండపాన్ని సందర్శించిన గుమ్మనూరు నారాయణ, కమలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతి ఇచ్చారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రదీప్ ఏర్పాటు చేసిన గణేశ విగ్రహానికి గుమ్మనూరు నారాయణ రూ.50,000 విరాళాన్ని అందజేశారు. మరో గణేశ విగ్రహం నిర్వాహకులకు రూ.5,000 విరాళం అందించారు. వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు పట్టణ యువత, గుమ్మనూరు నారాయణ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.1
- పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....1
- ప్రత్యేకంగా రెండవ రోజు గణనాథునికి మంగళహారతులు ఇస్తున్న మహిళా మణులు ( కోడుమూరు శురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కోటకొండ సురేష్ ఇంటి సమీపంలో రెండవ రోజున గణనాథుని ప్రత్యేకంగా మహిళా మణులు మంగళ హారతులు ఇచ్చి గణనాథుని అనుగ్రహం ప్రసాదించాలని భక్తుల కోరిక.సంపూర్ణంగా వర్షాలు కురవాలని అందుకే ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మహిళా మణులు శురు న్యూస్ తో తెలిపారువారు.1
- వేపచీరల తో మొక్కులు తీర్చుకున్న భక్తులు..ఘనంగా ప్రారంభం అయిన వేడుకలు రాయదుర్గం పట్టణం మధు సినిమా థియేటర్ సమీపాన వెలసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు వైభవంగా ప్రారంభం అయ్యాయి.ఉదయం నాలుగు గంటల నుండే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు.వేపాచీరలతో భక్తులు పెద్ద ఎత్తున వారి వారి మొక్కులను తీర్చుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చింది.1
- పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.1