ఇట్లా మామిడిపల్లి దళితులభూములను పెత్తందారుల భూకబ్జా. రామభద్రపురం సెప్టెంబర్ 15. ఇట్లా మామిడిపల్లి దళితులు ఇందిరమ్మ కాలం నుంచి సాగు చేస్తున్న భూములు సుమారుగా 15 ఎకరాలు సర్వే నంబర్ 149,149.8 ,150.7,158,188 ఈ భూములు సాగు చేస్తున్న డి పట్టా భూములు ఆ భూములను సాగు చేస్తుండగా కొంతమంది జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2024 రీ సర్వే సమయంలో కొంత భూమి విజయనగరం వాస్తవ్యులు పేరుమీద కొంత భూమిని ఆన్లైన్ చేయించి ఇట్లా మామిడిపల్లి గ్రామపెద్దలు అమ్మేశారు. ఈ భూమి విషయమై తాసిల్దార్ కు ఆర్డీవో కు కలెక్టర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేసాము. ఈరోజు వరకు స్పందన లేదు. మంగళవారం సిఐటియు మండల నాయకులు బలస శ్రీను ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆఫీస్ దగ్గర దళితులు ధర్నా చేయడం జరిగింది. పురుగుల మందుతో నిరసన తెలిపారు. ధర్నా విషయమై తాసిల్దార్ అజూరఫీ జాన్ స్పందించి చర్యలు తీసుకుంటామని మరియు భూమికి మీద వేసిన కంచెను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో దళితులు సానుకూలంగా స్పందించి ధర్నాను తాత్కాలికంగా ఆపేశారు. తాసిల్దార్ స్పందించకపోతే మరల తాసిల్దార్ఆఫీస్ ముట్టడేస్తామని మండల నాయకులు బలసశ్రీను హెచ్చరించారు. ఈ ధర్నాలో పాల్గొన్నవారు అక్కేరుపులక్ష్మణ, జలగం లక్ష్మణ, రాంవరపు సత్యం, జంగంసూర్యనారాయ, అక్కెరపు ఈశ్వర్ రావు, అక్కెరపుసింహాచలం తదితరులుపాల్గొన్నారు .
ఇట్లా మామిడిపల్లి దళితులభూములను పెత్తందారుల భూకబ్జా. రామభద్రపురం సెప్టెంబర్ 15. ఇట్లా మామిడిపల్లి దళితులు ఇందిరమ్మ కాలం నుంచి సాగు చేస్తున్న భూములు సుమారుగా 15 ఎకరాలు సర్వే నంబర్ 149,149.8 ,150.7,158,188 ఈ భూములు సాగు చేస్తున్న డి పట్టా భూములు ఆ భూములను సాగు చేస్తుండగా కొంతమంది జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2024 రీ సర్వే సమయంలో కొంత భూమి విజయనగరం వాస్తవ్యులు పేరుమీద కొంత భూమిని ఆన్లైన్ చేయించి ఇట్లా మామిడిపల్లి గ్రామపెద్దలు అమ్మేశారు. ఈ భూమి విషయమై తాసిల్దార్ కు ఆర్డీవో కు కలెక్టర్ గారికి పలుమార్లు ఫిర్యాదు చేసాము. ఈరోజు వరకు స్పందన లేదు. మంగళవారం సిఐటియు మండల నాయకులు బలస శ్రీను ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆఫీస్ దగ్గర దళితులు ధర్నా చేయడం జరిగింది. పురుగుల మందుతో నిరసన తెలిపారు. ధర్నా విషయమై తాసిల్దార్ అజూరఫీ జాన్ స్పందించి చర్యలు తీసుకుంటామని మరియు భూమికి మీద వేసిన కంచెను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో దళితులు సానుకూలంగా స్పందించి ధర్నాను తాత్కాలికంగా ఆపేశారు. తాసిల్దార్ స్పందించకపోతే మరల తాసిల్దార్ఆఫీస్ ముట్టడేస్తామని మండల నాయకులు బలసశ్రీను హెచ్చరించారు. ఈ ధర్నాలో పాల్గొన్నవారు అక్కేరుపులక్ష్మణ, జలగం లక్ష్మణ, రాంవరపు సత్యం, జంగంసూర్యనారాయ, అక్కెరపు ఈశ్వర్ రావు, అక్కెరపుసింహాచలం తదితరులుపాల్గొన్నారు .
- వినాయక నిమజ్జనాలపై పోలీసుల పటిష్ఠ బందోబస్తు........... సిపి గారి ఆదేశాల మేరకు నిమజ్జన ప్రాంతాలతో పాటు అక్కడికి చేరుకునే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు... నిమజ్జనాల సందర్భంగా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు...తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచిన అధికారులు...నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచిన పోలీసు యంత్రాంగం...1
- పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ (DISHA) సమీక్షా సమావేశము అనంతరము అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పత్రికా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- శ్రీరంగపట్నం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు1
- రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి.......... అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1
- విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం, మర్రివలస , అడవి కొత్తవలస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు టిడిపి పార్టీలో భారీ చేరికలు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో.. విజయనగరం :మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సారధ్యంలో విజయనగరం మంత్రి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు దత్తిరాజేరు మండలం మరడాం, మర్రివలస, అడవి కొత్తవలస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు పార్టీలో చేరిక మాజీ వార్డు మెంబర్ లతో సహా పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం తీర్థం తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొండపల్లి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగిన ఉండాలని సూచించిన మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయంతో ముందుకు సాగాలని చూచిన స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కష్టపడి పనిచేయాలని ఆదేశం తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తగిన ఫలితం దక్కుతుంది.2
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్‌లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.1
- యలమంచిలి ఊటాడ గ్రామాల్లో రూ.104.58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ 104.58 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, ఊటాడ, యలమంచిలి, గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో రూ 104.58 లక్షల ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను కూటమి నాయకులు ప్రారంభించారు. యలమంచిలి మండల టిడిపి అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు దగ్గరుండి కార్యక్రమానికి పర్యవేక్షించారు1