_*//గుంటూరు జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసి, చట్టపరమైన గడువులోపు (60/90 రోజుల్లో) చార్జ్ షీట్లు న్యాయస్థానంలో దాఖలు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు జిల్లా పోలీసు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వారా ఆదేశాలు జారీ చేశారు,.//*_ 🚩 ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్యాప్తులు పెండింగులో ఉన్న ఆయా కేసుల పురోగతిని గురించి గౌరవ sp గారు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 📍విచారణలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సంబంధిత SDPOలు / డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CIలు), స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOలు) మరియు విచారణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 👉 ఎస్పీ గారి ముఖ్య ఆదేశాలు * 60 మరియు 90 రోజుల విచారణలో ఉన్న కేసులను SDPOలు / * డిఎస్పీలు సమగ్రంగా పర్యవేక్షించాలి. * గుర్తుతెలియని నేరస్థుల కేసులను తగ్గించుటకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. * 60 మరియు 90 రోజులు దాటిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే అభియోగ పత్రాలు (Charge Sheets) న్యాయస్థానంలో దాఖలు చేయాలి. * గడువు సమీపిస్తున్న కేసులపై రోజువారీ సమీక్ష నిర్వహించాలి. * సాక్ష్యాధారాల సేకరణను వేగవంతం చేసి, ఫోరెన్సిక్ నివేదికలు మరియు మెడికల్ రిపోర్టులు సమయానికి పొందాలి. * నమోదైన అన్ని కేసులలో (పాత కేసులు సహా) ఈ-సాక్ష్య గుర్తింపు సంఖ్యలు సృష్టించాలి. *👉 ఆస్తి నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు:* * ముఖ్య కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. * దాతలు, దుకాణ యజమానులు మరియు ప్రముఖులను ప్రోత్సహించి మారుమూల ప్రాంతాలలో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. * కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేసి, స్థానిక స్వచ్ఛంద సేవకులు మరియు సామాజిక కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచాలి. * నేర ప్రభావిత ప్రాంతాలలో రాత్రి బీట్లు మరింతగా బలోపేతం చేయాలి. * రాబోయే లోక్ అదాలత్ కేసులపై దృష్టి సారించి ఎక్కువ గుర్తుతెలియని కేసులను పరిష్కరించాలి. * అన్ని రౌడీ షీటర్లపై బౌండ్ ఓవర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. 👉 చట్టంలో నిర్దేశించిన గడువులోపు చార్జ్ షీట్లు దాఖలు చేయడం ద్వారా నిందితులకు బెయిల్ లభించే అవకాశాలను తగ్గించవచ్చని, అలాగే బాధితులకు వేగవంతమైన న్యాయం అందించవచ్చని ఎస్పీ గారు తెలిపారు. 👉జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. — గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం.
_*//గుంటూరు జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసి, చట్టపరమైన గడువులోపు (60/90 రోజుల్లో) చార్జ్ షీట్లు న్యాయస్థానంలో దాఖలు చేయాలని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారు జిల్లా పోలీసు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ద్వారా ఆదేశాలు జారీ చేశారు,.//*_ 🚩 ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్యాప్తులు పెండింగులో ఉన్న ఆయా కేసుల పురోగతిని గురించి గౌరవ sp గారు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 📍విచారణలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సంబంధిత SDPOలు / డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CIలు), స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOలు) మరియు విచారణ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 👉 ఎస్పీ గారి ముఖ్య ఆదేశాలు * 60 మరియు 90 రోజుల విచారణలో ఉన్న కేసులను SDPOలు / * డిఎస్పీలు సమగ్రంగా పర్యవేక్షించాలి. * గుర్తుతెలియని నేరస్థుల కేసులను తగ్గించుటకు ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. * 60 మరియు 90 రోజులు దాటిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే అభియోగ పత్రాలు (Charge Sheets) న్యాయస్థానంలో
దాఖలు చేయాలి. * గడువు సమీపిస్తున్న కేసులపై రోజువారీ సమీక్ష నిర్వహించాలి. * సాక్ష్యాధారాల సేకరణను వేగవంతం చేసి, ఫోరెన్సిక్ నివేదికలు మరియు మెడికల్ రిపోర్టులు సమయానికి పొందాలి. * నమోదైన అన్ని కేసులలో (పాత కేసులు సహా) ఈ-సాక్ష్య గుర్తింపు సంఖ్యలు సృష్టించాలి. *👉 ఆస్తి నేరాల నివారణకు ప్రత్యేక చర్యలు:* * ముఖ్య కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. * దాతలు, దుకాణ యజమానులు మరియు ప్రముఖులను ప్రోత్సహించి మారుమూల ప్రాంతాలలో కూడా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాలి. * కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేసి, స్థానిక స్వచ్ఛంద సేవకులు మరియు సామాజిక కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచాలి. * నేర ప్రభావిత ప్రాంతాలలో రాత్రి బీట్లు మరింతగా బలోపేతం చేయాలి. * రాబోయే లోక్ అదాలత్ కేసులపై దృష్టి సారించి ఎక్కువ గుర్తుతెలియని కేసులను పరిష్కరించాలి. * అన్ని రౌడీ షీటర్లపై బౌండ్ ఓవర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. 👉 చట్టంలో నిర్దేశించిన గడువులోపు చార్జ్ షీట్లు దాఖలు చేయడం ద్వారా నిందితులకు బెయిల్ లభించే అవకాశాలను తగ్గించవచ్చని, అలాగే బాధితులకు వేగవంతమైన న్యాయం అందించవచ్చని ఎస్పీ గారు తెలిపారు. 👉జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. — గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం.
- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.1