logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”

1 hr ago
user_MD. YOUSUF ALI KHAN
MD. YOUSUF ALI KHAN
కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
1 hr ago

“పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన 17వ రోజుకు.. శక్తిలో కలుపొద్దంటూ నిరసన”

More news from తెలంగాణ and nearby areas
  • కోరుట్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన 1181 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌ జగిత్యాల జిల్లా కోరుట్ల: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కోరుట్లలో మున్సిపల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన 1181 జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఉద్యోగ భద్రత లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి, తమ సేవలను కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    కోరుట్లలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఆందోళన
1181 జీవోను రద్దు చేయాలని డిమాండ్‌

జగిత్యాల జిల్లా కోరుట్ల: ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కోరుట్లలో మున్సిపల్ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన 1181 జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.
ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఉద్యోగ భద్రత లేకుండా చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్‌సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి, తమ సేవలను కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    Insurance Agent జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై 420 హామీల కు సంబంధించి 420 ఫీట్ల ప్లేక్షిని ముద్రించి నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలను అమలు చేయడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 420 ఫీట్ల ప్లెక్సీ పై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్లెక్సీ పై ముద్రించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ కొరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని అలవికాని హామీలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కుటుంబ సభ్యుల ఎదుగుదల ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
    4
    కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై 420 హామీల కు సంబంధించి 420 ఫీట్ల ప్లేక్షిని ముద్రించి నిరసన తెలిపిన బిఆర్ఎస్ నాయకులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలను అమలు చేయడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 420 ఫీట్ల ప్లెక్సీ పై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్లెక్సీ పై ముద్రించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌక్ కొరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారని అలవికాని హామీలను కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి కుటుంబ సభ్యుల ఎదుగుదల ద్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్న సిరిసిల్ల జిల్లా. *సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.* *సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.* *సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.* తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్‌ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. *వినాయకుడి బోధనలతో సైబర్‌ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.* తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్‌ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్‌ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు. *జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.* విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. *ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...* “Prevention is Better than Cure” అనే విధంగా సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్‌ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్, కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    జన్న సిరిసిల్ల జిల్లా.

*సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యం.*

*సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థుల భాగస్వామ్యమే కీలకం.*

*సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.*
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే కార్యాక్రమంలో భాగంగా జిల్లా సైబర్ టీమ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమనికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు.
అనంతరం ఎస్పీ గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాతు..నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని , సైబర్‌ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని తెలిపారు.
సైబర్‌ నేరగాళ్లు అనుసరిస్తున్న నూతన మోసపూరిత విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని , ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్‌లు, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ నంబర్, ఆధార్ వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. 
అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్‌ నేరాలపై అవగాహన పెంపొందించుకోని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించి , సైబర్‌ నేరాల నివారణలో కీలక పాత్ర పోషించాలన్నారు.
సైబర్‌ మోసానికి గురైన వెంటనే  భయబ్రాంతులకు గురికాకుండా 1930కు కాల్ చేసి లేదా National Cyber Crime Reporting Portal ద్వారా ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
*వినాయకుడి బోధనలతో సైబర్‌ భద్రతపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.*
తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్‌ భద్రత అవగాహన పోస్టర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు.వినాయకుడి నుంచి సైబర్‌ భద్రత పాఠాలు’ అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్‌ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించారు.
*జిల్లా సైబర్ సెల్ టీమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన.*
విద్యార్థులకు లోన్ యాప్స్, షేర్ మార్కెట్, ఏపీకే ఫైల్స్, కొరియర్ ,క్రెడిట్ కార్డ్,మ్యాట్రి మోని,లాటరీ గిఫ్ట్,మల్టీ లెవల్ మార్కెటింగ్ ,క్రిప్టో కరెన్సీ, డిజిటల్ అరెస్ట్, లాటరీ ఫ్రాడ్, గిఫ్ట్ ఫ్రాడ్ సోషల్ మీడియా తదితర మోసలపై విద్యార్థులకు  అవగాహన కల్పించారు.
*ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ...*
“Prevention is Better than Cure” అనే విధంగా సైబర్‌ భద్రతలో ముందస్తు అప్రమత్తతే ముఖ్యమని, సైబర్‌ నేరాలపై తమకు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు.సైబర్‌ నేరాల నివారణలో విద్యార్థులు కూడా తమ వంతు బాధ్యతగా తీసుకుని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సైబర్‌ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
అవగాహన సదస్సులో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్.ఐ జునైద్,నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సైబర్ సెల్ సిబ్బంది గంగిరెడ్డి, రాజు,శ్రీకాంత్ , విజేయ్,  కలశాల అధ్యాపక బృదం, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    9 hrs ago
  • కారు మబ్బుల కనిపించనీ మేఘాలు వర్ష సూచన లేదు కప్పటాలియ్ ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు వర్షకనిపించడం లేదు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎదిరిచూపులు వర్షం రాదు పంట పండదు అన్నదాతకు అన్ని కష్టాలే వ
    3
    కారు మబ్బుల కనిపించనీ మేఘాలు 
వర్ష సూచన లేదు కప్పటాలియ్
ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు వర్షకనిపించడం లేదు 
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల  వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రజలు ఎదిరిచూపులు 
వర్షం రాదు పంట పండదు 
అన్నదాతకు అన్ని కష్టాలే వ
    user_Venkateshwar Mittapally
    Venkateshwar Mittapally
    ధర్‌పల్లి, నిజామాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    డిసిసి కార్యాలయంలో వై.ఎస్.ఆర్ వర్ధంతి

