సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంతవరకు మా మద్దతు* *- బీసీ ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్... సూర్యాపేట సిటీ:: సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంతవరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని బీసీ ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించాలనే డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని సూర్యాపేట మీదుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వస్తే జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వ్యాపార, పారిశ్రామిక, విద్యా రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు చేపడుతున్న ఉద్యమానికి బీసీ సంఘం తరఫున అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా వచ్చేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంతవరకు ఉద్యమానికి తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సైతం బుల్లెట్ ట్రైన్ కోసం జరుగుతున్న నిరాహార దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని జానయ్య యాదవ్ కోరారు. అయితే సూర్యాపేట ప్రజల ప్రధాన సమస్యగా ఉన్న ఈ అంశంపై ఆయనకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్ష కోసం జరుగుతున్న ఉద్యమంలో ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పాల్గొని తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంభం నాగరాజు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.4
- చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..1
- రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు1
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.1