logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గజ్వేల్ ప్రజ్ఞా పూర్ డిపో ముందు కార్మికుల నిరసన సమ్మె తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2 hrs ago
user_B Narsimhulu
B Narsimhulu
Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
2 hrs ago

గజ్వేల్ ప్రజ్ఞా పూర్ డిపో ముందు కార్మికుల నిరసన సమ్మె తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్ మీద మీరు చేసిన కుట్రలు, మీ అబద్ధాలు, మీ మోసపూరిత గారడి - కేటీఆర్
    1
    ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు.. కేసీఆర్ మీద మీరు చేసిన కుట్రలు, మీ అబద్ధాలు, మీ మోసపూరిత గారడి - కేటీఆర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
    1
    బెజ్జంకి మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో బుధవారం UKG విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ల తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కార్యక్రమం అరుదని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, శిరీష, హరీష పాల్గొన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.
    1
    మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రయాణికులు అత్యవసరంగా ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు అంత్యక్రియలకు వెళ్లేవారికి ఆసుపత్రులకు వెళ్లే వారికోసం అత్యవసర సర్వీసులకు సందర్భంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ప్రైవేట్ బస్సులు తాత్కాలిక సిబ్బందితో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సమన్వయంతో బస్సుల నిర్వహిస్తామని తెలిపారు ఎవరికైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్9391942254కు పది నిమిషాలలో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు .
    1
    ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రయాణికులు అత్యవసరంగా ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు అంత్యక్రియలకు వెళ్లేవారికి ఆసుపత్రులకు వెళ్లే వారికోసం అత్యవసర సర్వీసులకు సందర్భంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ప్రైవేట్ బస్సులు తాత్కాలిక సిబ్బందితో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సమన్వయంతో బస్సుల నిర్వహిస్తామని తెలిపారు ఎవరికైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్9391942254కు పది నిమిషాలలో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు
.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    11 hrs ago
  • నవనారసింహ స్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరినదికి వెళ్ళి బిందె తీర్థం ఆలయానికి తీసుకు వచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో లోకకళ్యాణం కొరకువేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు…కలశగణపతి విశ్వక్షేణ ఆరాధన… కలశ స్థాపన…. పంచామృతాలతో శ్రీ యోగానంద…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మూల మూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకర అష్టోత్తర శతనామర్చనలు, దూప, దీప నివేదన సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈనెల 25న అన్నకూటోత్సవము, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ చార్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
    1
    నవనారసింహ స్వామి క్షేత్రాలలో ఒక్కటైన జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలతో అర్చకులు గోదావరినదికి వెళ్ళి బిందె తీర్థం ఆలయానికి తీసుకు వచ్చారు. శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో  లోకకళ్యాణం కొరకువేద పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య సంకల్ప పూజలు…కలశగణపతి విశ్వక్షేణ ఆరాధన… కలశ స్థాపన…. పంచామృతాలతో  శ్రీ యోగానంద…శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి మూల మూర్తులకు పంచోపనిషత్తులతో అభిషేకము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకర అష్టోత్తర శతనామర్చనలు, దూప, దీప నివేదన సప్త హారతులు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. నవరాత్రి ఉత్సవాల్లో ప్రధాన కార్యక్రమాలు ఈనెల 25న అన్నకూటోత్సవము, 
26న సహస్ర కలశాభిషేకం, 
27న చందనోత్సవం,
28న పల్లవ ఉత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ అర్చకులు నంబి అరుణ్ కుమార్ చార్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని తన తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించింది రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్రిడ్జి చూపించి మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన చిల్లర ప్రచారాలకు చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టుకు మా పార్టీ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను – కేటీఆర్
    1
    నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని తన తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించింది
రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్రిడ్జి చూపించి మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన చిల్లర ప్రచారాలకు చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది
తెలంగాణ హైకోర్టుకు మా పార్టీ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను – కేటీఆర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ బిజెపి నిర్వహించిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బిజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. డంపింగ్ యార్డు ను రద్దు చేయాలని వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై పై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు బిజెపి శ్రేణులకు సముదాయించిన ఆందోళన విరమించకపోవడంతో పోలీసులకు బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు బిజేపి జిల్లా అధ్యక్షుడితో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
    1
    కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు రద్దు చేయాలని కోరుతూ బిజెపి నిర్వహించిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. బిజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆద్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. డంపింగ్ యార్డు ను రద్దు చేయాలని వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై పై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దీంతో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు బిజెపి శ్రేణులకు సముదాయించిన ఆందోళన విరమించకపోవడంతో పోలీసులకు బిజెపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీసులు బిజేపి జిల్లా అధ్యక్షుడితో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
    2
    సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.