Shuru
Apke Nagar Ki App…
ఎమ్మిగనూరు పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన యు. ఎర్రన్నను స్థానిక బాబు ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, 3వ వార్డు ఇన్‌చార్జ్, జిల్లా చేనేత హస్తకళ విభాగపు అధ్యక్షులు చేనేత మల్లి, మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు కోరిశెట్టి మాల మధుబాబు, జామియ మసీద్ మాజీ ప్రెసిడెంట్, ఎమ్మిగనూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు కాసింబేగ్ మరియు సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ కలిసి ఎర్రన్నకు దుశాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. వారి పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.
P.VEERANNA
ఎమ్మిగనూరు పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన యు. ఎర్రన్నను స్థానిక బాబు ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, 3వ వార్డు ఇన్‌చార్జ్, జిల్లా చేనేత హస్తకళ విభాగపు అధ్యక్షులు చేనేత మల్లి, మాజీ కౌన్సిలర్, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు కోరిశెట్టి మాల మధుబాబు, జామియ మసీద్ మాజీ ప్రెసిడెంట్, ఎమ్మిగనూరు నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు కాసింబేగ్ మరియు సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ చాంద్ కలిసి ఎర్రన్నకు దుశాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. వారి పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలతో నిండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అభివృద్ధి రోడ్లపై రాజకీయ సందేశాన్ని ఇస్తూ రూపొందించిన ఒక ప్రచార పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ "గుంతల రోడ్డుకు విముక్తి!" అనే అంశాన్ని తెలియజేస్తోంది.1
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 34,800 జీతం లభిస్తుంది కాబట్టి అభ్యర్థులు దీనికి తప్పక అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియో కోసం 'Cryancreations5191' యూట్యూబ్ ఛానల్ ఐడీని సందర్శించవచ్చు.1
- ఆదోని ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ప్రభుత్వ రేషన్ దుకాణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు ఉద్దేశ్యం నెరవేరేలా చూడాలని ఆయన కోరారు. దీనితో పాటు ఆదోని గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా నడుస్తున్న బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులైన ఎక్సైజ్ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని కోరారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ప్రస్తుతం సాగవుతున్న వ్యవసాయ పంట పొలాల్లో విత్తనపత్తి సాగు గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం ఈ మండలంలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేసే రైతులు, ఈ ఏడాది ఈ పంటను సాగు చేయడం తగ్గించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వరి, వేరుశెనగ, మిరప పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విత్తనోత్పత్తి పంట సాగు స్థానంలో రైతన్నలు ఈ ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.1
- జానకి అమ్మ చివరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జానకి అమ్మ, సింగర్ సునీత ఇద్దరూ కలిసి పాటలు పాడుతూ, ఎంతో సరదాగా గడిపారు. వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.1
- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, ఘనంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా ఉదయం నుంచే గ్రామ దేవతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు బొడ్రాయి చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఊరు, వాడ అంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో పాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక చొరవతో ఉచిత క్యాన్సర్ పరీక్షల మెగా వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, రాయలసీమ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఒక్కో పరీక్షకు రూ. 15 వేల విలువైన పరీక్షలను ప్రజలకు పూర్తిగా ఉచితంగా అందించారు. నంద్యాల జిల్లా ప్రజలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించిన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రారంభ సభలో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ఇటీవల తాను విజయవాడలో ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసినప్పుడు నంద్యాల జిల్లాలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన బాలకృష్ణ, నంద్యాల ప్రజల కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని, అత్యాధునిక పరీక్షల యంత్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్, టీడీపి సీనియర్ నాయకుడు, బాలకృష్ణ వీరాభిమాని అయిన కట్టుబడి శ్రీనివాస నాయుడు చొరవతోనే నెహ్రూ నగర్‌లో ఈ మొదటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరానికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలకు, అలాగే హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రి వైద్య బృందం, స్థానిక వైద్యులు, వాలంటీర్లు, టీడీపి శ్రేణులకు ఎంపీ శబరి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పీటీసీ నాగేశ్వరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నందికొట్కూరు బాలకృష్ణ అసోసియేషన్ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ సలహా కమిటీ సభ్యుడు కురువ రమేష్, టీడీపీ నాయకులు వెంకటేశ్వరశర్మ, బంగారు వెంకటేశ్వర్లు, గుణశేఖర్ రెడ్డి, రఘురామిరెడ్డి, పారుమంచాల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.3
- ఎమ్మిగనూరులో ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందిన యు. ఎర్రన్నకు ఘన సన్మానం జరిగింది. ఆయన పదవీ విరమణ చేసిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.1