Shuru
Apke Nagar Ki App…
మల్కాపూర్‌లో ఇల్లు లేని నలుగురి గుర్తింపు.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రతిపాదనలు కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో శనివారం మండల తహసిల్దార్ అశోక్,హౌసింగ్ ఏఈ రాజేశ్వరి తో. కలసి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. నివాసానికి సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి, వారి వివరాలను స్వయంగా ధృవీకరించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులకు పంపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Yahia Ahmed
మల్కాపూర్‌లో ఇల్లు లేని నలుగురి గుర్తింపు.. ఇందిరమ్మ ఇళ్లకు ప్రతిపాదనలు కొండాపూర్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో శనివారం మండల తహసిల్దార్ అశోక్,హౌసింగ్ ఏఈ రాజేశ్వరి తో. కలసి ఇందిరమ్మ ఇళ్ల అర్హుల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. నివాసానికి సొంత ఇల్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను గుర్తించి, వారి వివరాలను స్వయంగా ధృవీకరించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత అధికారులకు పంపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.1
- గ్రామాభివృద్ధిపై చిన్న శంకరంపేటలో గ్రామసభ, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చిన్న శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో శనివారం నిర్వహించిన గ్రామసభలో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా దోమల నివారణ చర్యలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అలాగే గ్రామంలోని అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించి పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరుస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు.1
- గద్దెనెక్కిoచిన మేము గద్దెనుoడి దిoచగలము కూడా అంటూ చైర్మన్ కు ఎంఐఎం ప్రెసిడెంట్ అత్తర్ అహ్మద్ స్ట్రాంగ్ వార్నింగ్ జహీరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ ప్రకoపనులు మిత్రపక్షం ఎంఐఎం నుంచే చైర్మన్ కు షాక్ జహీరాబాద్ మున్సిపల్ రాజకీయంల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది తమ మద్దతుతో చైర్మన్ పీఠం ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ యూనుస్ ఇప్పుడు తమనె విస్మరిస్తూన్నరoటూ ఎంఐఎం పార్టీ జహీరాబాద్ ఇంచార్జ్ అత్తర్ అహ్మద్ బహిరంగంగా విరుచుకు పడ్డారు 8వ వార్డ్ కౌన్సిలర్ సోనీ ఇర్మీయా ఆధ్వర్యంలో వార్డులో పర్యటించిన అత్తర్ అహ్మద్ వార్డులోని అధ్వాన్నoగా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు1
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ3
- బూరుగుపల్లిలో గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాలకు సర్వం సిద్ధం పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లి గ్రామదేవత కోటమ్మ తల్లి బోనాల మహోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు భక్తుల రాకపోకలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పిలుపునిచ్చారు.1
- విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.4