logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పతాక శీర్షిక న్యూస్ - *అవినీతి రహిత, పారదర్శకమైన సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ పతాక శీర్షిక న్యూస్ - *అవినీతి రహిత, పారదర్శకమైన సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం: దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ వెల్లడి..* - *లంచాలు అడిగినా, అక్రమాలకు ఎవరైనా పాల్పడిన సహించేది లేదు.. అవినీతి అధికారులపై ఉక్కుపాదం తప్పదు: స్పష్టం చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్..* - *అవినీతి, అక్రమాల గొడ్డలి పార్టీ ప్రభుత్వం పోయి రెండేళ్లు అవుతున్న కొందరు అధికారులు సిబ్బందిలో మాత్రం ఇంకా ఆ జాడలు పోవటం లేదు - అలాంటి వారు వ్యవస్థకు చెద పురుగులు మాదిరి - అటువంటి అధికారులు సిబ్బందిపై ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించాం - ఇకపై తీరు మారకపోతే ఉపేక్షించం..* - *అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా గ్రామసభల్లోనే 'రాజముద్ర' పాస్ పుస్తకాల పంపిణీ* - *"ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సమావేశాలు" కార్యక్రమంతో క్షేత్రస్థాయిలోనే సమస్యల పరిష్కారం.* - *క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాడు సైతం నిత్య ప్రజా దర్బార్.* -------- *దుగ్గిరాల (క్యాంపు కార్యాలయం), మే 31:* ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారూ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా, సామాన్య ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందించడమే తమ ప్రధాన ధ్యేయమని దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. ఆదివారం దుగ్గిరాలలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 'నిత్య ప్రజా దర్బార్' లో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలపై ఎమ్మెల్యే గారు ప్రజలకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. *ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి - గ్రామసభల్లోనే పట్టాలు:* ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ.. "గత ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే భూముల రీ-సర్వేలను పకడ్బందీగా నిర్వహించి రైతులకు పూర్తి భరోసా కల్పించిందన్నారు." గతంలో పాస్ పుస్తకాల కోసం రైతులు, సామాన్యులు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా నేరుగా గ్రామాల్లోనే బహిరంగ గ్రామసభలు నిర్వహిస్తూ 'రాజముద్ర' కలిగిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు. *ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సమావేశాలు:* ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడానికి ప్రభుత్వం మరో నూతన విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే వెల్లడించారు. "ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సమావేశాలు" అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా గ్రామాల్లోనే ఉంటూ, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పారదర్శకంగా పరిష్కరిస్తున్నారని వివరించారు. *అవినీతికి పాల్పడితే ఉక్కుపాదమే - ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరిక:* గత గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని, అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చారని, అయితే కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శాఖల్లో కొందరు అధికారులు సిబ్బంది ఇంకా ఆ విధానాలను కొనసాగిస్తున్నారని , ప్రక్షాళన కోసం అటువంటి అధికారులు సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. "ఏ ప్రభుత్వ శాఖలోనైనా, ఏ అధికారి లేదా సిబ్బంది అయినా సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ అవినీతికి గానీ, లంచాలకు గానీ పాల్పడితే అస్సలు ఉపేక్షించేది లేదు అని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అవినీతి రహిత పారదర్శక పాలనకు తూట్లు పొడుస్తూ ఎవరైనా అధికారులు సిబ్బంది లంచాలు అడిగినా, అక్రమాలకు పాల్పడిన తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని, అటువంటి వారిపై కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది" అని స్పష్టం చేశారు. *మర్యాదపూర్వక కలయిక - శుభలేఖల అందజేత:* ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా, పలువురు కూటమి నాయకులు మరియు ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న పలు ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వారికి అందించి, రావలసిందిగా కోరారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే గారు వినతులు స్వీకరించి, వాటిని సత్వరమే పరిష్కరిస్తామని కొండంత భరోసా ఇచ్చారు. -----

1 hr ago
user_Sidanivenugopal
Sidanivenugopal
Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
9c487591-3ec9-42d5-972d-dcee51b38008

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతంలో, మంత్రి నిమ్మల రామానాయుడు తన స్వగ్రామమైన అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. పాలకొల్లు నుండి ఏడు కిలోమీటర్లు సైకిల్‌పై స్వగ్రామానికి చేరుకున్న మంత్రి, దారిపొడవునా ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అంతేకాకుండా, సొంత పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కు దున్ని, తన అభిమాన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం సెలవు రోజున కొంత సమయం దొరకడంతో ఆయన ఈ పనుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేసినట్లు తెలియజేశారు. రైతులందరూ ముందస్తుగా వరి నాటులు వేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలని రైతులకు సూచించారు. సొంత వ్యవసాయ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందం మరియు సంతృప్తిని ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
    1
    పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతంలో, మంత్రి నిమ్మల రామానాయుడు తన స్వగ్రామమైన అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొన్నారు. పాలకొల్లు నుండి ఏడు కిలోమీటర్లు సైకిల్‌పై స్వగ్రామానికి చేరుకున్న మంత్రి, దారిపొడవునా ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అంతేకాకుండా, సొంత పొలంలో కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కు దున్ని, తన అభిమాన వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆదివారం సెలవు రోజున కొంత సమయం దొరకడంతో ఆయన ఈ పనుల్లో పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేసినట్లు తెలియజేశారు. రైతులందరూ ముందస్తుగా వరి నాటులు వేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలని రైతులకు సూచించారు.

సొంత వ్యవసాయ పనుల్లో కార్మికులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందం మరియు సంతృప్తిని ఇస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
    user_Sidanivenugopal
    Sidanivenugopal
    Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    11 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.
    1
    ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.
    user_Vikram
    Vikram
    Bhimadole, Eluru•
    20 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    21 hrs ago
  • తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇరిగేషన్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేపటి నుంచి నీటి విడుదల చేపట్టనున్న తరుణంలో, ఈరోజు సమావేశం నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అధికారులను నిలదీశారు. కాలువల మరమ్మతులు, గట్ల పటిష్టీకరణ, రైతులకు నీటి సరఫరా వంటి కీలక అంశాలపై అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కాటన్ బ్యారేజ్ పరిస్థితి, కాలువల శుభ్రపరిచే పనులు, సాగునీటి సరఫరా అంశాలపై కూడా ఆయన అధికారులను నిశితంగా ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి ఆదేశాలు జారీ చేశారు.
    3
    తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇరిగేషన్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేపటి నుంచి నీటి విడుదల చేపట్టనున్న తరుణంలో, ఈరోజు సమావేశం నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అధికారులను నిలదీశారు.

కాలువల మరమ్మతులు, గట్ల పటిష్టీకరణ, రైతులకు నీటి సరఫరా వంటి కీలక అంశాలపై అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, కాటన్ బ్యారేజ్ పరిస్థితి, కాలువల శుభ్రపరిచే పనులు, సాగునీటి సరఫరా అంశాలపై కూడా ఆయన అధికారులను నిశితంగా ప్రశ్నించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి ఆదేశాలు జారీ చేశారు.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఖమ్మంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల, నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ కమ్మ మహాజన సంఘం ఉచిత మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో పాటు, ఈ సంఘం ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు, సేవలు చేసి ఖమ్మం ప్రజలందరికీ ఉపయోగపడాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.
    2
    ఖమ్మంలో కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల, నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ కమ్మ మహాజన సంఘం ఉచిత మెగా వైద్య శిబిరం మరియు మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలతో పాటు, ఈ సంఘం ఆధ్వర్యంలో అనేక మంచి కార్యక్రమాలు, సేవలు చేసి ఖమ్మం ప్రజలందరికీ ఉపయోగపడాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.