బిడ్డ సంపూర్ణ మానసిక వికాసం తల్లిపాల తోనే సాధ్య-డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ తల్లి ప్రసవించిన అర్ధ గంటలోపు పసుపు పచ్చని రంగులోని చిక్కటి ముర్రుపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటివని పి.హెచ్.సి తలుపుల ప్రదానవైద్యాధికారులు డా:శ్రీగిరీష మరియు డా:చంద్రశేఖర్ నాయక్ సంయుక్తంగా తెలిపారు. తల్లిపాలు వారోత్సావాల్లో బాగంగా తొలిరోజు బండ్లవంక లో నిర్వహించిన కార్యక్రమంలో పాలిచ్చు తల్లులకు,గర్భిణిస్త్రీలకు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను గూర్చి వివరించారు.తల్లి పాలు బిడ్డ శరీరానికే కాకుండా తన మెదడుకు కూడా పోషణను ఇస్తుందని,తల్లి బిడ్డకు అనేక ప్రయోజనాలు చేకూరే తల్లిపాలు, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారం అని, ఇవి శిశువును నిమోనియా, అతిసారా వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడే యాంటీబయాటిక్ లాగా సహకరిస్తాయని, తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుందని,కావున తల్లి పాలకు లేదు ప్రత్యామ్నాయం ప్రతి బిడ్డకు తల్లి పాలు అందేలా చేయడం మన సంకల్పమని అధికారులు తల్లులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య, పిహెచ్ఎన్. కుసుమ, పర్యవేక్షకులు నాగమ్మ, ఏఎన్ఎం భార్గవి, లక్ష్మి, సిహెచ్ఓ చంద్రకళ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- తాడేపల్లి వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేద్దాం : శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయీ బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ యాదవ్ గారు, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సిద్దవటం యానాదయ్య గారు, వైఎస్సార్సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడు పి.పుల్లయ్య గారు, నాయీ బ్రాహ్మణ విభాగం నాయకులు నూకరాజు గారు, కనకారావు గారు, శ్రీనివాసులు గారు, కోటేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు గారు, ధనవిజయుడు గారు తదితరులు పాల్గొన్నారు. - నాయీ బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే - కులానికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం చరిత్రలో మొదటిసారి - ఆలయ పాలకమండళ్లలో చోటు, ఆలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు - రూ. 20 వేల జీతాన్ని ఖరారు చేసి నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత - 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఏఎంసీ చైర్మన్లుగా అవకాశం - కరోనాలో ఒక్క బటన్‌తో రూ. 50 కోట్లు నిధులు విడుదల - వైఎస్ జగన్ గారి మేలును ఎప్పటికీ మరిచిపోలేం - మళ్లీ జగన్‌ని సీఎం చేసుకునేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం - అక్రమ కేసులతో వేధిస్తున్న వెన్నుపోటు కూటమికి బుద్ధి చెబుతాం : సమావేశంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకుల ప్రతిజ్ఞ వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి - పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయి నాయకులతో కేంద్ర కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ కంప్యూటరీకరణ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయీ బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10వేల మంది ఉన్నారని స్పష్టమైన డేటా మన వద్ద ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రధాన విభాగాలు, కమిటీల కీలక స్థానాల్లో 10వేల మంది నాయీ బ్రాహ్మణులు ఉండటం మనం గర్వించదగిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 13 నుండి 14 లక్షల మంది నాయకత్వం వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో ఉంది. మన పార్టీ నిర్మాణంలోనూ, వ్యవస్థలోనూ బీసీలు అత్యధికంగా 60 శాతానికి పైగా ఉన్నారు. జగన్ గారి నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, దళితులు తమ జనాభా ప్రాతిపదికన పార్టీలోనూ, పాలనలోనూ తగిన ప్రాధాన్యత పొందారు. గతంలో మాదిరిగా ప్రతి చిన్న దానికి రోడ్లపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా, మన అభిప్రాయాలను నేరుగా లీడర్‌షిప్ దృష్టికి తెచ్చేలా కమ్యూనికేషన్ పెంచాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలు, మోసపు హామీలను తిప్పికొట్టడానికి మీరు, మీ పిల్లలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైతన్యపరచాలి. జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో 15–20 ఏళ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అందించి చూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అబద్ధాలతో ఘోరమైన పరిస్థితి తెచ్చింది. వెన్నుపోటు కూటమి నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిన్న ముస్తఫా కొడుకుపై కిడ్నాప్ కేసు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిపై అక్రమ కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వెన్నుపోటు కూటమి వైఖరిని మీరు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి. రైతులకు ఉచిత విద్యుత్, బీమా సౌకర్యం అందించిన జగన్ గారి వైఖరి ఒకటైతే, చంద్రబాబు రైతులకు బీమా లేకుండా మోసం చేశారు. మీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబంలోకి జగన్ గారి సందేశాన్ని, ఆయన అందించిన సంక్షేమాన్ని నేరుగా తీసుకెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. చంద్రబాబు, వెన్నుపోటు కూటమి పార్టీల వెనుక ఉన్న అసత్య ప్రచారాలను శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి పనితీరును, వారి డేటాను కేంద్ర కార్యాలయం ద్వారా ఏఐ టెక్నాలజీతోనూ పరిశీలిస్తున్నాం. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయని హామీ ఇస్తున్నాను. తాడేపల్లి వెన్నుపోటు కూటమి కుట్రలను భూస్థాపితం చేద్దాం : శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయీ బ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ యాదవ్ గారు, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సిద్దవటం యానాదయ్య గారు, వైఎస్సార్సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడు పి.పుల్లయ్య గారు, నాయీ బ్రాహ్మణ విభాగం నాయకులు నూకరాజు గారు, కనకారావు గారు, శ్రీనివాసులు గారు, కోటేశ్వరరావు గారు, మల్లేశ్వరరావు గారు, ధనవిజయుడు గారు తదితరులు పాల్గొన్నారు. - నాయీ బ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే - కులానికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం చరిత్రలో మొదటిసారి - ఆలయ పాలకమండళ్లలో చోటు, ఆలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు - రూ. 20 వేల జీతాన్ని ఖరారు చేసి నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ భద్రత - 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఏఎంసీ చైర్మన్లుగా అవకాశం - కరోనాలో ఒక్క బటన్‌తో రూ. 50 కోట్లు నిధులు విడుదల - వైఎస్ జగన్ గారి మేలును ఎప్పటికీ మరిచిపోలేం - మళ్లీ జగన్‌ని సీఎం చేసుకునేదాకా కలిసికట్టుగా పనిచేద్దాం - అక్రమ కేసులతో వేధిస్తున్న వెన్నుపోటు కూటమికి బుద్ధి చెబుతాం : సమావేశంలో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకుల ప్రతిజ్ఞ వెన్నుపోటు కూటమి అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి - పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయి నాయకులతో కేంద్ర కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ కంప్యూటరీకరణ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయీ బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10వేల మంది ఉన్నారని స్పష్టమైన డేటా మన వద్ద ఉంది. వైఎస్సార్‌సీపీ ప్రధాన విభాగాలు, కమిటీల కీలక స్థానాల్లో 10వేల మంది నాయీ బ్రాహ్మణులు ఉండటం మనం గర్వించదగిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 13 నుండి 14 లక్షల మంది నాయకత్వం వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో ఉంది. మన పార్టీ నిర్మాణంలోనూ, వ్యవస్థలోనూ బీసీలు అత్యధికంగా 60 శాతానికి పైగా ఉన్నారు. జగన్ గారి నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, దళితులు తమ జనాభా ప్రాతిపదికన పార్టీలోనూ, పాలనలోనూ తగిన ప్రాధాన్యత పొందారు. గతంలో మాదిరిగా ప్రతి చిన్న దానికి రోడ్లపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా, మన అభిప్రాయాలను నేరుగా లీడర్‌షిప్ దృష్టికి తెచ్చేలా కమ్యూనికేషన్ పెంచాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలు, మోసపు హామీలను తిప్పికొట్టడానికి మీరు, మీ పిల్లలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైతన్యపరచాలి. జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో 15–20 ఏళ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అందించి చూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అబద్ధాలతో ఘోరమైన పరిస్థితి తెచ్చింది. వెన్నుపోటు కూటమి నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిన్న ముస్తఫా కొడుకుపై కిడ్నాప్ కేసు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిపై అక్రమ కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వెన్నుపోటు కూటమి వైఖరిని మీరు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి. రైతులకు ఉచిత విద్యుత్, బీమా సౌకర్యం అందించిన జగన్ గారి వైఖరి ఒకటైతే, చంద్రబాబు రైతులకు బీమా లేకుండా మోసం చేశారు. మీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబంలోకి జగన్ గారి సందేశాన్ని, ఆయన అందించిన సంక్షేమాన్ని నేరుగా తీసుకెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. చంద్రబాబు, వెన్నుపోటు కూటమి పార్టీల వెనుక ఉన్న అసత్య ప్రచారాలను శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి పనితీరును, వారి డేటాను కేంద్ర కార్యాలయం ద్వారా ఏఐ టెక్నాలజీతోనూ పరిశీలిస్తున్నాం. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయని హామీ ఇస్తున్నాను.1
- ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జివర్యులు గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం 10 వార్డు లో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఇబ్రాహీం మరియు జనరల్ సెక్రటరీ నాసిర్ బాషా, పాల్గొని, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది,2
- మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆశ కార్యకర్తలు ధర్నా... అన్నమయ్య జిల్లా. మదనపల్లి తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు మదనపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు తమకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేల చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న తమకు గ్రాట్యూటీ, పింఛన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ఉద్యోగ భద్రతా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తాము అందుకుంటున్న పారితోషికంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని వారు పేర్కొన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ధర్నా నేపథ్యంలో కలెక్టరేట్ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.1
- విశేష అలంకారం లో ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి. పుంగనూరు బస్టాండ్ కు సమీపాన వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శనివారం నాడు ఉదయత్పూర్వమే పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో అభిషేకము గావించి,ఫల పుష్పాలను సమర్పించి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణ చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఆపై ఆలయ అర్చకులు అమ్మవారి తీర్ధప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1