సంక్షేమానికి చిరునామా వై.ఎస్.ఆర్ - ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం
మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం హాజరై, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్, గడ్డం విలాస్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు  భాస్కర్ రెడ్డి తదితరులతో కలిసి వై.ఎస్.ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..
స్వర్గీయ డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలిచారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్, 108, ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారని, దేశంలో సంక్షేమం అంటే గుర్తుకొచ్చే ఏకైక పేరు వై.ఎస్.ఆర్ అని కొనియాడారు.
ముఖ్యంగా కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో వై.ఎస్.ఆర్ పాత్ర మరువలేనిదని, ఆనాడు ఆయన నిర్మించిన ప్రాజెక్టులు, కాలువల వల్లే నేడు జిల్లాలో వ్యవసాయం సుభిక్షంగా ఉందని, శాతవాహన యూనివర్సిటీ తో పాటు కొండగట్టు, మంథనిలో JNTU, కోరుట్లలో వెటర్నరీ యూనివర్సిటీ వంటివి ఆయన హయాంలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు.
2009లో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం చాలా బాధాకరమని, వై.ఎస్.ఆర్ ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఉండేదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ ఆశయాన్ని నెరవేర్చి ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మడుపు మోహన్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం, అన్నమనేని నర్సింగారావు, వెన్న రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, విక్టర్, వంగల విద్యాసాగర్, కుంభాల రాజకుమార్, మాదాసు శ్రీనివాస్, గంగుల దిలీప్, మూల కృష్ణారెడ్డి, కర్రె పావని, ఫజల్, హాజీ, వసీం,ఇమ్రాన్ గని, సుంకే రాజు, దాసరి సందీప్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, మల్లారెడ్డి, ఫహద్, స్వప్న శ్రీ, మాలోతు మహాలక్ష్మి, పెంట శేఖర్, రాచర్ల పద్మ, సిరిపురం నాగప్రసాద్, సత్తినేని శ్రీకాంత్, మల్లారెడ్డి, కాశి పాక రాకేష్, శిల్పా, కూస రవీందర్, సుంకరి గణపతి, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* *ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* *మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు* *కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు* *టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను వంచించే పాలన కొనసాగుతుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను చెల్లించాలని లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు.గ్రామీణ ప్రాంతాలు నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ప్రభుత్వం ఫీజుబకాయలు ఇస్తుందన్న నమ్మకంతో ఉచిత విద్యను అందజేసిన కళాశాలలకు బకాయిలను ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని గమనించి ఫీజుబకాయలను విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతే రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్ లు పాల్గొనడం జరిగింది.
    1
    ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* 
*మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు*
*కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు*
*టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు*

*ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం* 
*మూతపడుతున్న డిగ్రీ కళాశాలలు*
*కాంగ్రెస్ పాలనలోను విద్యార్థులకు తప్పని ఇబ్బందులు*
*టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్..డాక్టర్ బాలు*
కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు పర్లపల్లి రవీందర్,డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో విద్యార్థులను వంచించే పాలన కొనసాగుతుందని గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విద్యార్థి వ్యతిరేక విధానాలని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఫీజు బకాయాలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులే కాకుండా కళాశాలల యాజమాన్యాలు అందులో పని చేస్తున్న అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పూర్తి ఫీజు బకాయిలను చెల్లించాలని లేకపోతే టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతుందని ప్రభుత్వానికి తెలియజేశారు.గ్రామీణ ప్రాంతాలు నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న డిగ్రీ కళాశాల పరిస్థితి అద్వాన్నంగా తయారైందని ప్రభుత్వం ఫీజుబకాయలు ఇస్తుందన్న నమ్మకంతో ఉచిత విద్యను అందజేసిన కళాశాలలకు బకాయిలను ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ఈ విషయాన్ని గమనించి ఫీజుబకాయలను విడుదల చేయాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ బాధ్యులు మోతే రాజిరెడ్డి,లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ పటేల్ లు పాల్గొనడం జరిగింది.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేలా రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు ఆయన సేవలను, ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్న నేతలు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగము,ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పర్శరం,ఆరేపల్లి బాలు,రాములు,సర్పంచ్ సాధి,చుక్క శేఖర్,బైరివేని రాము,బండి పర్శరం, బాలసాని శ్రీనివాస్, భాను,హారిక,మిరాల శ్రీనివాస్, రాజేశ్వరరావు, చందు, మల్లేశం, సందీప్,జలందర్ రెడ్డి, ప్రశాంత్, చోటు, గణేష్, భారత్, తిరుపతి, శ్యామ్, కిషన్, గణేష్,రాజిరెడ్డి,చందు,యోగి తదితరులు పాల్గొన్నారు
    3
    తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు 
తంగళ్లపల్లి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు 
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిగేలా రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం
వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు ఆయన సేవలను, ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్న నేతలు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మునిగెల రాజు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరాళ్ల నర్సింగము,ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పర్శరం,ఆరేపల్లి బాలు,రాములు,సర్పంచ్ సాధి,చుక్క శేఖర్,బైరివేని రాము,బండి పర్శరం, బాలసాని శ్రీనివాస్, భాను,హారిక,మిరాల శ్రీనివాస్, రాజేశ్వరరావు, చందు, మల్లేశం, సందీప్,జలందర్ రెడ్డి, ప్రశాంత్, చోటు, గణేష్, భారత్, తిరుపతి, శ్యామ్, కిషన్, గణేష్,రాజిరెడ్డి,చందు,యోగి తదితరులు పాల్గొన్నారు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కవితమ్మ మీద సోషల్ మీడియా లో అనుచిత పోస్టలు పెట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలి.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ పెట్టిన వారిమీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ లోని ఒకటోవ పోలిస్ స్టేషన్ లో జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆద్వర్యంలో పోలిసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని కవితమ్మ మీద సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, మరియు X (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపులలో అత్యంత అసభ్యకరమైన, అవమానకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె అనిల్ మీద తక్షణమే చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ‌చేయడం జరిగిందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళ నాయకురాలి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి కవితమ్మ గౌరవాన్ని ప్రతిష్టను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళలోకానికి జరిగిన అవమానంగా భావించాలని. కానిస్టేబుల్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు అన్నారు. పవిత్రమైన పోలిస్ ఉద్యోగంలో ఉన్న అనిల్ ప్రజలకు చట్టపరంగా రక్షణ, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఈ విధంగా ఒక మహిళా రాజకీయ నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం పైన అతడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవ్వరూ అనేది కూడ తేల్చాలి. పోలీస్ శాఖ కూడ అతడి మీద శాఖాపరమైన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, మనకోండుర్ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా పార్టీ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, యండి హుస్సేన్, యండి రాజీ, మడిపల్లి వినీత్, బాండారి అభిరామ్, జిల్లా మహిళ నాయకురాలు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ అకాష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కవితమ్మ మీద సోషల్ మీడియా లో అనుచిత పోస్టలు పెట్టిన వారి పైన చర్యలు తీసుకోవాలి.గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా బాధ్యుడు తెలంగాణ రక్షణ సేన, కరీంనగర్
