ఇండ్ల గణనలో 2, 200 ఖాళీగా ఉన్న గృహాలు తహసీల్దార్ విజయ్ కుమార్ 3 నెలల కిందట హౌస్ రిజిస్ట్రేషన్ ఆపరేషన్స్ లో ఇండ్ల గణన చేశారాని అందులో 2, 200 ఇండ్లు లు ఖాళీగా ఉన్నాయని అందుకు రీసర్వే చేయాలని తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. మండలకేంద్రమైన సిద్ధవటం తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ఇండ్ల గణనపై ఎన్యుమరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఇండ్ల గణన సర్వేలో 2,200 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని తెలిసిందన్నారు. దీనిపై రీసర్వే చేసి ఎవరు ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ జిల్లాలో ఉన్నారో, ఏ మండలంలో ఉన్నారో, ఏ గ్రామంలో ఉన్నారో గుర్తించి ఖాళీ అయిన దానిపై ఎన్యుమరేటర్లు సెప్టెంబర్ 15వ తేదీలోపు రీ సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని సూచించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శివప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎన్యుమరేటర్లు, పాల్గొన్నారు.
ఇండ్ల గణనలో 2, 200 ఖాళీగా ఉన్న గృహాలు తహసీల్దార్ విజయ్ కుమార్ 3 నెలల కిందట హౌస్ రిజిస్ట్రేషన్ ఆపరేషన్స్ లో ఇండ్ల గణన చేశారాని అందులో 2, 200 ఇండ్లు లు ఖాళీగా ఉన్నాయని అందుకు రీసర్వే చేయాలని తహసీల్దార్ విజయ్ కుమార్ తెలిపారు. మండలకేంద్రమైన సిద్ధవటం తహసిల్దార్ కార్యాలయంలో గురువారం ఇండ్ల గణనపై ఎన్యుమరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఇండ్ల గణన సర్వేలో 2,200 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని తెలిసిందన్నారు. దీనిపై రీసర్వే చేసి ఎవరు ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ జిల్లాలో ఉన్నారో, ఏ మండలంలో ఉన్నారో, ఏ గ్రామంలో ఉన్నారో గుర్తించి ఖాళీ అయిన దానిపై ఎన్యుమరేటర్లు సెప్టెంబర్ 15వ తేదీలోపు రీ సర్వే చేసి నివేదికలు ఇవ్వాలని సూచించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ శివప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ మాధవి లత, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఎన్యుమరేటర్లు, పాల్గొన్నారు.
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు1
- నెల్లూరు నగరంలో మీలాడినవి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టా నుండి గాంధీ బొమ్మ వరకు భారీ బహిరంగ ర్యాలీ ముస్లిం సోదరులు అందరు కూడా కలిసి ముస్లిం సోదరులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంత ర్యాలీ కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు అదే క్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా తమ మత ప్రవక్త జయంతి సందర్భంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అంతా కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగించారు, ఈ ర్యాలీ దాదాపు కోటమిట్ట గాంధీ బొమ్మ జెండా వీధి పరిసర ప్రాంతాలలో సాయంత్రం 8 నుండి 9:30 వరకు కొనసాగించారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు, ఇటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేశారు, పండు వాతావరణం తలపించే విధంగా కోలాహలంగా ఈ ర్యాలీని ప్రశాంతంగా కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా మద్దతుగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన సోదరులందరూ భారతీయ జెండాను చేపట్టి సంఘీభావం తెలిపారు.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1