భూ , వివాదంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య , గొడ్డలితో దాడి.. సంఘటనా స్థలంలోనే మృతి వర్ని, ( ఆగస్టు 25) : నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మైనం వెంకటేష్ అలియాస్ వెంకన్న దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ భూమి సరిహద్దు వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. తగిలిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 392కు సంబంధించిన వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో వెంకన్నకు, అదే గ్రామానికి చెందిన నారాయణకు కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో నారాయణ గొడ్డలితో వెంకన్నపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెంకన్న సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వర్ని పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. నిందితుడిగా అనుమానిస్తున్న నారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. భూ సరిహద్దు వివాదమే హత్యకు ప్రధాన కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాజీ సర్పంచ్ వెంకన్న హత్యతో తగిలిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భూ , వివాదంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య , గొడ్డలితో దాడి.. సంఘటనా స్థలంలోనే మృతి వర్ని, ( ఆగస్టు 25) : నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం తగిలిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మైనం వెంకటేష్ అలియాస్ వెంకన్న దారుణ హత్యకు గురయ్యాడు. వ్యవసాయ భూమి సరిహద్దు వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. తగిలిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 392కు సంబంధించిన వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో వెంకన్నకు, అదే గ్రామానికి చెందిన నారాయణకు కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ సమయంలో నారాయణ గొడ్డలితో వెంకన్నపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వెంకన్న సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వర్ని పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. నిందితుడిగా అనుమానిస్తున్న నారాయణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. భూ సరిహద్దు వివాదమే హత్యకు ప్రధాన కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాజీ సర్పంచ్ వెంకన్న హత్యతో తగిలిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి *రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది* *-పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి – పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా - 'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్ నిజామాబాద్, ఆగస్టు 25,2026: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు. అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు. అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ అన్నారు. మార్కెట్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పి. రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి శ్రీమతి భవానీ శ్రీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య లు పాల్గొన్నా3
- సిరికొండ మండల కేంద్రంలో చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో మంగళవారం చిన్నారులతో హనుమాన్ చాలీసా పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చిన్నారులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.1
- రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* *రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా భాగ్యనగర్ తరలిన కామారెడ్డి నాయకులు* 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తూ, ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరహార దీక్షకు సంఘీభావంగా కామారెడ్డి పట్టణ బీజేపీ కౌన్సిలర్ లు, నాయకులు బయల్దేరటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ 'ఫీజుల బకాయి - బిజెపి లడాయి' పేరుతో తెలంగాణ బిజెపి నేత ఎన్. రామచందర్ రావు చేపట్టిన 2 రోజుల నిరాహార దీక్షకు యువత నుండి వెల్లువెత్తుతున్న మద్దతు వస్తుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం ఇకనైనా ఆపాలనీ, ఫీజుల బకాయిలను కాంగ్రెస్ సర్కార్ తక్షణమే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు కి మద్దతుగా *కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్ లు, మరియు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలినట్లు తెలిపారు.1
- బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా పనిచేయాలి: జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జగిత్యాల జిల్లా కమిటీలలో నూతనంగా నియమితులైన నాయకులకు జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు బీసీ రమణ హైదరాబాద్ లో నియామక పత్రాలు అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు బీసీల హక్కుల సాధనకు క్రమశిక్షణతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాంబారి కళావతి, కస్తూరి నరేష్, ఆడెపు సత్యం, అల్లే సుదర్శన్, సిరికొండ చంద్రన్న, ఎనుగుర్తి శ్రవణ్, రాజేష్, రాజ శేఖర్, చెట్పెల్లి సురేష్, గుండేటి మారుతి పాల్గొన్నారు.4
- ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతుల అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, అలాగే కూరగాయలు, పూల తోటల సాగు చేస్తున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రత్యేక దృష్టి.. పక్కా కార్యాచరణ సత్పలితాలు ఇస్తున్నాయి. ప్రతి వారం జిల్లా కలెక్టర్ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న రైతులను నేరుగా కలిసి సాగు విధానాలు, పంట దిగుబడి, ఆదాయం తదితర వివరాలు సేకరిస్తూ.. ప్రభుత్వ సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్, కూరగాయలు, పూల మొక్కల సాగుతో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. కరపత్రాలు రైతులకు పంచి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఉద్యానవన, వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతో నిర్వహించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 420 ఎకరాల్లో రైతులు వరి సాగు నుంచి ఆయిల్ పామ్ సాగులోకి మారారు. 1250 ఎకరాల్లో కూరగాయల సాగు ఎల్ నినో ప్రభావం, ఇబ్బందులు అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆదాయం పొందాలనే ఉద్దేశం జిల్లాలోని రైతులు దాదాపు 1250 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు, 35 ఎకరాల్లో వివిధ రకాల పూల మొక్కలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల సాగుతో రైతులకు నిరంతర ఆదాయం సమకూరుతున్నది.సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికి 25 నుంచి ముప్పై ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ తోటల సాగు వైపు రైతులు మారారు. ఈ సీజన్లో జిల్లాలో ఇప్పటివరకు 162 మంది రైతులు 420 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మొదటి మూడు ఏండ్లపాటు అంతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం ఆయిల్ పామ్ ఒక టన్నుకు రూ. 23 వేలపైగా ధర ఉంది. జిల్లాలో సంప్రదాయ వరి సాగుకు స్వస్తి పలుకుతూ.. మిగితా పంటలు సాగు చేస్తున్న ఆదర్శ రైతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రతి మంగళవారం క్షేత్రస్థాయిలో కలిసి .. సాగు విధానాలు, దిగుబడి, లాభాలు తదితర అంశాలు తెలుసుకొని.. అభినందిస్తున్నారు. రెండు ఎకరాల్లో బంతి పూల సాగు గంభీరావుపేట మండలం గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం తనకు ఉన్న మూడున్నర ఎకరాల నుంచి రెండు ఎకరాలలో జూలైలో బంతి పూల సాగు చేపట్టారు. ఈ పంట నాటిన 60-65 రోజుల నుంచి సెప్టెంబర్ నుండి ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. ప్రతి 2-3 రోజుల వ్యవధిలో పూల కోత చేయవచ్చు, ఇది 60-75 రోజుల పాటు కొనసాగుతుంది. ఎకరానికి సుమారు 45-50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రెండు ఎకరాల సాగుకు గాను రైతు రూ. 50 వేల నుంచి రూ. 60వేల వరకు ఖర్చు చేశారు. ఇందులో ఉద్యాన శాఖ ద్వారా విత్తనాలు, ఎరువులకు కలిపి 50% రాయితీ లేదా ఎకరానికి రూ. 8వేల చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాల వరకు రాయితీ అందనుంది. రైతుకు సగటున ఒక్కో కిలో బంతి పూలకు రూ. 60/- ధర లభిస్తుంది. దసరా, దీపావళి, శుభకార్యాలు, అయ్యప్ప పూజా కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే ఉంది. జిల్లా కలెక్టర్ అభినందన గజ సింగవరంలో రైతు బోయిని మల్లేశం వరి సాగును వదిలి బంతి పూల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? పంట ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది? ఎంత ఆదాయం వస్తుంది? అనే వివరాలను రైతు మల్లేశంను అడిగి తెలుసుకున్నారు. అతడిని శాలువాతో సన్మానించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వరి పంటకు ప్రత్యామ్నాయంగా బంతి పూల సాగు చేయడం అభినందనీయమని కొనియాడారు. మిగితా రైతులు ఆదర్శంగా తీసుకొని తమకు ఉన్న భూమిలో ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందాలని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. ఉద్యానవన శాఖ, ఇతర శాఖల నుంచి వచ్చే ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. పరిశీలనలో సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.1
- ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి కామారెడ్డి జిల్లా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి: అదనపు కలెక్టర్ విక్టర్ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ పిలుపునిచ్చారు. మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామం లో డీఎఫ్‌ఓ నీరజ్, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముకుంద రెడ్డి, అధికారులు, గీత కార్మికులతో కలిసి అదనపు కలెక్టర్ విక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాఘవపూర్‌లో 1,200 ఈత మొక్కలను నాటారు. అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వన మహోత్సవం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాఘవపూర్‌లో 1,200 ఈత మొక్కలు నాటినట్లు తెలిపారు. జిల్లాలో వివిధ శాఖలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా, ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, అవి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రవి తేజ, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, పీడీ మెప్మా శ్రీధర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గీత కార్మికులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ : వృద్ధురాలి బంగారు పుస్తెలతాడు చోరీ కేసు ను చేదించిన పోలీసులు వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లిన కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణం సాయి నగర్ కాలనీకి చెందిన 68 ఏళ్ల బాలెశెట్టి సులోచన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్లినట్లు తెలిపారు. ఈ ఘటన పై క్రైం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. దయారా స్ట్రీట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన చాకలి మొగులయ్య (34) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడి నుంచి చోరీ కి గురైన 4 లక్షల 50 వేల విలువ గల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి పై గతంలో ఆటో దొంగతనం, రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులు ఉన్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన క్రైమ్ టీం నర్సింలు, మల్లేశం ను ఇన్‌స్పెక్టర్ మహేష్ అభినందించారు.1