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కమెంట్స్ పెట్టిన వారిమీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ లోని ఒకటోవ పోలిస్ స్టేషన్ లో జిల్లా పార్టీ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్  ఆద్వర్యంలో పోలిసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని కవితమ్మ మీద సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, మరియు X (ట్విట్టర్) మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపులలో అత్యంత అసభ్యకరమైన, అవమానకరంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె అనిల్ మీద తక్షణమే చట్టపరంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు ‌చేయడం జరిగిందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్  అన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళ నాయకురాలి మీద  అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి కవితమ్మ గౌరవాన్ని ప్రతిష్టను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళలోకానికి జరిగిన అవమానంగా భావించాలని. కానిస్టేబుల్ అనిల్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు అన్నారు. పవిత్రమైన పోలిస్ ఉద్యోగంలో ఉన్న అనిల్ ప్రజలకు  చట్టపరంగా రక్షణ, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఈ విధంగా ఒక మహిళా రాజకీయ నాయకురాలిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం పైన అతడి వెనుక ఉన్న వ్యక్తులు ఎవ్వరూ అనేది కూడ తేల్చాలి. పోలీస్ శాఖ కూడ అతడి మీద శాఖాపరమైన విచారణ జరిపి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు
గుంజపడుగు హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ  ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, మనకోండుర్  నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నియోజకవర్గం నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా పార్టీ నాయకులు  రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, యండి హుస్సేన్, యండి రాజీ, మడిపల్లి వినీత్, బాండారి అభిరామ్, జిల్లా మహిళ నాయకురాలు జంగ అపర్ణ, అసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ అకాష్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్ : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో NSUI నాయకుడు మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగిందన్నారు. ఆయన పరిపాలనను ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకునే స్థాయిలో వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్‌కే దక్కుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుకునే అవకాశం కల్పించారని తెలిపారు. అలాగే జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ రైతుల పొలాలకు నీరు అందించేందుకు కృషి చేసిన రైతు పక్షపాతి వైఎస్ఆర్ అని కొనియాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలు నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే వైఎస్ఆర్ పాలన లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు. రామగుండం పట్టణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక ఖాళీ స్థలాన్ని చూపించాలని నగర మేయర్ మహంకాళి స్వామి గారిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. వైఎస్ఆర్ జ్ఞాపకార్థం రామగుండంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత వైఎస్ఆర్ : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 
గోదావరిఖని: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో NSUI నాయకుడు మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గారు హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాలన ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగిందన్నారు. ఆయన పరిపాలనను ప్రతిపక్ష నాయకులు సైతం మెచ్చుకునే స్థాయిలో వైఎస్ఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్‌కే దక్కుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుకునే అవకాశం కల్పించారని తెలిపారు. అలాగే జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ రైతుల పొలాలకు నీరు అందించేందుకు కృషి చేసిన రైతు పక్షపాతి వైఎస్ఆర్ అని కొనియాడారు.
వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న ప్రజా అనుకూల నిర్ణయాలు నేటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే వైఎస్ఆర్ పాలన లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు.
రామగుండం పట్టణంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఒక ఖాళీ స్థలాన్ని చూపించాలని నగర మేయర్ మహంకాళి స్వామి గారిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు. వైఎస్ఆర్ జ్ఞాపకార్థం రామగుండంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.