కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం _సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం అంచనా _ఘటనపై పోలీసులకు ఫిర్యాదు – దర్యాప్తు ప్రారంభం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం _సుమారు రూ.8 లక్షల ఆస్తి నష్టం అంచనా _ఘటనపై పోలీసులకు ఫిర్యాదు – దర్యాప్తు ప్రారంభం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలో సౌత్ కమలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో అనుమానాస్పద స్థితిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌తో పాటు పలు ముఖ్యమైన రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో భవనానికి పగుళ్లు ఏర్పడినట్లు సమాచారం.అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు ముందుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అసోసియేషన్ సభ్యుల వివరాల ప్రకారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నామని, అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానం లేదని వారు పేర్కొన్నారు.ఇటీవల అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో ఈ ఘటన అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- సామాజిక న్యాయ సాధన వారోత్సవాల్లో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.1
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్స్ మన్సూర్, తొడుపునూరి రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.1
- పత్రిక ప్రకటన తేది :14.04.2026 కామారెడ్డి జిల్లా, మంగళవారం ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవియఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు నిరంతర రక్తదానం ఎంతో అవసరమని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన దాతలకు కలెక్టర్ స్వయంగా సర్టిఫికెట్‌లు హెల్మెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్,ఐవియఫ్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు1
- More details to buy Watsup 8374614046 👆👆👆👆👆👆👆5
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3